Author: admin

మహా శివరాత్రి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ లోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి.కాగా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుండి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.అయితే ఈ ఉత్సవాల కోసం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు.తాజాగా ఆయన రెబెల్ స్టార్ ప్రభాస్ ను కలిశారు.అయితే హైదరాబాదులోని ఫౌజీ సినిమా సెట్స్ వద్దకు వెళ్లిన సుధీర్ రెడ్డి…ప్రభాస్ కు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు కూడా కుటుంబసమేతంగా రావాలని ఆహ్వానించారు.ఈ మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను ప్రభాస్ కు సుధీర్ రెడ్డి వివరించారు.

Read More

ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ సమయానికి ‘మేడిన్ ఇండియా ‘ మొదటి చిప్ ను తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులు, మేడిన్ ఇండియా చిప్ గురించి మాట్లాడారు. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.13,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇంకా భారీ ఎత్తున రానున్నట్లు వెల్లడించారు. సెమీ కండక్టర్ల విషయంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 234 యూనివర్సిటీలలోని విద్యార్థులకు తాజా సెమీకండక్టర్ డిజైన్ సాధనాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 ను పూర్తి చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. మొహాలీ లోని సెమీ కండక్టర్ ల్యాబ్ ఆధునీకరణ ఇంకా పెండింగ్లో ఉందని ఇది పూర్తి కాగానే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం…

Read More

అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి చెందారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. సీనియర్ నటీమణి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అలనాటి నటి, సీనియర్ నిర్మాత 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్ ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాననీ చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Read More

గత సాయంత్రం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కుంభమేళా ఈనెల 26న ముగుస్తుంది. ఈనేపథ్యంలో సందర్శించేందుకు భారీగా భక్తులు ప్రయాగ్ రాజ్ తరలివెళ్తున్నారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఉండటంతో కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే, కుంభమేళాకే వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్‌ఫ్లాంపై ఉండటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు రైల్వే తెలిపింది.

Read More

భారత జట్టులో నెలకొన్న స్టార్ కల్చర్ పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జనాలను ప్రతిబింబించేలా తమతో పోల్చుకునే విధంగా ఆటగాళ్లు ఉండాలి గానీ వారిని దేవుళ్ళుగా, సూపర్ స్టార్లుగా కొలిచే విధానానికి గుడ్ బై చెప్పాలని సూచించారు. భారత క్రికెట్ లో పరిస్థితులను సాధారణంగా ఉంచడం ముఖ్యం. మేము క్రికెటర్లం మాత్రమే సూపర్ స్టార్స్ కాదు జట్టు లో సెలబ్రిటీ కల్చర్, ఆటగాళ్లను ఆరాధించే విధానాన్ని ప్రోత్సహించడాన్ని సరికాదని అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎంతో సాధించారని వారు ఇంకో సెంచరీ చేస్తే అది అప్పటివరకు వారు సాధించిన దానికంటే ఎక్కువై పోదని దానిని సాధరణ ఘనతగానే చూడాలని అన్నాడు. మన లక్ష్యం ఈ ఘనతల కంటే ఉత్తమంగా ఉండాలన్నారు. దేశం కోసం గెలవడం కంటే ఇవేవి గొప్పవి కాదని పేర్కొన్నాడు.

Read More

అమెరికా నుండి 116 మంది భారత అక్రమ వలసదారులతో కూడిన అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లో దిగింది. భారత అక్రమ వలసదారులను అమెరికా నుండి పంపించడం ఇది రెండోసారి. ఈ నెల 5న 104 మందితో వచ్చిన విమానం కూడా అమృత్ సర్ లోనే దిగింది. తాజాగా భారతీయులతో వచ్చిన ఏసీ-17 విమానం గత రాత్రి 90 నిమిషాలు ఆలస్యంగా 11.35 గంటలకు ల్యాండ్ అయింది. ఇమిగ్రేషన్, వెరిఫికేషన్ వంటివి అయిన తర్వాత వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇక, 157 మందితో కూడిన మరో విమానం నేడు రానుంది.

Read More

తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

Read More

ఈనెల 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని అన్ని శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుండి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. నేడు హైదరాబాద్ లో ఆయనను కలిసి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు కూడా కుటుంబసమేతంగా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు.

Read More

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేస్తున్న చిత్రం ”విశ్వంభర”.ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని దర్శకుడు ఫాంటసీ జానర్ లో తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీల‌క అప్‌డేట్ వైరల్ అవుతుంది.ఇందులో మ‌రో మెగా హీరో సాయి దుర్గా తేజ్ అతిథి పాత్ర‌లో కనిపించనున్నారని సమాచారం.సాయి తేజ్ పాత్రకు సంబంధిచిన షూట్ 3 రోజులు ఉంటుంద‌ని…ఈరోజు సాయి షూటింగ్ లో పాల్గొన్నార‌ని స‌మాచారం. ఇందులో ఒక పవర్ ఫుల్ సాంగ్ ని మెగాస్టార్ ఎంట్రీ సాంగ్ గా కీరవాణి కంపోజ్ చేశారని చిత్రబృందం ప్రకటించింది.తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి ఆదరణ వస్తుంది.ఇందులో మెగాస్టార్ పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇందులో త్రిష , ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. #Vishwambhara shooting underway with MEGASTAR'S introduction song being shot under the choreography…

Read More

గన్నవరం మాజీ ఎమ్మెల్యే,వైసిపి నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.కాగా దళితుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.తప్పు చేసిన వైసీపీ నాయకులు శిక్షలు తప్పించుకోలేరని నారా లోకేష్ హెచ్చరించారు.జగన్ హయాంలో అరాచక పాలనను అందరూ చూశారని,ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.

Read More