ఏపీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళాలో స్నానమాచరించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో వీరు పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుండి బయల్దేరి వారణాసికి చేరుకుని అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం వారణాసి నుండి విజయవాడకు తిరిగి బయలుదేరతారు. ఈ నెల 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుండి సైతం భక్తులు తరలి వచ్చి ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Author: admin
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ మేరకు ఆయనకు ఏపీ ఉ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ …”తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా…తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యులు,మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు. Heartfelt birthday wishes to the…
ఉక్రెయిన్ లో శాంతి చర్చల ప్రక్రియ శరవేగంగా ముందుకు కదులుతోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పశ్చిమాసియా అధికారిక పర్యటన కోసం యూఏఈ చేరుకున్నారు. అమెరికా నుండి కీలక అధికారులు కూడా సౌదీకి బయలుదేరారు. మరోవైపు కొద్ది రోజులలో అమెరికా-రష్యాల మధ్య యూఏఈలో ఉక్రెయిన్ గురించి శాంతి చర్చలు జరుగనున్నాయి. ఉక్రెయిన్ రష్యా లో మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. ఇక ఈ శాంతి చర్చల కోసం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్ కోఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్జ్ కూడా సౌదీకి బయలుదేరారు. యుద్దాన్ని ముగించే ఏ చర్చలలో అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా భాగమవుతారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా…
తాజాగా ‘అమరన్’ చిత్రంతో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ భారీ హిట్ అందుకున్నారు.అయితే శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్ ను చిత్రబృందం విడుదల చేసింది.అయితే ఈరోజు శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ ను విడుదల చేసి,సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ చిత్రాన్ని లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఇందులో రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. https://youtu.be/_t-t8mG_vUY?si=F2VOW1qLP6M2xmBB
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2 – తాండవం’ చిత్రం వసుంది.ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో బాలయ్య నటిస్తున్న అఘోర పాత్ర పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ సన్నివేశాలు ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తుంది.ఇందులో ప్రగ్యా జైస్వాల్,సంయుక్త మీనన్,ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారు.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట,గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు . అందినకాడికి అప్పులు చేశారని 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా… జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి… అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరింది. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికమని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా…
రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని టెక్ నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు.అయితే ఇప్పటికే చాట్ జీపీటీ,గూగుల్ జెమిని,చైనా డీప్ సీక్,మెటా ఎల్ఎల్ఏఎంఏ వంటి మోడళ్లు ఏఐ రంగంలో ఉన్నాయి.కాగా ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ ఏఐ కూడా ఈ రేసులో ఉంది.అయితే ఎలాన్ మస్క్ చెందిన ఎక్స్ గ్రోక్ ఏఐ మోడల్ ను గత ఏడాది తీసుకువచ్చింది.తాజాగా ఈ మోడల్ ను మరింత అభివృద్ధి చేసిన గ్రోక్-3 ను తీసుకువస్తున్నారు.తాజాగా ఈ అంశంపై ఎలాన్ మస్క్ స్పందించారు.గ్రోక్-3 అంతటి తెలివైన ఏఐ చాట్ బాట్ భూమ్మీద మరొకటి లేదని అన్నారు.రేపు ఉదయం 9.30 నిమిషాల నుండి అందుబాటులోకి రానుందని తెలిపారు.తాజాగా ఈ గ్రోక్-3లో టెక్ట్స్ టు వీడియో ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,సామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాతో ఉన్న వైరంపై ఆయన అనవసర వ్యాఖ్యలు చేశారు.చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని పిట్రోడా అన్నారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…చైనా నుండి ఎటువంటి సమస్య ఉందో అర్థం కావడం లేదని, అమెరికా ప్రమేయం వల్లే చైనాను శత్రువుగా చూస్తున్నారని పిట్రోడా తెలిపారు. అయితే మన వ్యవహార శైలి ముందు నుంచీ వైరం పెట్టుకునే రీతిలో ఉందని,ఇలాంటి ప్రవర్తన వల్లే శత్రువులు తయారవుతారని,చైనా మన శత్రువు అనే ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని పిట్రోడా అన్నారు.ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.చైనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు…పిట్రోడా వ్యాఖ్యలకు భిన్నంగా ఉండడంతో..బీజేపీ ఆ పార్టీని తప్పుపట్టింది. భారత్ తన భూభాగాన్ని చైనాకు సమర్పించిందని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది.
ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భద్రత సంబంధమైన కారణాలతో తమ జట్టును పాక్ కు పంపించమని బీసీసీఐ తేల్చిచెప్పడంతో ఐసీసీ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించనుంది. పాకిస్థాన్ కూడా దీనికి తప్పక అంగీకరించింది. దీంతో భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడనుంది. ఇక భారత జట్టు తమ దేశానికి రాకపోవడంపై పాక్ అసహానంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా చేసిన ఒక చర్యపై భారత అభిమానులు మండిపడుతున్నారు. కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఈ టోర్నీ ఆడుతున్న ఎనిమిది దేశాలలో ఏడు దేశాల జెండాలను ఉంచిన పీసీబీ… భారత జాతీయ పతాకాన్ని మాత్రం ప్రదర్శించకపోవడం పట్ల భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. అయితే అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. దాంతో…
భారత ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకునేందుకు చూసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మునుపటి బైడెన్ ప్రభుత్వం 21 మిలియన్ డాలర్లు కేటాయించింది.తాజాగా ట్రంప్ సర్కారు వాటిని నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇకపై నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ప్రకటించింది.అమెరికా పన్ను చెల్లింపుదారులు చెల్లించే ప్రతి డాలర్ సొంతానికి మాత్రమే కేటాయిస్తామని,మిగతావి అన్ని రద్దు చేస్తున్నామని తెలిపింది.
