Author: admin

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా సమాచారాన్ని అందించే వేదికగా వికీపీడియాకు పేరుంది. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా దీనిని వినియోగించుకుంటారు. విరాళాలపై ఆధారపడి ఆ సంస్థ పని చేస్తుంటుంది. ఇక ఇటీవలే వికీపీడియాపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ఇప్పటికే చేసిన కామెంట్ల సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వికీపీడియాకు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి తాను సిద్ధమని అయితే, దాని పేరును మారిస్తే తాను బిలియన్ డాలర్లు ఇస్తానని అన్నారు. వినియోగదారుల నుండి నిధులు సేకరించాల్సిన అవసరం వికీమీడియా ఫౌండేషన్ కు ఏముందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పేరు మారిస్తే తాను డబ్బులు ఇస్తానన్నారు.

Read More

ఇజ్రాయెల్‌లో మారణహోమాన్ని సృష్టించి యుద్ధానికి కారణమైన హమాస్ సంచలన ప్రకటన చేసింది.ఈ మేరకు గాజా స్ట్రిప్ పై అధికారాన్ని వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.ఈజిప్ట్ ఒత్తిడితో గాజాలోని అధికారాన్ని పాలస్తీనాకు అప్పగించేందుకు హమాస్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ‘స్కై న్యూస్ అరేబియా’ ఓ కథనంలో పేర్కొంది.గాజాలో ప్రస్తుతం పోలీస్,ఆరోగ్యం,పౌరసేవలు అన్నీ హమాస్ నియంత్రణలోనే ఉన్నాయి.తాజాగా అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేందుకు అంగీకరించింది.హమాస్ నిర్ణయం వెనక డొనాల్డ్ ట్రంప్ విధానం కూడా ఒక కారణమని చెబుతున్నారు.పాలస్తీనా అథారిటీ అనేది ప్రపంచం గుర్తించిన ప్రభుత్వం.1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్‌ను ఇది పాలిస్తోంది.వెస్ట్‌బ్యాంక్,గాజా అనేవి రెండు పాలస్తీనా భూభాగాలు.2007 నుండి హమాస్ గాజాను పాలిస్తోంది.ఏడాదికిపైగా ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తుండగా,ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది.

Read More

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారిగా కేరళ క్యాడర్‌ కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జ్ఞానేష్ కుమార్‌ నియమితులయ్యారు.కాగా ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో మేరకు నిన్ కొత్త సీఈసీ ఎంపిక కోసం సమావేశం జరిగింది.అయితే ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌ షా,ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేష్ కుమార్‌ పేరును ఖరారు చేశారు.అయితే ఎలక్షన్‌ కమిషనర్‌గా వివేక్‌ జోషి పేరును ఖరారు చేశారు.ఈ క్రమంలో సీఈసీ ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదించారు.అనంతరం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.

Read More

చంద్రబాబు బ్రాండ్ తో ఏపీకి పెట్టుబడుదారుల క్యూ కడుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న పలువురు దేశ, విదేశ పెట్టుబడుదారులతో మంత్రి సమావేశమయ్యారు. 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు.‌ త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు ఉంటాయని అన్నారు. ఆ పరిశ్రమల స్థాపనతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. మరిన్ని సంస్థలతో చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు పేర్కొన్నారు. త్వరలో పెట్టుబడిదారుల సదస్సు ఉంటుందని మంత్రి తెలిపారు.భారత్ టెక్స్ అందించిన స్ఫూర్తితో త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా ఈ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

Read More

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా… కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నాయని మిగతా స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని పోలీసు స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జైళ్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలపై హైకోర్టులో విచారణ జరిగింది. అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పుడే హైకోర్టు ఆదేశించింది. అయితే పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ మేనేజ్మెంట్, సాంకేతిక కారణాల కారణంగా చాలా…

Read More

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన ఇన్ కం టాక్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టం రానుంది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. కాగా, ఇప్పుడు ఈ కొత్త అదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా అధ్యక్షతన 31 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఇక ఈ కమిటీ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిశికాంత్ దూబే, జగదీశ్ షెట్టర్, దీపేందర్ సింగ్ హూడా, నవీన్ జిందాల్, సుప్రియా సూలే తదితరులు ఉన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల కల్లా ఈ సెలెక్ట్ కమిటీ తన నివేదికను ఇవ్వనుంది.

Read More

ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాజాగా ఆయన పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష నిర్వహించారు. అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేస్తున్నామని, వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సీఎం అన్నారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని, గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా మార్పు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలని సీఎం సూచించారు. రేషన్ బియ్యం పంపిణీ, దీపం పథకం, ఆర్టీసీ సర్వీసులు, చెత్తనుండి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై సీఎం సమీక్షించారు.

Read More

రేపటి నుండి ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ2025 ప్రారంభం కానుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్ లు పాకిస్థాన్ వేదికగా జరుగనున్నాయి. భారత్ యూఏఈ లో జరగనుంది.ఇక ఈ మెగా ఈవెంట్ లో భారత స్టార్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇది కొంత లోటే అయినప్పటికీ భారత బౌలింగ్ లైనప్ మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ వంటి మేటైన బౌలర్లతో పటిష్టంగా కనబడుతోంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరు మంచి ఆల్ రౌండర్లుగా అదరగొడుతుండడం భారత్ కు మరో సానుకూలాంశం. ఇక బ్యాటింగ్ విభాగంలో సీనియర్లు, జూనియర్లతో మంచి కూర్పు ఉండే అవకాశాలున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో తన మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. అన్ని…

Read More

తిరుపతి వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, 58 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని అభివృద్ధికి కూడా ప్రధాన ఆదాయ వనరుల్ని పేర్కొన్నారు. టెంపుల్ టూరిజం దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మహాకుంభమేళాలో 55 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అన్నారు. అందరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తున్నారని వాటిని ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ వ్యవస్థ మన దేశానికి ఉన్న అతిపెద్ద బలమని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలకపాత్రని చెప్పారు. దేవుడికి సేవ చేయడం అన్నింటికంటే గొప్పదని అన్నారు. తిరుమల కోట్లాది మంది శ్రీవారిపై భక్తులకు…

Read More

సింగపూర్‌లోని భారత సంతతి నేత ప్రీతమ్‌ సింగ్‌ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.అయితే ఆయనపై పార్లమెంటులో అబద్ధాలు చెప్పారనే అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.ఈ అంశాలపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం అబద్ధాలు చెప్పడం నిజమని పేర్కొంది.ఈ మేరకు ఆయనకు 14వేల డాలర్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.అయితే పార్లమెంట్ సభ్యుడిగా మాత్రం కొనసాగవచ్చని తెలిపింది.

Read More