Author: admin

కొన్ని పేలవ ప్రదర్శనలతో ఇబ్బంది పడినా తరువాత పుంజుకుని ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్ ను సమం చేసుకుని అభిమానులను ఆనందంలో నింపింది భారత క్రికెట్ జట్టు. సూపర్ స్టార్స్ నిష్క్రమించినా కొత్త తరం ఆటగాళ్లతో కొత్త సవాళ్లను అధిగమించి అదరగొట్టింది నయా భారత్. దీని వెనుక కోచ్ గంభీర్ కృషి కూడా ఎంతో ఉంది. కష్టపడడం…మెరుగవడం అనే లక్షణాలతో కూడిన బలమైన జట్టు సంస్కృతిని నిర్మించడం అత్యంత కీలకమైన విషయమని గంభీర్ అన్నాడు. ఇంగ్లాండ్ తో 5వ టెస్టులో గెలిచిన తర్వాత ఆటగాళ్లతో మాట్లాడుతూ సిరీస్ ను 2-2తో ముగించడం అద్భుతమైనదని ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపాడు. మనం మరింత మెరుగవుతూ కష్టపడుతూనే ఉంటాం. క్రమం తప్పకుండా మెరుగవుతుంటే సుదీర్ఘ కాలం క్రికెట్లో ఆధిపత్యం కనబరచవచ్చు. సిబ్బంది, ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ జట్టు సంస్కృతి ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. ఇందులో భాగం కావాలని ఆటగాళ్లు కోరుకోవాలి. మనం సృష్టించాలనుకునేది…

Read More

ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు చురకలంటించారు. ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని అన్చేనారు. పార్లమెంటులో ఈ అంశంపై ప్రత్యేక చర్చలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక పోయరన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకేఒక్క అవకాశాన్ని కూడా వారు ఉపయోగించుకోలేకపోయారని సెటైర్లు వేశారు. తాజాగా ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ భద్రత విషయంలో ప్రతిపక్ష ధోరణి, నేతల్లో అభిప్రాయ భేదాలు పార్లమెంటు చర్చలో బయటపడ్డాయని, ఇలాంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదని ఆక్షేపించారు. ఎప్పుడూ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్లో దానిని అమలుచేయలేదని విమర్శించారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

Read More

రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 7వ తేదీ (జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, ఎన్నికల హామీ ప్రకారం చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ,రూ.5 కోట్లతో నేతన్నలకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు అంశాలపై తగిన ఆదేశాలిచ్చారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు రాగా వన్ డిస్ట్రిక్..వన్ ప్రొడక్ట్ విభాగంలో మొదటిసారి అవార్డు దక్కింది. ఈ అవార్డులను అధికారులు సీఎంకు చూపించారు.

Read More

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడి ధరాలీ గ్రామం వరదధాటికి అతలాకుతలమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్ ఢ్ నుంచి మెరుపు వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అలెర్ట్ చేసింది. ఘటనపై సీఎం ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితుల గురించి కేంద్రమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ప్రధాని మోడీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.

Read More

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై సుంకాలను మరింత పెంచుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ అమెరికా సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదని అన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి ఉండకూడదన్నారు. ఈసందర్భంగా సంప్రదాయాలకు ప్రత్యేక విలువలు ఉంటాయని, అవే చివరికి గుర్తింపు తెస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తును రూపొందించడంలో మనపై మనకు నమ్మకం ఉండాలన్నారు. మనలాంటి దేశాలకు, సంప్రదాయాలే నిజమైన బలాలని వ్యాఖ్యానించారు. మన దిగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా అయన మరోసారి సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని,…

Read More

ఇటీవల 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని తగ్గిస్తుందా..? డ్రైవింగ్ను దెబ్బతీస్తుందా..? అంటూ పెట్టిన ఓ పోస్టు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టిన నేపధ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. అవి నిరాధారమైనవని వివరించింది. సైంటిఫిక్ ప్రూఫ్స్, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని తెలిపింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్ తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు ఉండవని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇథనాల్ వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థ మెరుగు పడుతుందని వ్యాఖ్యానించింది. పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ.. అది చాలా తక్కువేనని తెలిపింది. కి.మీ. మేర సంప్రదాయ, ఇ20 ఇంధనం నింపిన వాహనాలకు జరిపిన పరీక్షలో పవర్, టార్క్,…

Read More

భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) తన 50 ఏళ్లకు పైగా కొనసాగిన రిజిస్టర్డ్ పోస్ట్‌ సేవలను సెప్టెంబర్ 1, 2025 నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాదాపు కొన్ని తరాలకు ఈ సర్వీసు ఒక భావోద్వేగం. ఇదివరకటి తరం ప్రజల జీవితాల్లో ఇదొక అంతర్భాగంగా ఇన్నేళ్లు కొనసాగింది. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ నోటిఫికేషన్‌ లు లేదా సమాచార లేఖలను వారి ఇళ్లకు పోస్ట్ మ్యాన్ అందించేవాడు. ఎందరి జీవితాల్లోనో ఎన్నో భావోద్వేగాలకు ఒక మాధ్యమంగా నిలిచిన ఈ సర్వీసు ఇక గతం కానుంది. ప్రైవేట్ కొరియర్ యాప్‌లు, ప్రస్తుతం నడుస్తున్న ట్రక్కింగ్ సేవలను ఉపయోగించే నేటి తరానికి ఇది కొత్తగా అనిపించినా ఒకప్పటి తరానికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సేవను ఇకపై అందించకుండ, దానిని స్పీడ్ పోస్ట్‌ సేవలలో విలీనం చేయాలని నిర్ణయించింది. డిజిటల్ యుగంలో…

Read More

భారత ప్రధానిగా ఇటివలే నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసిన రెండో నేతగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీని ఆయన అధిగమించారు. ఎక్కువ కాలం పని చేసిన భారత ప్రధానిగా మోడీ కంటే ముందు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. ఇదిలా ఉండగా…తాజాగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మైలురాయిని దాటారు. దేశ చరిత్రలో కేంద్ర హోంమంత్రిగా పని చేసిన రికార్డును అమిత్ షా సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న రికార్డును షా అధిగమించారు. మోడీ మొదటి పాలనా కాలంలో కేంద్ర హోంమంత్రిగా రాజ్ నాథ్ సింగ్ పని చేశారు. 2019లో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అమిత్…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో నో అడ్మిషన్ల బోర్డు చూసి చాలా ఆనందించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 1725 మంది విద్యార్థులున్న ఈ హైస్కూలులో ఈ ఏడాది అన్ని త‌ర‌గ‌తుల్లో 400 మందికి పైగా కొత్త విద్యార్థులు చేరడం ప్ర‌భుత్వ విద్య ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నమని పేర్కొన్నారు. “నో అడ్మిష‌న్ బోర్డు పెట్టి, అడ్మిష‌న్స్ క్లోజ్ చేశామ‌ని త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌జెపుతున్నా, మా పిల్లాడి ఒక్క‌డిని చేర్చుకోండి సార్“ అని బ‌తిమాలుతుంటే కాద‌న‌లేక‌పోతున్నామ‌ని చెబుతున్న హెడ్మాస్ట‌ర్ ఫ‌యాజుద్దీన్ గారికి, టీచ‌ర్లు, సిబ్బందికి ఈసందర్భంగా ఆయన తన హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌తి స్కూలులో ఇలాగే నో అడ్మిష‌న్ బోర్డులు క‌నిపించాలి. త‌ల్లిదండ్రుల్లో ప్ర‌భుత్వ విద్య ప‌ట్ల న‌మ్మ‌కం క‌ల్పించిన ఉపాధ్యాయులే ఏపీ మోడ‌ల్ ఎడ్యుకేష‌న్ తీర్చిదిద్దే ర‌థ‌సార‌ధులని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’…

Read More

టెండూల్కర్ -అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన చివరిదైన 5వ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ టెస్టులో గెలిచి సిరీస్ ను య 2-2తో సమం చేసింది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (9), జోష్ టంగ్ (0)లను భారత బౌలర్లు త్వరగానే ఔట్ చేశారు. అట్కిన్సన్ (17) చివరి వికెట్ గా వెనుదిరిగాడు. మహ్మద్ సిరాజ్ 5, ప్రసీద్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేసింది.

Read More