ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ మరో మ్యాచ్ విజయంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏలో చెరో రెండు మ్యాచ్ లలో విజయాలతో భారత్ న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ చేరాయి. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. షాంటో (77), జాకర్ అలీ (45), రిషద్ హొస్సేన్ (26), టాంజిద్ హాసన్ (24) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ బ్రేస్ వెల్ 4 వికెట్లు, ఓరూర్కే 2 వికెట్లు, మాట్ హెన్రీ, జేమీసన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్యాన్ని న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర 122 (105; 12×4, 1×6) సెంచరీతో కివీస్ విజయంలో…
Author: admin
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయల బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు.కాగా రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల్లరంగుతో కనిపించకుండా చేశారు.నిన్న డీఎంకే కార్యకర్తలు పాలక్కాడ్, పాలైయంకోట్టై రైల్వే స్టేషన్‌లోని బోర్టులపై హిందీ పేర్లకు బ్లాక్ పెయింట్ వేశారు.అయితే ఈరోజు కూడా దీనిని కొనసాగించారు.ఈ మేరకు చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, జీఎస్టీ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలకు నల్లరంగు పూశారు.తాజాగా డీఎంకేపై బీజేపీ మండిపడింది.తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.అయితే త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరి ‘కపటత్వం’ అని విమర్శించారు.డీఎంకే నాయకుల పిల్లలు బహు భాషా పాఠశాలల్లో చదువుతున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు.‘డీఎంకే పార్టీ అనేది వారి…
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను రాశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపారు. వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హెూదా, మరియు ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తి లో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.
కన్నడ స్టార్ కథనాయకుడు యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “టాక్సిక్”.ఈ చిత్రానికి నటుడు & దర్శకుడు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరిస్తున్నారు.కాగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించరని తెలుస్తుంది. భారీ స్థాయిలో ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కుతున్న భారతీయ చిత్రంగా నిలువనుంది.ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రంలో నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలో కనిపించనున్నారు.దర్శకుడు బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్ జరిగే చిత్రంగా రూపొందిస్తున్నారు. IT'S OFFICIAL… YASH'S NEXT FILM 'TOXIC' BEING SHOT IN KANNADA & ENGLISH… #Toxic: A Fairy Tale For Grown Ups – starring…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. నేటి గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదనీ పేర్కొన్నారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదు. సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పైనా షర్మిల విమర్శలు గుప్పించారు. జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ గారి తీరు మాత్రం మారలేదని 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది ? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా?…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకులు రూపొందిస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొంత భాగానికి దర్శకత్వం వహించగా , అనివార్య కారణాల వలన అయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.ప్రస్తుతం మిగిలిన భాగానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదల కానుంది.ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది.తాజాగా సెకండ్ సింగిల్ ను విడుదల చేసింది. తాజాగా “కొల్లగొట్టినాదిరో” అనే రెండో సింగిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో నిధి ఆగర్వాల్‌తో పాటు అనసుయ కూడా కనిపించింది.ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాకి లెజెండరీ…
ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చూశాయి. దాదాపు 8 నెలల కనిష్టానికి పడిపోయాయి. మార్కెట్లకు ‘బ్లాక్ మండే’గా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో వాణిజ్య భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, జియోలాజికల్ పొలిటికల్ పరిస్థితుల నేపథ్యంలో సూచీలు నష్టాల బాటలో పయనించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 243 పాయింట్ల నష్టంతో 22,552 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.72గా కొనసాగుతోంది. ఐటీ, మెటల్, టెలికాం సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. కోటక్ మహింద్రా, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాలతో ముగిశాయి.
గవర్నర్ గారి ప్రసంగం అనంతరం ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ …వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో రాదు.ఫిక్స్ అయిపోండి.అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారో, నేనో కావాలని చేసింది కాదు.ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం, మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాల’ని స్పష్టం చేశారు.భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయింది.ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభా సమయం వృథా చేస్తున్నారు.సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయి.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించారు.అక్కడ…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్నటి ‘మన్ కీ బాత్’ లో ఊబకాయం గురించి మాట్లాడారు. దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొన్నారు.ఇక నిన్న చెప్పినట్లుగా, ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఈ ఉద్యమం మరింత ముందుకు సాగాలంటే ఒక్కొక్కరు 10 మందిని నామినేట్ చేయాలని వారిని అభ్యర్థించారు. ఆనంద్ మహీంద్రా, నిరాహుయ హిందూస్తానీ, మను బాకర్, మీరాబాయి చానూ, మోహన్ లాల్, నందన్ నిలేఖనీ, ఒమర్ అబ్దుల్లా, నటుడు మాధవన్, శ్రేయా ఘోషల్, సుధా మూర్తిలను నామినేట్ చేశారు. సమిష్టిగా, భారతదేశాన్ని మరింత ఆరోగ్యంగా మరియు బలంగా మారుద్దామని పిలుపునిచ్చారు.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిట్-3’. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్ పోస్టర్స్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందుతోంది. తిపిరినేని ప్రశాంతి నిర్మిస్తున్నారు. ‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో 3వ పార్ట్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్‌ను నాని పుట్టినరోజు కానుకగా నేడు విడుదల చేశారు.ఈ టీజర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేలా రూపొందించారు.నాని అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్ గా అదరగొట్టాడు. ఇక ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మే లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/XhW3i2f54BQ?si=Ys4CK6sFerphsVr8
