Author: admin

దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు తగ్గుతాయనే ప్రచారానికి తెర పడే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టతనిచ్చారు. స్థానాలు తగ్గవని చెప్పారు. ఇషా సెంటర్ లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆయన తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చిన అమిత్ షా స్థానిక బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఆయన కుమారుడు ప్రజల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క సీటు కూడా తగ్గదని తాము దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలను తిప్పికొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లు తెలిపారు. తమిళనాడుకు అన్యాయం చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వమని విమర్శించారు. డీఎంకే పైనా విమర్శలు గుప్పించారు. వచ్చే…

Read More

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో నేటి ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మోరిగావ్ ప్రాంతంలో నేటి తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించినట్లు తెలిపింది. ఈ భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనలకు గురై తమ నివాసాల నుండి బయటకు పరుగులు తీశారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.

Read More

భారతీయ సంస్కృతికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ పై ప్రశంసలు కురిపించారు. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగిసింది. దాదాపుగా 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మహా ఆధ్యాత్మిక వేడుకను అటు సంప్రదాయం, టెక్నాలజీ, వాణిజ్యం, ఆధ్యాత్మికతల మేలు కలయికగా హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అభివర్ణించారు. ఈ వేడుక నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని, అవకాశాలు అందుకోవచ్చని పేర్కొన్నారు. న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ”insights from the world’s largest spiritual gathering Mahakumbh” పేరుతో ప్రత్యేక చర్చా వేదికను ఏర్పాటు చేసింది. పలువురు ప్రొఫెసర్లు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Read More

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ2025లో సంచలన విజయం నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ పై గెలిచింది. ఇరు జట్ల నుండి 300కు పైగా పరుగుల భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించడం ఖరారైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 177 (146; 12×4, 6×6) భారీ సెంచరీతో సత్తా చాటాడు. అజ్మతుల్లా 41 (31; 1×4, 3×6), షాహిది 40(67; 3×4) , నబీ 40 (24; 2×4, 3×6) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, లివింగ్ స్టోన్ 2 వికెట్లు, జేమీ…

Read More

సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి సంబేపల్లి ఎస్సై రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన్ను ఏపీకి తరలించనున్నట్లు తెలుస్తోంది.

Read More

ఇటీవల హిందిలో విడుదలై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘చావా’. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీనిని తెర‌కెక్కించారు. విక్కీ కౌశల్, ర‌ష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల‌ 14న విడుద‌లైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. 12 రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల వ‌సూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద వీరవిహారం చేస్తున్న ‘ఛావా’ ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 7న తెలుగులో విడుదల చేస్తున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించింది. ప్రేక్ష‌కుల‌ డిమాండ్ మేర‌కు తెలుగులో విడుదల చేస్తున్న‌ట్లు గీతా ఆర్ట్స్ తెలిపింది.

Read More

ఈశాన్య భారత్ లో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతం దేశ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేస్తోందన్నారు. ఆయన తాజాగా గువాహటిలో ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు.2014 నుండి అస్సాం రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని చెబుతూ తమ ప్రభుత్వం అమలు చేసిన వివిధ కార్యక్రమాలను ప్రధాని మోడీ వివరించారు. అస్సాం వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా భారత్ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని నిపుణులు కూడా ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారని తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, స్కిల్ సెక్టార్లలో అగ్రభాగాన నిలుస్తోన్న మనదేశ యువతపై విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ప్రధాని మోడీకి అరుదైన బహుమతులు: అస్సాం సీఎం హిమంత్ అరుదైన బహుమతులను ప్రధాని మోడీకి అందించారు. సెమీకండక్టర్ చిప్ లతో తయారుచేసిన ఖడ్గమృగం బొమ్మను, కామాఖ్య…

Read More

మణిపూర్‌లోని కొండ,లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్‌ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు.అయితే దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ్యలో సరెండర్‌ చేస్తున్నారు.నిన్నటికి 12 సీఎంజీ గన్స్‌,303 రైఫిల్స్ 2,2 ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్, 4 ఎస్‌బీబీఎల్‌ రైఫిల్స్,303 రైఫిల్స్ మ్యాగజైన్‌లు 2, సీఎంజీ గన్‌ మ్యాగజైన్‌లు 12, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్ మ్యాగజైన్‌లు 2, ఒక ఐఈడీ, .303 రైఫిల్స్‌కు సంబంధించిన 33 లైవ్ రౌండ్లు,ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌కు సంబంధించిన 32 లైవ్ రౌండ్లు, ఎస్‌బీబీఎల్‌ రైఫిల్స్‌కు సంబంధించిన 5 లైవ్ రౌండ్లను ప్రజలు భద్రతా దళాలకు అప్పగించారు.కాగా ఇంఫాల్‌లోని భద్రతా దళాలు వీటిని మీడియా ముందు ప్రదర్శించారు.

Read More

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సేవలపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ…కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఎయిర్‌ ఇండియాపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో బీజేపీ నాయకుడు జైవీర్ షెర్గిల్ సైతం ఎయిర్‌ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలంటూ విమర్శించారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు.అయితే ఎయిర్‌ ఇండియాలో ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభవం కాదని పేర్కొన్నారు.సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు.‘చెత్త ఎయిర్‌లైన్స్‌ విభాగంలో ఎయిర్‌ ఇండియా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.ఈ విభాగంలో ఎయిర్‌లైన్స్‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి. విరిగిన సీట్లు, చెత్త సిబ్బంది దయనీయమైన గ్రౌండ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌…అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. If there was an Oscar equivalent for…

Read More

తమిళ నటుడు,తమిళ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ,ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ఒకే వేదికపై కనిపించారు. విజయ్‌ గత ఏడాది ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.అయితే పార్టీ స్థాపించి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఈరోజు చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.కాగా ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ప్రశాంత్‌ కిషోర్‌ పనిచేయనున్నారని సమాచారం.ఇటీవలే చెన్నైలో విజయ్‌ను ప్రశాంత్‌ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్‌కి సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.ఈ మేరకు ఇతర పార్టీలతో పోత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలక ప్రకటన చేయనున్నట్లు తమిళ మీడియా వెల్లడించింది.అయితే పార్టీ ఆవిర్భావ వేడుకల…

Read More