Author: admin

బీసీసీఐ మాజీ చైర్మన్,టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది.కాగా ఈ ఘటనలో ఆయ‌న‌కు ఎటువంటి గాయాలు కాలేదు.గంగూలీ బుర్ద్వాన్ యూనివ‌ర్సిటీలో కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యేందుకు వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది.అనంతరం కొంచెం ఆల‌స్యంగా ఆ కార్య‌క్ర‌మంలో గంగూలీ పాల్గొన్న‌ట్లు పోలీసులు వెల్లడించారు.ప‌శ్చిమ బెంగాల్‌లోని పుర్బా బ‌ర్ద‌మాన్ జిల్లాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ మేరకు దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న దంత‌న్‌పుర్ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది.అయితే గంగూలీ ప్ర‌యాణిస్తున్న కారును.. వేగంగా వెళ్తున్న లారీ ఓవ‌ర్‌టేక్ చేసింది.ఆ స‌మ‌యంలో గంగూలీ ప్ర‌యాణిస్తున్న కారు డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశాడు.దీనితో అత‌డి కాన్వాయ్‌లోని వాహ‌నాలు ఒక్కొక్క‌టి ఢీకొన్న‌ట్లు బెంగాల్ పోలీసు వెల్ల‌డించారు.వెనుక భాగం నుండి కాన్వాయ్‌లోని కారు గంగూలీ వాహ‌నాన్ని ఢీకొట్ట‌న‌ట్లు పోలీసులు తెలిపారు.కాన్వాయ్‌లోని రెండు వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి.

Read More

అమెరికా ఎఫ్‌బీఐ సంస్థ డైరెక్ట‌ర్‌గా భార‌తీయ మూలాలు ఉన్న వ్య‌క్తి కశ్య‌ప్‌ పటేల్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికన్లకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే సహించేది లేదని అన్నారు.ఎఫ్‌బీఐ తొమ్మిదో డైరెక్టర్‌గా తనను నియమించడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని కాశ్ పటేల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎఫ్‌బీఐ ద‌ర్యాప్తు ఏజెన్సీ.. పార‌ద‌ర్శ‌క‌త‌, బాధ్య‌త‌, న్యాయానికి మారు పేరు అని, ఆ సంస్థ‌ను పున‌ర్ నిర్మించ‌నున్న‌ట్లు త‌న పోస్టులో కాశ్ ప‌టేల్ వివరించారు.కాశ్ పటేల్ పేరును అలస్కాకు చెందిన రిపబ్లికన్లతో పాటు పలువురు డెమోక్రట్లు వ్యతిరేకించారు.అయితే, 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది.

Read More

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బీఎస్పీ నేత,యూపీ మాజీ సీఎం మాయావ‌తి గట్టి కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించింద‌ని,దీనితో ఢిల్లీలో బీజేపీ విజయం సాధించింది అని మాయావ‌తి పేర్కొన్నారు.అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఇండియా కూట‌మికి బీఎస్పీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని,ఇది నిరుత్సాహానికి గురిచేసిన‌ట్లు ఇటీవ‌ల రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.కాగా బెహ‌న్‌జీ త‌మ‌తో క‌లిసి ప‌నిచేస్తే,బీజేపీ నెగ్గేది కాద‌ని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ఆమె ఈరోజు బదులు ఇచ్చారు. త‌న ఎక్స్ అకౌంట్‌లో మాయావతి పోస్టు చేశారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ ప‌నిచేసింద‌న్న సంగతి అంద‌రికీ తెలుసు అని,దీని వలనే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.అందుకే కాంగ్రెస్ పార్టీ దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉంద‌ని, క‌నీసం ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు చాలా చోట్ల డిపాజిట్ కూడా ద‌క్క‌లేద‌ని ఆమె తెలిపారు. ఇత‌రుల…

Read More

ప్రధాని నరేంద్ర మోదీని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ప్రశంసించారు.ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ ఆయన మాట్లాడారు.ప్రధాని మోదీ తనకు సోదరుడిలాంటి వారని,ఆయనను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందన్నారు.కాగా ప్రధాని మోదీ తనకు గురువని,మరింత కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తిని ఆయన నుండి పొందుతానని తెలిపారు.

Read More

కనీసం సెలవు కూడా పెట్టకుండా సంవత్సరానికి పైగా విధులకు హాజరు కానీ 55 మంది వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది.ఈ మేరకు విధులకు వైద్యులు గైర్హాజరవుతున్నారని…వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారంటూ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తను ఆశ్రయించారు.ఈ విషయాన్ని లోకాయుక్త చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరింది.కాగా విధులకు హాజరుకాని వారిని గుర్తించి, వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.తాజాగా లోకాయుక్త ఆదేశాల మేరకు విధులకు హాజరు కాని 55 మందిని ప్రభుత్వం గుర్తించి టెర్మినేట్ చేసింది.ఇక టెర్మినేట్ చేసిన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది.

Read More

మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 1నుండి 19 వరకూ ఇంటర్ ప్రధమ,3నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. మార్చి 3 నుండి 15 వరకూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతాయి. ఉ.9 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షా సమయం. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు:1800 425 1531 ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు . పరీక్షల ఏర్పాట్లను సిఎస్ విజాయనంద్ సమీక్షించారు.

Read More

ఇష్టం వచ్చినట్లు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ…కొంతమంది బుద్ది ఏ మాత్రం మార్చుకోవడం లేదు.తమకు గిట్టని వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు.కాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై హర్షవర్ధన్ రెడ్డి అనే అతను ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.ఇటీవల కుంభమేళాలో తన భార్య అనా,కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,టీటీడీ సభ్యుడు ఆనందసాయిలతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు చేస్తున్న ఫొటోను మరో సినీనటుడు సంపూర్ణేశ్ బాబుతో పోల్చుతూ…హర్షవర్ధన్ రెడ్డి ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.అయితే ఈ పోస్ట్ పై జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత రిషికేష్ కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో రిషికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు…

Read More

పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు నాణ్యమైన ట్రైనింగ్ ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఉచిత కోచింగ్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఎస్సీ ఓబీసీ విద్యార్థులతో పాటు పీఎం కేర్స్ లబ్దిదారులకు కూడా నాణ్యమైన కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి ఆరో ప్లానింగ్ ప్రణాళికలోనే ప్రారంభించిన ఈ ఫ్రీ కోచింగ్ స్కీమ్ కెపాసిటీ మరింత మెరుగ్గా చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులు చేశారు. తాజాగా చేసిన మార్పులను పీఎం కేర్స్ లబ్దిదారులకు విస్తరించారు. ఈ విద్యార్థులకు సంబంధించి క్యాస్ట్, ఇన్ కం నియంత్రణలు తొలగించారు. యూపీఎస్సీ సివిల్స్ సహా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే అన్ని పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్, వివిధ రకాల భీమా సంస్థలు నిర్వహించే పరీక్షలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఈ స్కీమ్ కింద ఫ్రీ కోచింగ్ ఇస్తారు.

Read More

కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఆర్థిక నిపుణుల పదవీకాలాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంకు మరో సంవత్సరం అవకాశం ఇచ్చింది. ఆయన 2023 ఫిబ్రవరి లో రెండు సంవత్సరాల పదవీ కాలానికి నియమితులయ్యారు. పదవీకాలం పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ నియామకాలు కమిటీ మరో సంవత్సరం పదవీకాలం పొడిగించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక అడ్వైజర్ వి.అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని రెండు సంవత్సరాలు పొడిగించింది. 2022 జనవరిలో ఆయన నియమితులు కాగా మూడు సంవత్సరాలు పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పిస్తూ పొడిగించింది. దీంతో 2027 మార్చి 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Read More

దేశంలోని వాస్తవం పరిస్థితుల నుండి కేంద్రం ప్రజల దృష్టిని మరలిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలిలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా బఛ్ రావాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతనుద్దశించి మాట్లాడారు. జగత్ పూర్ లో తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు రాణా భేణి మాధవ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో దళితుల పాత్రను కొనియాడారు. బార్ గడ్ చౌరాహా సమీపంలోని మూల్ భారతి హాస్టల్ లోని దళిత విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు.

Read More