పంజాబ్ లో ఆసక్తికర ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ మేరకు పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని నడుస్తున్న ఆప్ ప్రభుత్వం…ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరైన కుల్‌దీప్ సింగ్ ధలివాల్ కు రెండు శాఖలు ఎన్ఆర్ఐ వ్యవహారాలు,అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు అప్పగించింది.గత ఏడాది మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిపింది.అవే శాఖలు ఆయనకు కొనసాగించింది.ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని గ్రహించి తాజాగా మార్పులు చేసింది.దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నిన్న విడుదల చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బీజేపీ విమర్శలు ఈ అంశంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక ‘జోక్’లా మార్చేసిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏమిటని నిలదీస్తున్నారు.లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే…
Author: admin
ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 23 తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.అయితే రేపు జరగనున్న ఈ పరీక్షను కొన్ని రోజులు వాయిదా వేయాలంటూ…రాష్ట్ర ప్రభుత్వం నేడు ఏపీపీఎస్సీకి లేఖ రాసింది.2 ఏళ్ళ క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయంటూ…అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, గ్రూప్-2 మెయిన్స్ కొన్ని రోజుల తరువాత నిర్వహించాలని ఏపీపీఎస్సీకి రాసిన లేఖలో వెల్లడించింది. అయితే రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని,ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా రోస్టర్ విషయంపై కోర్టులో ఉన్న పిటిషన్ మార్చి 11న విచారణకు రానుండగా,కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉందని ప్రభుత్వం పేర్కొంది.అప్పటివరకు పరీక్ష నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది.
పుదుచ్చేరిలోని మనకుల వినయగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన స్టూడెంట్ విశ్వ రాజ్‌కుమార్ (20) గ్లోబల్ మెమరీ లీగ్ వరల్డ్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.కాగా ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పోటీల్లో కేవలం 13.50 సెకన్లలో 80 అంకెలను గుర్తుకు తెచ్చుకొని సహ పోటీదారులను ఆశ్చర్యపోయేలా చేశాడు.అయితే యాదృచ్ఛికంగా తెరపై ప్రదర్శించిన 80 అంకెలను వీలైనంత త్వరగా తిరిగి గుర్తుకు తెచ్చుకోవాలి.వాటిని 100% కచ్చితత్వంతో రీకాల్ షీట్‌లో నమోదు చేయాలి.రాజ్‌కుమార్ ఈ లక్ష్యాన్ని రికార్డు వేగంతో పూర్తి చేయడంతో పాటు 30 చిత్రాలను కేవలం 8.40 సెకన్లలో తిరిగి గుర్తు చేసుకున్నాడు.
ఏపీలో రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు జరిగాయి.కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 44 వేల మంది రైతుల నుంచి 20 లక్షల క్వింటాళ్ల పత్తిని క్వింటాలుకు రూ.7121 చెల్లించి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచిందని ఏపీ సీఎంఓ కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపింది. వరి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిపి రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బును జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పత్తి రైతులకు అండగా నిలబడిందని పేర్కొంది. సీసీఐ ఈ స్థాయి లో పత్తి సేకరించడం గత 10 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మార్చి 15 నుండి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఆర్డీఏ, ఏడీసీ ఇప్పటివరకు 62 పనులకు టెండర్లు పిలిచినట్లు తెలుస్తోంది. రూ.40 వేల కోట్ల విలువైన పనులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలో సీఆర్డీఏ టెండర్లు పిలవనుంది. అయితే, ఈ ప్రక్రియ కృష్ణా-గంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో ఇప్పటివరకు పుణ్య స్నానమాచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లను దాటిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళా యొక్క శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని పేర్కొన్నారు. అది గిట్టని కొందరు అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 26న మహాశివరాత్రి నాటికి 60 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నా కానీ దానికి ముందే అంచనాలకు మించి భక్తులు హాజరయ్యారని యోగి తెలిపారు. ఇక మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని ఇటీవలే యూపీ ప్రభుత్వం తెలిపింది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎంతో విశిష్టత కలిగిన జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ కు వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.వచ్చే నెలలో జరిగే మారిషన్ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.అయితే ఈ విషయాన్ని మారిషన్ ప్రధాని రామ్‌గూలమ్ అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.ప్రపంచ నాయకుల్లో ఒకరైన మోదీ….ఆయన బిజీ షెడ్యూల్‌లోనూ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త …సచిన్,యువరాజ్ సింగ్, కుమార సంగక్కర, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్ లాంటి సీనియర్లు మరోసారి మైదానంలో దిగి అభిమానులను ఉత్సాహపరచనున్నారు.వీరంతా కలసి మరొకసారి క్రికెట్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి సీజన్ నేటి నుండి ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్ భారత్-శ్రీలంక జట్ల మధ్య నేడు జరగనుంది. కాగా ఈ మ్యాచ్ నేడు 7.30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ లో సచిన్,యువీల బ్యాటింగ్ ను మరొకసారి ఆస్వాదించవచ్చు.అయితే ఈ మ్యాచ్ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రోజు జరగనుంది.ఈ టోర్నమెంట్ లో టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు.ఈ జట్టులో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు.దశాబ్ధ కాలం తర్వాత సచిన్-యువీ ద్వయం టీమిండియా జెర్సీ ధరించి ప్రేక్షకులను అలరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళల సేఫ్టీ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి,వారికి ట్రైనింగ్ ఇవ్వాలని పోలీసులను హోమ్ మంత్రి అనిత కోరారు.ఈ ఎరకు సురక్ష పేరుతో రూపొందిస్తున్న ప్రత్యేక యాప్‌కు సంబంధించి ఆమె పలు కీలక సూచనలు చేశారు.అయితే మార్చి 8 కల్లా యాప్ రూపకల్పన పూర్తి కావాలన్నారు.మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని పేర్కొన్నారు.విద్య, సాధికారిత, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.మార్చి 8 మహిళా దినోత్సవమైన నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అనిత ఆదేశించారు.
నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
