కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దిగిన ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందా అనే దానిపై మళ్లీ చర్చ ఊపందుకుంది. భారత్ -యూకే వాణిజ్య చర్చల తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జోనాథన్ రేనాల్డ్స్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పునరుద్ధరణ జరిగిందని ఇది స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. ఇక శశిథరూర్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని,కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఈ నేపథ్యంలో శశిథరూర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. శశిథరూర్ స్పందిస్తూ…ప్రస్తుతానికి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానని,పార్టీ కనుక నా సేవలను ఉపయోగించకూడదు భావిస్తే…నాకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు.…
Author: admin
ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి బీ.ఆర్.అంబేద్కర్, భగత్ సింగ్ లో ఫోటోలు తొలగించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. నేటి ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుండి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం అతీషీ సహా 12 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కాగ్ (CAG) ఇచ్చిన నివేదికను నేడు బీజేపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో వారు ఈ అంశాన్ని ప్రజలు దృష్టి నుండి మరలించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం కార్యాలయంలో బీ.ఆర్.అంబేద్కర్, భగత్ సింగ్, రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల ఫోటోలు…
‘స్పా’ ముసుగులో జరుగుతున్న వ్యభిచార కేంద్రంలో పోలీసులకు దొరికిన వైసీపీ నాయకుడు,ఏపీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య సోమశంకర్ నాయక్‌ను పార్టీ నుండి బహిష్కరించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.విజయవాడలోని వెటర్నీ కాలనీలో ‘స్టూడియో 9 స్పాప్’ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారంతో ఇటీవల మాచవరం పోలీసులు దాడులు చేశారు.పోలీసుల దాడి గురించి తెలుసుకున్న శంకర్‌నాయక్ గదిలో మంచం కింద దాక్కున్నారు.గుర్తించిన పోలీసులు ఆయనను బయటకు లాగారు.ఈ అంశంపై సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా శంకర్ నాయక్ గారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. pic.twitter.com/xVZoyTbtKh— YSR Congress Party (@YSRCParty) February 24, 2025
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీనేతలతో ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించేలా అందరూ పనిచేయాలని కోరారు. ఎన్నికల ముందురోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతి ఓటరు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్ చార్జి మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు మాజీ సీఎం,జయలలిత 77వ జయంతి సందర్భంగా నిన్న చెన్నైలోని పోయస్ గార్డెన్ లో ఉన్న ఆమె నివాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లారు.ఈ మేరకు ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళుర్పించారు.అనంతరం జయలలిత మేనకోడలు,మేనల్లుడితో రజనీకాంత్ కొద్దీ సేపు మాట్లాడారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ… సినీ పరిశ్రమలో జయలలిత ఎంతో బిజీగా ఉన్నప్పుడే ఆమెతో నటించే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. 1977లో ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందని… ఆమెతో ఆ చిత్రం గురించి మాట్లాడేందుకు మొదటిసారిగా ఆమె నివాసానికి వచ్చానని చెప్పారు.ఆమె మన మధ్య లేకపోయినా…జయలలిత అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు.జయలలిత కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని రజనీకాంత్ అన్నారు.
నిన్న సభలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు బాధగా అనిపించిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ సభ్యుల తీరు ఉందని గవర్నర్ ప్రసంగిస్తుండగా నవ్వుతూ జగన్ వ్యవహారం సిగ్గుచేటని దుయ్యబట్టారు. నిన్నటి సభలో జగన్ తీరు సభ్యతగా ఉందా ? జగన్ వ్యవహరించిన తీరు సరికాదు. ఇది ప్రజాస్వామ్యమని జగన్ గుర్తుంచుకోవాలి. సీఎంగా, ఎంపీగా చేసిన వ్యక్తి సభలో వ్యవహరించే తీరు ఇదేనా? అని అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. ఇక నిన్న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన వైసీపీ నేతలు కొద్దిసేపటికే బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుండగా… టీడీపీ నేతలు వైసీపీ తీరును ఎద్దేవా చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు దాడిలో ముగ్గురు మరణించారు. ఓబులవారి పాలెం గుండాల కోన వద్ద భక్తుల పై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందగా…మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రేపు శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయానికి నడిచి వెళ్తుండగా ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు భక్తులు మరణించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినట్లు వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఘటన బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని తమ పార్టీ నేతలకు, అలాగే ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి ఒక్క రోజు కూడా విరామం లేకుండా నిత్యం ప్రజా సేవలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా ఫిట్ గా చూసుకుంటారు. కాగా, తాజాగా ఆయన తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి తెలిపారు. బీహార్‌లోని భాగల్‌పుర్‌లో తాజాగా పర్యటించిన ఆయన . ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావించారు. మఖానా (తామర విత్తనాలు) మంచి ఆహారమని అన్నారు. అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అని వివరించారు. తాను 365 రోజుల్లో 300 రోజులు మఖానాను అహారంలో భాగంగా చేసుకుంటానని తెలిపారు. దేశ వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు అల్పాహారంగా మఖానాను తీసుకుంటున్నారన్నారు. అందుకు అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా రైతుల శ్రేయస్సు కోసం బీహార్‌లో మఖానా…
కొల్లేరు సరస్సు, కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై నెలకొన్న పర్యావరణ మరియు చట్టపరమైన సవాళ్ల పరిష్కారంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి, ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కొల్లేరు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అటవీ శాఖ ఉనతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొల్లేరు పరిధిలో విభిన్న వృత్తులపై ఆధారపడ్డ సమూహాలకు స్థిరమైన జీవనోపాధులను మెరుగుపరుస్తూనే కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. వసుధైక కుటుంబ అనే మన జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రకృతినీ, ప్రకృతిలో భాగమైన జీవజాలాన్నీ కాపాడుకొందామని ఈ సవాళ్ళ సమగ్ర పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి కొల్లేరు ప్రాంతవాసుల ప్రాథమిక డేటాను – పరిపాలనా, పర్యావరణ మరియు సామాజిక అంశాల సేకరించి అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల మరియు అటవీ శాఖల అధికారులతోపాటు ఈ ప్రాంతంలో భాగమైన వర్గాలతో కూడా సంప్రదింపులు…
ప్రో హాకీ లీగ్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లలో పురుషుల మహిళల జట్లు పరాజయం చెందాయి. పురుషుల జట్టు ఇంగ్లాండ్ చేతిలో 2-3 తేడాతో ఓటమి చెందింది. భారత్ నుండి 18వ నిమిషంలో అభిజిత్, 29వ నిమిషంలో సుఖజీత్ గోల్స్ చేశారు. ఇంగ్లండ్ జట్టులో 15వ నిమిషంలో జాకబ్ పైథాన్, 19వ 29వ నిమిషాలలో వార్డ్ గోల్స్ చేశారు. మరోవైపు మహిళల జట్లు 2-4 తేడాతో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది.
