ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన మాట్లాడతూ….తమ దేశంలో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికైనా తాను సిద్ధమని జెలన్‌స్కీ ప్రకటించారు.కాగా ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.’జెలెన్‌స్కీ ఓ నియంత, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.తాను నియంతను కాదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
Author: admin
అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల్లో మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించింది.అక్కడి నుండి వారు నిన్న టర్కిష్ ఎయిర్ లైన్స్‌లో ఇస్తాంబుల్ మీదుగా భారత్ కు చేరుకున్నారు.అయితే తొలిసారి వీరికి ఎలాంటి సంకెళ్లు వేయకుండా వెనక్కి పంపారు. అమెరికా ఇప్పటి వరకు 3 మిలటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపగా, వారందరికీ సంకెళ్లు వేయడం తెలిసిందే.అయితే తాజాగా తిప్పి పంపిన 12 మందిని స్వేచ్ఛగా తరలించారు. అక్రమ వలసదారులు ఏరివేయడంలో పనామా అమెరికాకు సహకారం అందిస్తోంది.దీనిలో భాగంగా అక్రమ వలసదారులను అమెరికా పనామాకు తరలిస్తోంది.అక్కడి నుండి వారు తమ దేశాలకు చేరుకుంటున్నారు.సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 50 మంది భారతీయులను అమెరికా ఇటీవల పనామాకు తరలించింది.వారిలో 12 మంది నిన్న భారత్ కు చేరుకున్నారు.అయితే వీరందరూ స్వదేశాలు చేరుకునేందుకు ఐక్యరాజ్యసమితికు చెందిన ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’ సాయం అందిస్తుంది.ఈ మేరకువిమాన టికెట్లు కొనుగోలులో వారికి…
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.నిన్న అర్ద గంట వ్యవధిలోనే 2 సార్లు కాల్స్ చేసి చంపేస్తామంటూ రాజాసింగ్‌ను హెచ్చరించారు.దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ…తనకు 2 నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు.ఈ రోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం ఇన్షా అల్లా అని హెచ్చరించినట్లు రాజాసింగ్ చెప్పారు. అయితే మీ యోగి, మీ మోదీ కూడా మా నుండి నిన్ను రక్షించలేరుని దుండగులు బెదిరించారన్నారు.మొదటి ఫోన్ కాల్ మధ్యాహ్నం 3.30 గంటలకు,ఆ తర్వాత 3.54 గంటలకు వచ్చినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు.గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి.అయితే తీవ్రవాద సంస్థల నుండి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా ఏర్పాటు చేసింది.
అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న అమృత్‌సర్ చేరుకున్న అమెరికా మిలటరీ విమానంలో 104 మంది, 15న మరో విమానంలో 119 మంది, 16న వచ్చిన మూడో విమానంలో 112 మందిని భారత్ కు పంపించి వేసింది. మూడు మిలటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపింది. తాజాగా అమెరికా మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించగా…అక్కడి నుండి వారు నిన్న టర్కిష్ ఎయిర్ లైన్స్‌లో ఇస్తాంబుల్ మీదుగా భారత్ కు చేరుకున్నారు. అమెరికా బహిష్కరణ కార్యక్రమానికి పనామా సహకారం అందిస్తోంది. అందులో భాగంగా అక్రమ వలసదారులను పనామాకు తరలిస్తోంది. అక్కడి నుండి వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రారంభానికి ముందు ప్రసంగం ఇవ్వటానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిరనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
క్రికెట్ మ్యాచ్ లలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇతర దేశాల అభిమానులు, క్రీడా ప్రముఖులు కూడా అత్యంత ఆసక్తి కనబరుస్తారు. ఇది ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు ఒక బావోద్వేగంగా చూస్తారు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ కు కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. జియో హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అయిన ఈ పోరుకు 60.2 కోట్లకు చేరుకోవడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభ సమయానికి 6 కోట్లకు పైగా వున్న వ్యూస్ పాక్ ఇన్నింగ్స్ సమయానికి 32 కోట్లకు పైగా భారత్ ఇన్నింగ్స్ మధ్యలో 36 కోట్లకు పైగా ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేసే సమయానికి 60 కోట్లకు పైబడి వ్యూస్ సాధించాయి.
మహిళల ఫిడే గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ లో భారత చెస్ స్టార్స్ కోనేరు హంపి ఐదో రౌండ్ లో చైనాకు చెందిన టాన్ జంగ్ యి తో 69 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరో స్టార్ ప్లేయర్ ద్రోణవల్లి హరిక 33 ఎత్తుల్లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్ కినా తో ఆటను ముగించింది. 3 పాయింట్లతో హంపి రెండో స్థానం, హారిక 1.5 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. రష్యా గ్రాండ్ మాస్టర్ కేథరియా లాగ్నో 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫ్రాన్స్ లో జరిగిన కాపీల్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ కు చెందిన యువ ఆటగాడు రిత్విక్ కాంస్యం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్ లలో 6విజయాలు, 2 డ్రా లు, ఒక ఓటమితో 7 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఛాంపియన్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు భారత్ -పాకిస్థాన్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో భారత్ వికెట్ల తేడాతో గెలిచి మరో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది. సాద్ షకీల్ 62 (76;5×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. రిజ్వాన్ 46 (77; 3×4), కుష్ దిల్ 38 (39; 2×6) బాబర్ అజామ్ (23) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్థిక్ పాండ్య 2 వికెట్లు, రవీంద్ర జడేజా, హార్షిత్ రాణా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 20 (15; 3×4, 1×6) అవుటైనా శుభ్ మాన్ గిల్ 46 (52; 7×4), శ్రేయాస్…
రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని పెట్టుబడి కూడా రాక రైతు కన్నీళ్లు పెడుతుంటే.. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్ళలో కారం కొడుతుందని ఆక్షేపించారు. మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతుందని ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారని పేర్కొన్నారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారని నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస ధర రూ.26 వేలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు…
మహారాష్ట్రలో ఒకే రోజు 20లక్షల మందికి ఇళ్ల మంజూరు లేఖలు ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 20 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేసి వారి సొంతిటి కలను సాకారం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ భేటీలోనే రెండో దశకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 10 లక్షల మంది లబ్దిదారుల ఎకౌంటులకు మొదటి విడత నిధులు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్ లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు.…
