గతేడాది ‘దేవర’తో మంచి విజయాన్ని అందుకున్నారు అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన ‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్నారు. తాజాగా ఈచిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ధ్రువీకరించింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందనున్న ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఈచిత్రం రానుందని చర్చించుకుంటున్నారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినీ ప్రియులను ఆకట్టకుంటోందని ఎన్టీఆర్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Author: admin
దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికా అనుసరిస్తున్న టారిఫ్ పాలసీలు, దాని వలన ఇన్ ఫ్లేషన్ పెరుగుతుందన్న ఊహాగానాలతో సూచీలు జోరు చూపలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,735గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 19.75 పాయింట్ల నష్టంతో 22,913 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.64గా కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
భారత్ అర్జెంటీనాలు రీఛార్జిబుల్ బ్యాటరీల తయారీలో ముఖ్యమైన లిథియం అన్వేషణతో పాటు మైనింగ్ సెక్టార్ లో పరస్పరం సహకరించుకునేలా కీలక అవగాహనకు వచ్చాయి. ఇందుకు సంబంధించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్జెంటినా లోని కెటమార్కా గవర్నర్ రౌల్ ఆలెజాండ్రోజలీల్ సమక్షంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, కెటమార్కా ప్రొవెన్షియల్ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య తాజాగా ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అర్జెంటీనాలో లిథియం అన్వేషణ ప్రారంభించాయని నాలుగైదు సంవత్సరాలలో అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపడతాయని తెలిపారు.
ఐటీ రూల్స్ (2021) లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు, సోషల్ మీడియా వేదికలు తప్పని సరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. చిన్న పిల్లల్లకు ‘ఏ’ రేటెడ్ కంటెంట్ ను అందుబాటులో ఉంచకుండా చూడాలని ఆదేశించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నేడు ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. అశ్లీలం, అసభ్యకరమైన కంటెంట్ లపై ఫిర్యాదులు అందాయని ఐటీ రూల్స్ (2021) లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు, సోషల్ మీడియా వేదికలు తప్పని సరిగా పాటించాలని ఈ నిబంధనలు ఉల్లంఘించే ఎటువంటి కంటెంట్ ను ప్రసారం చేయరాదని పేర్కొంది. వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని ఓటీటీలు నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది. ఇక ఇటీవల ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే కార్యక్రమంలో రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానం వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ స్టేజీపైనే ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రధాని మోడీ తనతో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించగా పవన్ సమాధానమిచ్చారు. ‘ప్రధాని నాతో చిన్న జోక్ చేశారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగారు. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని, నువ్వు చేయాల్సిన పని చెయ్యాలని చెప్పారని పవన్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రులు, పలువురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో ముగ్గురు అధికారులను తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీ.వి.రెడ్డి తెలిపారు. ఈమేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధం శెట్టి సురేష్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ, ప్రొక్యూర్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ ను తొలగిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశించిన వారు పట్టించుకోలేదు. ఎంప్లాయీస్ తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఉండీ సంతకాలు చేయలేదు. జీతాల రూపంలో సంస్థ డబ్బు చెల్లించారు. జీఎస్టీ అధికారులు సంస్థకు రూ.377 కోట్లు ఫైన్ విధించారు. గత నెలలో ఫైన్ విధించినా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు ఆయినా ఫైబర్ నెట్ లో పురోగతి లేదని సంస్కరణలు తీసుకు రావాలని చూస్తున్నా అధికారులు సహాకరించడం లేదని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈరోజు రామ్ లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీకి ఆమె నాలుగో మహిళా ముఖ్యమంత్రి. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు.ఆమెతో పాటు డిప్యూటీ సీఎం పర్వేష్, ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జల జీవన్ మిషన్ మరియు రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించారు.జల వనరుల సమర్థవంతమైన వినియోగం కోసం కేంద్ర సహకారాన్ని కోరారు. నేడు వీరిరువురూ ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి గత నెలలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తన విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో ఓటమి చెంది ఉంటే తన పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. మియామీ లో నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తనతో దారుణంగా వ్యవహారించినట్లు ఆరోపించారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటూ జీవితం గడిపే పరిస్థితి వచ్చేదని తెలిపారు. ప్రెసిడెంట్ గా గెలిచినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక 2024 ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కమలా హారిస్ పై ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మిస్ వరల్డ్-72 పోటీలకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఇక్కడ జరగనున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో జరగనుంది. ఇంతకు ముందు ముంబై, న్యూఢిల్లీల్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ముంబైలో నిర్వహించారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుండి అతివలు పాల్గొననున్నారు. ‘బ్యూటీ విత్ ఏ పర్సన్’ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఉండనున్నాయి. ఈ సంవత్సరం మే 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు తెలంగాణ వేదికగా ఈ పోటీలు జరుగుతాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉండనుంది.
