ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాలలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి.రామారావు, పి. అశోక్ బాబు, తిరుమలనాయుడు పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజుల్ హసన్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశంల పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఆయా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 10 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవనుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువునిచ్చారు. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
Author: admin
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మా ప్రభుత్వం పది సూత్రాలు – స్వర్ణాంధ్ర విజన్ 2047ను పునరుద్ఘాటించారు. భవిష్యత్తు సుభిక్షంగా ఉండడం కోసం మన దార్శనికతను నిర్వచించే పది మార్గదర్శక సూత్రాలను రూపొందించిందని వివరించారు. 1. పూర్తిగా పేదరికం నిర్మూలించడం.2. మానవ వనరుల అభివృద్ధి & జనాభా నిర్వహాణ 3. నైపుణ్యం పెంపుదల మరియు ఉపాధికల్పన.4. నీటి భద్రత 5. రైతు-అగ్రిటెక్ 6. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ 7. వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం. 8. ఉత్పత్తి పరిపూర్ణత. 9. స్వచ్ఛాంధ్ర. 10. విస్తృత సాంకేతికత ఏకీకరణ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సి హెచ్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత చీఫ్ విప్ జీ వీ ఆంజనేయులు, జనసేన నుండి మంత్రి నాదెండ్ల మనోహర్, బిజెపీ నుండి విష్ణు కుమార్ రాజు, తదితరులు సమావేశం లో పాల్గొన్నారు. అసెంబ్లీకి వచ్చి, ప్రజా సమస్యల పై చర్చించాలి: మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీకి స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీకిచ్చిన స్థానానికి గౌరవం ఇచ్చి, ప్రజా తీర్పుని గౌరవిచ్చి, అసెంబ్లీకి వచ్చి, ప్రజా సమస్యల పై చర్చించాలని ఆయన సూచించారు.
అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అసెంబ్లీలో మహిళలపై జరిగే అకృత్యాలపై, రైతుల సమస్యలపై మాట్లాడే గొంతు అవసరం లేదా? అధికారమదంతో ప్రతిపక్షం గొంతును తొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. గవర్నర్‌గారు ప్రతిపక్షం పాత్రను గుర్తించాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలు, అఘాయిత్యాలపై గళమెత్తే ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా దోపిడీ సాగించవచ్చు అనే కుటిలబుద్ధితో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదు నిరంకుశ పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. దేశచరిత్రలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరీ ఏపీలో ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షం ప్రశ్నింస్తుందని భయపడే…వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా…
ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మెజారిటీ ఉన్న వ్యక్తులు అధికారం స్థాపిస్తారు, రెండవ అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు, కానీ వైసీపీ లాగా గత ప్రభుత్వం మాది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే కుదరదని అన్నారు. నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, వైసీపీకి 11 సీట్లు ప్రజలు ఇచ్చారు, అయినా సరే అసెంబ్లీకి రాకుండా, గొడవ చేస్తాం అంటే సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు . మీకు సమయం మీ స్థాయికి తగినట్లుగా ఇస్తాం అన్నా సరే వైసీపీ రావడం లేదు, ప్రజలు ఈ విషయం అర్ధం చేసుకోవాలని తెలిపారు. వైసీపీ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వారు వ్యవహరించే విధానం సరైనది కాదు. కేవలం అసెంబ్లీలో గొడవ చెయ్యడం మాత్రమే వైసీపీ విధానం అనడం సరి కాదు. మిమ్మల్ని…
సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’.ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు.ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ…ఈ సినిమా రెండు గంటలపాటు లాఫ్ రైడ్‌గా ఉంటుందని…థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయని చెప్పారు. కాగా నా కెరీర్‌లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశామని తెలిపారు.ఇందులో రావురమేష్ గారి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అన్నారు.తాజాగా విడుదలైన ట్రైలర్ విషయానికొస్తే..ఓ తండ్రీకొడుకులు…ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడితే?.. అనే కాన్సెప్ట్‌తో ఈ ట్రైలర్ ఆద్యతం కామెడీగా సాగింది. https://youtu.be/K8m3Ke1-fY4?si=letpl-7b2IxaH9r0
తమిళ అగ్రనటుడు తలా అజిత్ కుమార్ మరోసారి ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే 2 నెలల క్రితం దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా ఆయన కారు సమీపంలోని గోడను బలంగా ఢీకొన్న సంగతి తెలిసిందే.కాగా ఆ ప్రమాదంలో కారు ముందు భాగం ఛిద్రం అయ్యింది, అజిత్ మాత్రం సురక్షితంగా బయట పడ్డారు.మళ్లీ అజిత్‌కి స్పెయిన్‌లో అలాంటి ప్రమాదమే ఎదురైంది.అక్కడ జరుగుతున్న రేసింగ్‌లో వేగంగా కారు నడుపుతూ, మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా కారు నుండి బయటకు వచ్చేశారు.వెంటనే సిబ్బంది సైతం అప్రమత్తమయ్యింది.తాజాగా ఈ వీడియోను ‘అజిత్ కార్ రేసింగ్ టీమ్’ ఇన్‌స్టాలో షేర్ చేసింది.కాగా అజిత్ సురక్షితంగానే ఉన్నారని ఈ పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రమాదంలో అజిత్ తప్పేం లేదని,ఇతర కారు వలెనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత…
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’.దర్శకుడు వశిష్ఠ రొటీన్‌కి భిన్నంగా ఈ సారి సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.అయితే ‘విశ్వంభర’ అంటే ఓ లోకం…ఆ లోకానికీ..భూలోకానికీ సంబంధం ఏంటి? అసలు ఈ కథలో చిరంజీవి ఎవరు? వేరే లోకానికెళ్లి ఆయన సాధించేదేంటి? తదితర అంశాలన్నీ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తుంది. గతంలో వచ్చిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రంలో చిరంజీవి పాత్రకు ఇది నెక్ట్స్ లెవల్‌గా ఉంటుందని సమాచారం.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.అయితే ఇందులో త్రిష పాత్ర చిరంజీవి పాత్రకు ధీటుగా ఉంటుందని చెబుతున్నారు.కాగా త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు.ఇందులో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్,కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నుండి వైసీపీ వాకౌట్ చేసింది.ఈ మేరకు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ…మాజీ సీఎం జగన్ తో పాటుగా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుండి బయటకు వచ్చేశారు.అయితే మాజీ సీఎం,ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోయారు.అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో నినదించామని చెప్పారు. అయితే సభలో ఉంది రెండే పక్షాలని…ఒకటి అధికారపక్షమైన కూటమి, ఇంకొకటి ప్రతిపక్షమని చెప్పారు.రాష్ట్ర ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని,అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళతామని, ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని అన్నారు.
పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు.తాజాగా శశిథరూర్ స్పందిస్తూ…ప్రస్తుతానికి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానని,పార్టీ కనుక నా సేవలను ఉపయోగించకూడదు భావిస్తే…నాకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు.శశిథరూర్ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని,కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు.దీనితో కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఈ నేపథ్యంలో శశిథరూర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే దేశ,రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని, ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడటం తనకు చేతకాదని స్పష్టం చేశారు.నేను ఎప్పడూ సంకుచితంగా ఉండనని పేర్కొన్నారు.కాగా కేరళలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు.లేనిపక్షంలో వరుసగా 3వసారి కూడా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.కేరళ సీఎం పదవికి నేను అర్హుడినని పేర్కొన్నారు.అయితే పలు ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే అంశాన్ని…
