Author: admin

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ సోనియా గాంధీ అస్వ‌స్థ‌త‌కు గురైనట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని స‌ర్ గంగారాం హాస్పిటల్ లో చేరగా… ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని హాస్పిటల్ వ‌ర్గాలు తెలిపాయి. ఈరోజు సాయంత్రం ఆమెను డిశ్చార్జి చేసే అవకాశం ఉందని హాస్పిటల్ బోర్డు మేనేజ్‌మెంట్ చైర్మ‌న్ డాక్ట‌ర్ అజ‌య్ స్వ‌రూప్ తెలిపారు. ప్ర‌స్తుతం ఆమె గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమెకు కొన్ని ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

Read More

వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వైసీపీకి ఉంది‌ కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే.. వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదమని అన్నారు. సమాధానం చెప్పలేక దాటవేయడం వారి అవివేకానికి నిదర్శనమని అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదని దమ్ముంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ…

Read More

ఆసియా స్నూకర్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ అదరగొట్టాడు. అతను ఈ టోర్నీలో 14వ టైటిల్ సాధించాడు. ఫైనల్ లో ఇరాన్ కు చెందిన ఆమీర్ సార్కోష్ పై 4-1తో విజయం సాధించాడు. ఆసియా ఛాంపియన్ షిప్ లో పంకజ్ అద్వానీ ఇప్పటి వరకు స్నూకర్ లో 5, బిలియర్డ్స్ లో 9 టైటిల్స్ గెలిచాడు. ఇక తాజా గెలుపుపై హార్షం వ్యక్తం చేశాడు. 14వ టైటిల్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో గట్టి పోటీ ఎదురైనప్పటికీ స్వర్ణం సాధించాడు. 2006, 2010 ఆసియా క్రీడల్లో కూడా పసిడి పతకాన్ని సాధించాడు. ఇటీవలే నేషనల్ స్నూకర్ విజేతగానూ నిలిచాడు.

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా నేడు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటయింది. ఆరంభంలో తడబడి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును టౌహిద్ హ్రిదయ్ 100 (118; 6×4, 2×6) జాకిర్ అలీ 68 (114; 4×4) తో కలిసి 154 పరుగుల విలువైన భాగస్వామ్యంతో గౌరవప్రదమైన స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో హ్రిదయ్ సెంచరీ సాధించగా…అలీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టన్జిద్ హాసన్ (25), రిషద్ (18) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లతో సత్తా చాటడమే కాకుండా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరాడు. హార్షిత్…

Read More

ఏపీని మాజీ సీఎం జగన్ అప్పుల కుప్పగా మార్చడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.కాగా వెన్ను నొప్పి కారణంగానే తాను కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు.అయితే ఇప్పటికీ వెన్ను నొప్పి బాధిస్తోందని ఆయన తెలిపారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందని అన్నారు.అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ చెప్పారు.తనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నానని అన్నారు.

Read More

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల ‘లైలా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.ఈ సినిమా కలెక్షన్స్ అయితే విశ్వక్ సేన్ గత సినిమాలకంటే దారుణంగా వచ్చాయి.కాగా ఈ చిత్రంపై విశ్వక్ ఎంతగానో ఆశలు పెట్టుకున్నాడు.ఈ సినిమా ఫలితం దారుణంగా రావడంతో విశ్వక్ సేన్ తాజాగా దీనిపై స్పందించాడు.ఈ మేరకు విశ్వక్ తన అభిమానులను ఉద్దేశించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు.ఇప్పటివరకు చేసే సినిమాలపై నమ్మకంతో ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.గత కొంతకాలంగా తన నుండి మంచి చిత్రాలు రావడం లేదని అభిమానులు అంటున్నారని..వారి మాటలను తాను గౌరవిస్తున్నానని..ఇకపై తాను చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటానని.. ఎలాంటి వల్గారిటీ లేని కామెడీ చేస్తానని విశ్వక్ సేన్ నోట్ లో పేర్కొన్నాడు. 🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il— VishwakSen (@VishwakSenActor) February 20, 2025

Read More

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “కూలీ.మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా చిత్రీకరణ కూడ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం.అయితే ఈ చిత్రంపై తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ ఓ క్రేజీ సీక్వెన్స్ ని డిజైన్ చేశాడని తెలుస్తోంది.ఈ చిత్రానికి తన గత సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలకు ఎలాంటి సంబంధం లేని అప్పటికి, వాటిలో ఉన్నలాంటి కొన్ని సీన్స్ ని ఫున్ టైప్ లో చూపించి ఎంటర్టైన్ చేయనున్నాడు చెబుతున్నారు.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

Read More

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఏపీ సీఎం జగన్‌తో స్నేహంగా ఉంటూ,అప్పటి ఏపీ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి సహకరించారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అప్పటి ఏపీ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు.కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్‌దేనని విమర్శించారు. అయితే మేము అధికారంలోకి రాగానే కృష్ణా జలాల్లో 500 టీఎంసీల కోసం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదని ఉత్తమ్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ, బీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం నిండాయని ఆయన ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే,…

Read More

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందంటూ చేసిన విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక నీటిని వాడుకుంటుందన్న తెలంగాణ నేతల వాదనలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన వాటా మేరకే నీటిని ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు.అయితే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదిలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని,సముద్రంలో కలిసే నీటిని మాత్రమే అదనంగా వాడుకుంటున్నామని వెల్లడించారు.కృష్ణా జలాల అంశంపై మాత్రం కొంత సమస్య ఉందని,దీనికి సత్వర పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

Read More

తప్పు చేసిన వారి విషయంలో చట్టం తప్ప, రాజకీయ జోక్యం ఉండదని ఎవరు తప్పు చేసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. మిర్చి రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి సీఆర్…

Read More