ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని సమావేశం కావడం ఇది మూడోసారి.కాగా సీఎం రేవంత్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.ఈ అయితే ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోదీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తుంది.అలానే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి సీఎం వివరించారని సమాచారం.
Author: admin
సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో నిన్న రాత్రి విమాన ప్రమాదం సంభవించింది.కాగా టేకాఫ్ కు ప్రయత్నిస్తూ…కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.అయితే ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు విమానంలోని ప్రయాణికులలో 10 మంది దుర్మరణం పాలయ్యారని సూడాన్ అధికార వర్గాలు వెల్లడించాయి.అక్కడి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు.సుడాన్ ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నుండి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను రుద్దడంపై..మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు.సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు స్టాలిన్ చెప్పారు.కాగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని తమిళనాడు విజయవంతంగా అమలు చేసిన కారణంగా…8 లోక్‌సభ స్థానాలను కోల్పోయే ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోందని స్టాలిన్ పేర్కొన్నారు.అయితే నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాదిపై కత్తి వేలాడుతోందని స్టాలిన్ అన్నారు.
నేడు పవిత్ర మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భారీగా భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మహా శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి పండుగను జరుపుకుంటున్న తెలుగువారందరినీ ఆ మహాదేవుడు కరుణించి, శుభాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పార్వతీ, పరమేశ్వరుల దీవెనలతో అందరూ సుఖశాంతులతో…
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ ఎగ్జామ్స్ విధానంలోనూ మార్పులు చేపడుతోంది. తాజాగా ఇకపై సంవత్సరానికి రెండు విడతలుగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. 2026 విద్యా సంవత్సరం నుండి దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ పబ్లిక్ నోటీసును తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫిబ్రవరి-మార్చిలలో మొదటి విడత ఎగ్జామ్స్, మే నెలలో రెండో విడత నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా పూర్తి స్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని ముసాయిదాలో స్పష్టం చేసింది. వీటిపై మార్చి 9లోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది. బోర్డు ఎగ్జామ్స్ రెండుసార్లు నిర్వహించినప్పటికీ ప్రాక్టికల్స్/ ఇంటర్నల్ ఎవాల్యూషన్ మాత్రం ఒకేసారి చేయనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఈ విధానంతో స్టూడెంట్స్ తమను తాము మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన…
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుండి ప్రారంభం కానుంది. కేరళ- విదర్భ 2024-25 టోర్నీ విజేతగా నిలిచేందుకు ఈ ఫైనల్ లో తలపడనున్నాయి. మొదటి సారి ఫైనల్ చేరిన కేరళ టైటిల్ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. ఇక ఈ సీజన్ లో ఆడిన 9 మ్యాచ్ లలో 8 విజయాలు అందుకున్న విదర్భ ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. క్వార్టర్స్ లో తమిళనాడును, సెమీ ఫైనల్ లో ముంబైని ఓడించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో బలమైన జట్టుగా కనిపిస్తుంది. ఈ సీజన్ లో కేరళ కూడా స్పూర్తివంతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో ఇండియా మాస్టర్స్ మరో విజయాన్ని సాధించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. డారెన్ మ్యాడీ (25), టిమ్ అంబ్రోస్ (23) ఒక మోస్తరు పరుగులతో పర్వాలేదనిపించారు. ధవళ్ కులకర్ణి 3 వికెట్లు, పవన్ నేటి 2 వికెట్లు, అభిమన్యు మిథున్ 2 వికెట్లతో రాణించి ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అనంతరం లక్ష్యాన్ని ఇండియా 11.4 ఓవర్లలో నే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సచిన్ టెండూల్కర్ (34), గుర్ కీరత్ (63 నాటౌట్), యువరాజ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హానుమంతరావు భేటీ అయ్యారు. ఈరోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఈసందర్భంగా వీ.హానుమంతరావు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. సామాజిక ఫించన్లు రావడంలో, కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో శ్రీ దామోదరం సంజీవయ్య గారు పాత్ర ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావు సత్కరించి జ్ఞాపికను అందించారు.
1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ స్పెషల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది.అయితే ఈరోజు శిక్షను ఖరారు చేసింది.కాగా 4 దశాబ్దాల క్రితం జరిగిన అల్లర్ల సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హతమార్చారన్న కేసులో ఆయనను కోర్టు ఇటీవల దోషిగా తేల్చింది.ఈ కేసుకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ఇప్పటికే తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.అతనిపై మరో రెండు కేసులు న్యాయస్థానాలలో పెండింగులో ఉన్నాయి.
నేటి ట్రేడింగ్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగించాలి. నిన్నటి భారీ నష్టాల నుండి కోలుకుని ఒక మోస్తరుగా కదలాడాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు అనంతరం ప్రధాన రంగాల షేర్లు రాణించడంతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఒకదశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 74,602 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 22,547 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.19గా కొనసాగుతోంది. ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, టొమాటో, నెస్లే ఇండియా, మారుతీ సుజుకి, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.యూ.ఎల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
