ఏపీలోని నౌకాశ్రయాన్ని కలిపేలా ప్రత్యేక రైలు,రోడ్డు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారిందని అన్నారు.ఈ సదస్సుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని తెలిపారు. అయితే ప్రపంచ ప్రసిద్ధ ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు.పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణాలో ఉన్నత విద్యపై పెట్టుబడులు బాగా పెరిగాయని వివరించారు.ఎంతోమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను తయారు చేశామని అన్నారు.కాగా నిపుణుల కృషితో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. Excited to kick-off BioAsia 2025!In my inaugural address today, highlighted how #Hyderabad has transformed into a global life sciences capital in the…
Author: admin
నార్నె నితిన్, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.ఇది గతంలో విడుదలైన “మ్యాడ్” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు.ఈ చిత్రానికి కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది.టీజర్ చూస్తుంటే…ఈ చిత్రంలో కూడా మరోసారి నార్నె నితిన్,రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. https://youtu.be/1Sw7modBwsM?si=x7oLHg_YxLKuFRfE
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా,సాయి పల్లవి సీతగా దర్శకుడు నితేష్ తివారీ “రామాయణ్” అనే చిత్రాన్ని తెరక్కేక్కిస్తున్నాడు.ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్నాడు.తాజాగా యష్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు.రావణుడి పాత్ర సైన్నివేశాల కోసం ముంబైలో జరుగుతున్నా చిత్రీకరణలో పాల్గొన్నారు.ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ ల్లో ఓ భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారని సమాచారం.ప్రస్తుత ఈ షెడ్యూల్ముగిసిన అనంతరం షూటింగ్ కోసం చిత్రబృందం దహిసర్‌లోని ఒక స్టూడియోకు వెళ్లనుంది. అయితే దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నార.తోలి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నారు.కాగా రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్,లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 6.10 గంటలకు సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది.ఈ మేరకు తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.ఈ భూకంపం తీవ్రతతో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, ఒడిశాలోని భూవనేశ్వర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది.అయితే గతవారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో ఇప్పటివరకు పుణ్య స్నానమాచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లను దాటిందని ఇటీవలే యూపీ ప్రభుత్వం తెలిపింది. రేపటితో ఈ మహా కుంభమేళా ముగియనుంది. ఇక తాజాగా మహా కుంభమేళా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు గిన్నిస్ రికార్డు లక్ష్యంగా అతిపెద్ద క్లీన్ డ్రైవ్ ను చేపట్టారు. దాదాపుగా 15వేల మంది కార్మికులు చీపురు చేతపట్టుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు మరియు ప్రయాగ్ రాజ్ మేయర్ గణేష్ కేశర్వానీ, మహా కుంభమేళా ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. ఈ రికార్డుకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ త్వరలో రానున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు 2019లో ప్రయాగ్ రాజ్ లో 10వేల మంది పారిశుధ్య కార్మికులు గిన్నిస్ రికార్డులో స్థానం సాధించారు.
తన సిబ్బందిపై కేవలం చేయి వేసినందుకు న్యూజిలాండ్ మంత్రి ఆండ్రూ బేలీ ఏకంగా పదవి నుండి వైదొలిగాడు . ఈ విషయాన్ని ఆండ్రూ బేలీ తాజాగా మీడియాకు తెలిపారు. ఇటీవలే తాను రాజీనామా సమర్పించినట్లు వెల్లడించారు. ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఒక చర్చలో భాగంగా మాట్లాడుతూ తన సిబ్బంది భుజంపై చేయి వేశానని ఆ సమయంలో తన ప్రవర్తన అహంకారపూరితమైనదేనని అంగీకరించారు. తన సిబ్బంది పట్ల తన తీరు అమర్యాదకరంగా ప్రవర్తించినట్లుందని ఆవిధంగా చేసి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు. తనను మన్నించాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైనట్లు ఆండ్రూ తెలిపారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఎంపీగా కొనసాగనున్నట్లు ఆండ్రూ స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.ఈ మేరకు విజయవాడలో సీఎంను కలిసిన వీహెచ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, స్మృతివనం నిర్మించాలని కోరారు.కాగా దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.దళిత సీఎం అయిన సంజీవయ్య అత్యంత నిజాయితీపరుడని వీహెచ్ కొనియాడారు.
గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే… చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్రప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రి నిరంతరం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించేలా మిర్చిరైతులకు క్వింటాలు కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు. 2024-25 సంవత్సరంలో రైతులు పండించిన 2.58లక్షల టన్నుల మిర్చిని కనీస మద్ధతుధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈసందర్భంగా స్పష్టం చేశారు. సీఎం గారి వినతికి పెద్దమనసుతో సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్…
హిందీ భాష వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను బీజేపీ నాయకురాలు,తమిళసై సౌందర్యరాజన్ ప్రశ్నించారు.కాగా తిరుచీ రైల్వే స్టేషన్‌లో జరిగిన సైన్‌బోర్డు ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు డీఎంకే కార్యకర్తల ప్రవర్తను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె తెలిపారు.ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదు అని అన్నారు.ఉత్తరాది రాష్ట్రాల నుండి కూడా రాష్ట్రానికి జనం వస్తున్నారని,సైన్‌బోర్డుపై ఉన్న హిందీ భాషను తుడిచి వేయాల్సిన అవసరం ఏమివచ్చిందని ఆమె నిలదీశారు.అయితే డీఎంకే మంత్రుల పిల్లలు, మనవళ్లు,మనవరాళ్లు అందరూ సీబీఎస్ఈ స్కూళ్లలో చదువుతున్నారని,వాళ్లు మూడు భాషలను నేర్చుకుంటున్నారని విమర్శించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఓపెన్ సవాల్ చేస్తున్నానని,మీ పిల్లలు,మీ మంత్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంత మంది కేవలం రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.కాగా ఎందుకు మీ మంత్రులు,మీ కుటుంబసభ్యులు సీబీఎస్ఈ స్కూళ్లను నడిపిస్తున్నారని తమిళసై అడిగారు.తమిళనాడులో అనేక సమస్యలు ఉన్నాయని,వాటిని కప్పిపుచ్చేందుకు భాషపై ఎందుకు డీఎంకే రాజకీయం చేస్తుందని బీజేపీ నేత…
రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తాజాగా చేస్తున్న చిత్రం “ది రాజాసాబ్” .ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో మాళవిక మోహన్ , నీధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.దర్శకుడు ఈ చిత్రాన్ని హరర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.అయితే విడుదల తేదీ వాయిదా పడినట్లు సుసంచారం.కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత లేదు.ఈ ఉగాది కానుకగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని తెలుస్తుంది.దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.ఈ సినిమాలో సంజయ్ దత్, యోగి బాబు ,రిధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
