Author: admin

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా పేలవంగా ముగించింది. లీగ్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో మొదటి దానిలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెందగా… రెండో మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి పాలైంది. ఇక నేడు రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తో జరగాల్సిన మూడవ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. రావాల్పిండిలో ఉదయం నుండి వర్షం పడుతోంది. దీంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్ నీటితో ఉండడంతో మ్యాచ్ నిర్వహణ కష్టమని భావించిన అంపైర్లు టాస్ కూడా వేయకుండా రద్దు చేశారు. చెరొక పాయింట్ తో పాకిస్థాన్ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ -ఏ నుండి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరాయి.

Read More

ఈరోజు ట్రేడింగ్ లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సుంకాలపై చేసిన ప్రకటనల నేపధ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో కొనుగోళ్ల జోరు తగ్గింది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 74,612 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 22,545 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.18గా కొనసాగుతోంది. టాటా స్టీల్, జొమాటో, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Read More

తమ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ సాయంతో తమ రాష్ట్ర ఓటర్ల జాబితాలోకి ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఓటర్లను చేర్చుకున్నారు నుండి తీవ్ర ఆరోపణలు చేశారు. సత్వరం తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. 2006లో భూసేకరణ ఆందోళన క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహారదీక్షను ఈసందర్భంగా ఆమె గుర్తు చేశారు. టీఎంసీ సమావేశంలో మాట్లాడిన ఆమె ఎలక్షన్ కమీషన్ ను కూడా బీజేపీ ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇటీవలే సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ నియామకం పైనా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ ఫలితాలను తారుమారు చేసేందుకు గుజరాత్, హార్యానా ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఇటువంటి వ్యూహాలు…

Read More

బీజేపీ డీఎంకేల మధ్య హిందీ విషయంలో మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే అగ్రనేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ వలనే ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయి అన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల సోదర సోదరీమణులారా… హిందీ వలన ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో గమనించారా? భోజ్‌పురి, మైథిలీ, అవధి, బ్రజ్, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి ఇంకా అనేక భాషలు ఇప్పుడు మనుగడ కోసం వెతుకుతున్నాయని పేర్కొన్నారు. యూపీ, బీహార్ లు హిందీ రాష్ట్రాలు కావని వారి అసలైన భాషలు ఇప్పుడు గతానికి సంబంధించిన అవశేషాలని రాసుకొచ్చారు. ఇది ఇక్కడ మనకు తెలుసు కాబట్టే తమిళనాడు ప్రతిఘటించిందని అన్నారు. తమిళం మేల్కొంది; తమిళ సంస్కృతి ప్రాణాలతో…

Read More

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మరో అందాల భామ పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్ విడుదల చేసింది. స్టైల్ అనే పదానికి నిర్వచనంగా అభిమానులు చెప్పుకునే రజనీకాంత్ ను లోకేష్ రేంజ్ లో చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. Yes, you guessed it right!❤️‍🔥 @hegdepooja from the sets of #Coolie @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv@girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/SThlymSeog— Sun Pictures (@sunpictures) February 27, 2025

Read More

ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాన్ని ప్రకటించిన తరువాత మొదటిసారిగా తమ స్వగ్రామం వెళ్లడంతో స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక అటు రాజకీయంగానూ అలాగే ఎల్లప్పుడూ ప్రజా, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.

Read More

విభిన్న కధాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ప్ర‌ధాన పాత్ర‌ల్లో అక్కినేని నాగార్జున, త‌మిళ‌ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్ ద్వారా కుబేర విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.శ్రీవెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌లో సునీల్ నారంగ్‌, రామ్మోహన్ ‌రావు కలిసి నిర్మిస్తున్నారు. ఇదొక వైవిధ్యమైన సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఏవిధంగా సినిమాను రూపొందించారోననే ఆసక్తితో సినీ ప్రేక్షకులు ఈచిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. Kubera releasing on 20th June ☄️ @dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation @jimSarbh @AsianSuniel pic.twitter.com/5YhxN7IwbQ— Rashmika Mandanna…

Read More

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ నిన్నటితో ముగిసింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ మహా కుంభమేళా ఇంత భారీ స్థాయిలో జరగడం చరిత్రలోనే మొదటి సారి. కాగా, ఇంతటి మహత్తరమైన కార్యక్రమం పూర్తైన సందర్భంగా ప్రధాని మోడీ స్పందించారు.‌ ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కుంభ మేళా ముగిసింది… ఐక్యత యొక్క మహాయజ్ఞం పూర్తయింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ గొప్ప ఐక్యత సంగమంలో 140 కోట్ల మంది భారతీయులు 45 రోజులు విశ్వాసంతో కలిసి వచ్చిన విధానం నిజంగా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుంభ మేళా‌లో భక్తులు ఈ స్థాయిలో భాగస్వామ్యం కావడం కేవలం రికార్డు మాత్రమే కాదని ఇది రాబోయే శతాబ్దాలకు మన సంస్కృతి మరియు వారసత్వాన్ని బలోపేతం చేసే మరియు సుసంపన్నం చేసే బలమైన పునాదిని వేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్ లో జరిగిన కుంభమేళా…

Read More

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉండవల్లి పంచాయతీ ఆఫీసు సమీపంలోని ఎంపియుపి స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను. పట్టభద్రులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లోకేష్ కోరారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Read More

మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నమూనాపై ఉండవల్లి నివాసంలో అధికారులతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల స్వప్నమని ఈ వంద పడకల ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో నిర్మించాలని సూచించారు. వంద పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్‌గా, ప్రశాంత వాతావరణంలో వైద్యులు రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పేరెన్నికగన్న ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read More