ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సుదీర్ఘ కాలం తరువాత దేశ రాజధాని ఢిల్లీ అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. తొలిసారి షాలిమార్‌బాగ్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతగా పని చేస్తానని రేఖా గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.తనపై విశ్వాసం ఉంచి సీఎంగా బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్ఠానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బీజేపీ నుండి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతిశీ మహిళా ముఖ్యమంత్రులుగా పని చేశారు.
Author: admin
ప్రకృతి వ్యవసాయం, ఎండ్ టు ఎండ్ మార్కెటింగ్ వ్యవస్థ, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్‌మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్న పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్‌కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో శ్రీ కీత్ అగోడా తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం లభించనుంది. దావోస్‌లో జరిగిన చర్చల్లో భాగంగా పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపికి వచ్చారు. ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం జరగనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ పైన ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు.సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు. జగన్ గారికి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని సెటైర్స్ వేశారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే…
ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్ లో భారత యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ 796 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 773 పాయింట్లతో రెండో స్థానంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 761 పాయింట్లతో మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 727 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 2023 ప్రపంచ కప్ సందర్భంగా మొదటి సారి గిల్ నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్ కూడా 9వ ర్యాంకుతో టాప్ 10లో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ నేడు ప్రారంభమైంది. 7 సంవత్సరాల తరువాత తిరిగి పునః ప్రారంభమైన ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ మరియు ఆతిథ్య జట్టైన పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో 60పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కరాచీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు భారీ స్కోరు చేసింది. విల్ యంగ్ 107 (113; 12×4, 1×6), టామ్ లాథమ్ 118 నాటౌట్ (104; 10×4, 3×6) సెంచరీలతో కదంతొక్కారు. పాకిస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. గ్లెన్ ఫిలిప్స్ 61 (39; 3×4, 4×6) కూడా మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందుంచింది.…
విలక్షణ నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శబ్దం’. లైలా, సిమ్రాన్, లక్ష్మీ మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అరివళగన్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. 7జీ ఫిలిమ్స్ పతాకంపై శివ నిర్మించారు. ఈనెల 28న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ విడుదలైంది. టైటిల్ కు తగినట్లుగా ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. https://youtu.be/ht58otSIbsk?si=S4MmNabNcxDW5Cnn
తిరుపతి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లతో పాటు ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ’, ‘మన టీడీపీ యాప్’, ‘సభ్యత్వ నమోదు’ తదితర పార్టీ కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన వారందరినీ ఈసందర్భంగా అభినందించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడాలని నాయకులకు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తే అధినేత అని తాను భావిస్తానని … సీనియర్లు, జూనియర్లు అని కాకుండా బాగా పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా వారికి చెప్పారు.
ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజు మొత్తం ఒడిదుడుకులకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 75,939గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 22,932 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.85గా కొనసాగుతోంది. జొమాటో, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాలతో ముగిశాయి.
తెలంగాణా ఆర్టీసీ విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఒక మంచి వార్తను అందించింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో స్పెషల్ రాయితీ కల్పించింది. విహారి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసులలో 10% రాయితీ కల్పించింది. రాజధాని ఏసీ సర్వీసులలో 8% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు టీజీఎస్ ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ను వినియోగించుకోవాలని తెలిపింది.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవివారికి ప్రత్యేకపూజలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు, ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రిపర్వదినం సందర్భంగా శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణ మహోత్సవం, ఫిబ్రవరి 27వ తేదీన రథోత్సవం మరియు తెప్పోత్సవం జరుగనున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.
