Author: admin

మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు 9-16 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ వ్యాక్సిన్ పై రీసెర్చ్ కూడా పూర్తి కావొస్తున్నట్లు వివరించారు. మెడికల్ ట్రయల్స్ కొనసాగుతున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 30 సంవత్సరాలు దాటిన మహిళలకు హాస్పిటల్స్ లో టెస్టులు చేస్తారని తెలిపారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని తెలిపారు.

Read More

భారత్ ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మరియు వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదగడానికి ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారు రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే డ్యూయల్ ట్యాక్స్ విధానం రద్దు ఒప్పందాలపై భారత్-ఖతార్ ప్రతినిధులు సంతకాలు చేశారు. మరికొన్ని ఎంఓయూలు కూడా జరిగాయి. వాటిలో ఆర్కైవ్స్ మేనేజ్మెంట్, యువజన వ్యవహారాలు, ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం, క్రీడలలో సహాకారం వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ దానిల సమక్షంలో హైదరాబాద్ హౌస్ లో జరిగింది. దీనికి ముందు ఇరువురు నేతలు విస్తృతస్థాయి చర్చలు జరిపారు.

Read More

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకి అండగా నిలిచి భరోసానిచ్చినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని జగన్ అన్నారు. రైతుల దీనస్థితికి ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. తమ హయాంలో వ్యవసాయం పండగలా మారిందని రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామని పేర్కొన్నారు . కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదని తమ హయాంలో రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేదని తెలిపారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని వైఎస్ జగన్ ఆక్షేపించారు.

Read More

ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డీఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైన కూడా సమావేశంలో చర్చించారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై చర్చించారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు కుట్ర పన్నారని విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని, అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ…

Read More

విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు రూ. 1554.99 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ. 608.08 కోట్లు, తెలంగాణకు రూ. 231. 75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ. 170.99 కోట్లు విడుదల చేసింది. ఈ కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ నిధులు మంజూరు కావడం గమనార్హం.

Read More

ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్నత విద్యకు సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతిభ, పనితీరు అర్హతలుగా యూనివర్సిటీలకు వీసీలుగా నియమించినట్లు పేర్కొన్నారు.భావి పౌరులను రూపొందించడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తుంది, అయితే గత పాలనలో, రాజకీయ ప్రభావం మరియు లాబీయింగ్ ఈ ప్రక్రియను బలహీనపరిచిందనీ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్-ఆధారిత వ్యవస్థ విజ్ఞాన సేవ చేయడానికి అర్హులైన వ్యక్తులను నియమించేలా చేస్తుంది. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తూనే ఈ విధానం ఇప్పటికే ఫలితాలను అందిస్తోందని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా, ST కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ, ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యారు (ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమండ్రి). ఇది విద్య మరియు సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయి. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ ఈసందర్భంగా అభినందించారు. విద్య మరియు విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Read More

రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఆక్వా రంగం నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. జిఎఫ్‌ఎస్‌టి నిర్వహించిన ఆక్వా టెక్ 2.0 కాన్‌క్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఇక ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. పద్దతి ప్రకారం ఆక్వా సాగు చేస్తున్నవారిని ప్రోత్సాహిస్తామని తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యుత్ ఛార్జీలు సహా పలు కీలక నిర్ణయాలు ఆక్వా రైతాంగం విషయంపై తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆక్వా రైతాంగానికి అండగా ఉంటామని బ్యాంకులతో మాట్లాడి వీలైనంత ఎక్కువ రుణాలు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు.

Read More

భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించబడిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) ఈ నెల 16న ప్రకటించింది. అమెరికా ప్రజల ట్యాక్స్ ల నుండి వస్తున్న డబ్బును వీటికి ఖర్చు చేయడం తగదని, కావున ఇకపై ఇలాంటి వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఇక ఈ‌నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తలూపారు. భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని భారత్ కు ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని చెప్పారు. భారత్‌కు మేం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? వారి వద్దనే చాలా డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ లు కలిగిన దేశం అదే. వారి టారిఫ్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. భారత్ మరియు వారి ప్రధాని అన్నా మాకు చాలా గౌరవం. కానీ, ఓటింగ్‌ పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇచ్చే అవసరం…

Read More

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్ తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష అప్లికేషన్ గడువును యూపీఎస్‌సీ మరోసారి పొడిగించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకునేందుకు వీలు కల్పించింది. ఆల్ ఇండియా సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి గానూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గత నెల 22న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా, ఆ గడువును ఫిబ్రవరి 18వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు నిన్నటితో ముగియనుండటంతో ఫిబ్రవరి 21 వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న నిర్వహించనున్నారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు వీలు కల్పించింది.…

Read More

జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమేరకు లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సింఘానియా స్కూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యా నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణతో పాటు… సాంకేతిక అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాలల నిర్వహణలో మార్పులు తీసుకురానున్నారు. ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా 1 లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని లోకేష్ తెలిపారు. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారని వివరించారు . రాబోయే రోజుల్లో  రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దడమే…

Read More