Author: admin

ప్రజా సేవలో తిరుగులేని నిబద్దత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆయన బాటలో కొనసాగుతాను: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ప్రజలకు సేవచేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారని ఆయన కుమారుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన ఆలోచనలు మరియు చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నేడు నాన్న గారి 68వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు చూపించిన నిబద్ధతతో ఆయన బాటలో కొనసాగుతాను శ్రీకాకుళం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఈ…

Read More

ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం సరికొత్త సవాళ్లను అధిగమిస్తూ కాలానికి అనుగుణంగా మార్పులు చెందుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. గ్లోబలైజేషన్ తో ప్రతి మూలకు విస్తరిస్తూ ఎందరికో ఉపాధి అవకాశాలను కొందరిని బిలియనీర్లుగా మారుస్తోంది. ఇక తాజాగా ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక అధిక సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక సంపన్నులు ఉన్న దేశంగా‌ అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 813 ఉండగా, చైనాలో ఈ సంఖ్య 406గా ఉంది. మూడో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 200గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది బిలియనీర్లు అయ్యారు. భారతీయ బిలియనీర్ల సంపద 954 బిలియన్ డాలర్లు. భారత్‌లో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ. ఆయన సంపద విలువ 116 బిలియన్ డాలర్లుగా ఉంది.

Read More

ప్రొ హాకీ లీగ్ లో భారత పురుషులు, మహిళల జట్లు విజయాలతో అదరగొట్టాయి. పురుషుల జట్టు 4-0తో ఐర్లాండ్ పై గెలిచింది . 14వ నిమిషంలో సంజీప్, 24వ నిమిషంలో మనీప్ సింగ్ 28వనిమిషంలో అభిషేక్, 34వ నిమిషంలో షంషేర్ సింగ్ గోల్స్ తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. తర్వాతి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు 1-0తో బలమైన జర్మనీని ఓడించింది. 12వ నిమిషంలో పెనాల్టీకార్నర్ ను సద్వినియోగం చేస్తూ దీపిక గోల్ చేసింది. జర్మనీని గోల్ కొట్టకుండా డిఫెన్స్ చేసి భారత్ విజయం సాధించింది.

Read More

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ ఉత్కంఠభరితంగా సాగిన టోర్నీ తొలి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్లు సచిన్ (10), అంబటి రాయుడు (5) విఫలమైనా స్టువర్ట్ బిన్నీ 68 (31; 3×4, 7×6), యూసుఫ్ పఠాన్ 56 నాటౌట్; (22; 3×4, 6×6), గుర్కీరత్ 44(32; 7×4), యువరాజ్ 31 నాటౌట్ (22 బంతుల్లో 2×4, 2×6) దూకుడైన ఆటతీరుతో జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 218 పరుగులు మాత్రమే చేసింది. సంగక్కర (51), జీవన్ మెండిస్ (42), గుణరత్నె (37) రాణించారు. ఇర్ఫాన్ పఠాన్ (3/39), ధవళ్ కులకర్ణి (2/34) బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.

Read More

ఈ సంవత్సరం చివర్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ అర్హత సాధించాడు. అమెరికాలోని బోస్టన్లో జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ లో 5 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో గమ్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 2022లో థాయ్ లాండ్ అథ్లెట్ కీరెన్ టన్టేవాట్ (13 ని. 8.41 సె) నెలకొల్పిన ఆసియా రికార్డును అధిగమించాడు.. అలాగే 2025 ప్రపంచ ఛాంపియన్షిప్ స్టాండర్డ్ (13 ని 1.00 సె) అందుకున్నాడు. ఈ విభాగంలో అమెరికా అథ్లెట్ కోల్ హోకర్ (12 ని 59.43సె) గోల్డ్ గెలిచాడు. మరో అమెరికా అథ్లెట్ కూపర్ (12 ని 57.97 సె ) సిల్వర్, ఆస్ట్రేలియాకు చెందిన జాక్ రేనెర్ (12 నిమిషాల 59.43 సె, ) బ్రాంజ్ గెలిచారు.

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా నేడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారీ ఛేజింగ్ ను ఆస్ట్రేలియా చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. డకెట్ 165 (143; 17×4, 3×6)భారీ శతకం తో సత్తా చాటాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. జో రూట్ 68 (78; 4×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. బట్లర్ (23), ఆర్చర్ (21 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ద్వార్షుయిస్ 3 వికెట్లు, జంపాల 2 వికెట్లు, లబుషేన్ 2 వికెట్లు, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల ఆందోళలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ రాసిన లేఖకు ఏపీపీఎస్సీ తాజాగా బదులిచ్చింది. రేపటి పరీక్షను యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. వాయిదా వేయలేమని పేర్కొంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ ఈమేరకు స్పష్టం చేసింది. 2023లో గ్రూప్-2 పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం… రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి రాసిన లేఖకు ఈ దశలో పరీక్షను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ బదులు ఇచ్చింది.

Read More

భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు కీలక పదవి దక్కింది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా అవకాశం లభించింది. ప్రధాని మోడీ పదవీకాలంతో పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర నియామకాల కేబినెట్ తెలిపింది. 1980 బ్యాచ్ కు చెందిన శక్తి కాంత్ దాస్ ఆరేళ్ల పాటు ఆర్.బీ.ఐ గవర్నర్ గా సేవలందించారు. అంతకుముందు రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో సెక్రటరీగా ఉన్నారు. పదవీవిరమణ అనంతరం 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ఉన్నారు.

Read More

న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిట్-3’.అయితే ఇప్పటికే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రానికి దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.‘హిట్’ చిత్రాల ఫ్రాంచైజీలో 3వ పార్ట్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.ఈ చిత్ర టీజర్‌ను నాని పుట్టినరోజు కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 24న టీజర్ ను విడుదల చేయనున్నారు.ఇక తాజాగా ఈ టీజర్‌పై మరింత ఆసక్తిని పెంచేలా ‘రెడీ బాయ్స్’ అంటూ నాని ఓ లాఠీ పట్టుకుని చెప్పే డైలాగ్ ప్రోమోను విడుదల చేశారు.‘రక్తపాతం సృష్టించేందుకు అర్జున్ సర్కార్ సిద్ధం..’ అంటూ హిట్-3 చిత్రబృందం ఈ టీజర్‌పై అంచనాలను పెంచుతున్నారు.ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నారు. https://youtu.be/1qxvcgBpj-o?si=lpPFyw0SP2gjOnR2

Read More

మారిషస్ 57వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వచ్చే నెలలో జరుగనున్నాయి. మార్చి 12న జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులామ్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుకలు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అధినాయకుల్లో మోడీ ఒకరిని ఆయన తన తీరికలేని షెడ్యూల్ లో కూడా తమ ఆహ్వానం అంగీకరించిటంపట్ల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గతేడాది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన రాష్ట్రపతికి యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ గౌరవ డాక్టరేట్ ఆఫ్ సివిల్ లా ను ప్రధానం చేసింది. 1968లో మారిషస్ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.

Read More