జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహించనున్నారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన విజయ బావుటా ఎగుర వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ ఇది కావడంతో భారీగా జనసేన శ్రేణులు పాల్గొని ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Author: admin
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో సంగీత నేపథ్యంలో ఓ చిత్రంలో తెరకెక్కుతుంది.అయితే ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రంతో బాలీవుడ్లో ఆమె ఎంట్రీ ఇస్తుంది.తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ అంటూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియోలో కార్తీక్ ఆర్యన్ సింగర్‌గా కనిపించాడు.ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు.గుల్షన్ కుమార్ & టి-సిరీస్ ప్రెజెంటేషన్, ఎ టి-సిరీస్ ఫిల్మ్స్ & అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.బాలీవుడ్ లో క్లాసిక్ చిత్రాలలో ఆషికి ఒకటి.ఈ ఫ్రాంచైజ్ లో మొదటి సినిమా 1990లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది.ఆ తరువాత 2013లో ఆషికి 2 విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లను…
ఏపీలో రేపటి నుండి కేంద్రబడ్జెట్‌పై సమావేశాలు జరగనున్నాయి.26వరకు బడ్జెట్‌పై చర్చలు నిర్వహించనున్నారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , రాజమండ్రి, కాకినాడలో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు వీటికి హాజరుకానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీలో 9 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో జరిగే చర్చకు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరు కానుండగా.. ఫిబ్రవరి 19న తిరుపతిలో జరిగే సమావేశానికి కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ నెల 21న విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ నెల 22న విశాఖలో జరిగే సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరవుతున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో త్రిష – ఆషిక రంగనాథ్ లు నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిరంజీవిపై ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తునట్లు చిత్రబృందం వెల్లడించింది.ఈ సినిమాలో మెగా వారసులు నటిస్తున్నారు అని సమాచారం.ఇందులో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారికా కొణిదెలా నటించనున్నారని వార్తలు విన్పిస్తున్నాయి.ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది.తాజాగా నన్ను ఏమి అడగొద్దు …నేను ఏమి చెప్పలేను…పట్టలేని సంతోషంలో ఉన్నాను అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది.
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు స్ట్రెయిట్ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు చెప్పినట్లు సమాచారం.తాజాగా లక్కీ భాస్కర్ విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా దాదాపు ఖరారైందని తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.అయితే ఈ చిత్రాన్నసితార ఎంటర్‌టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నాడు.అలానే సూర్య దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే సూర్యకి తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని కోరిక ఉంది…ఎప్పటి నుండో మంచి కథ దొరికితే చేస్తానని చాలా సినిమా ఈవెంట్‌లలో సూర్య చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.ఈ మేరకు గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందింది.అయితే అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయని సమాచారం.ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా… ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.ఈ నేపథ్యంలో జీబీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన బీజీఎస్ కేసులు, వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని…ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరారు.ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీబీఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Hon'ble CM Shri @ncbn Garu held…
వరుస నష్టాల నుండి దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో గట్టెక్కాయి. ఈరోజు కూడా ఉదయం నష్టాలలో కదలాడింది సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి 75,996గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 22,959 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.87 గా కొనసాగుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
ప్రస్తుతం భారత్‌లో చక్కెర ఉత్పత్తి భారీగా తగ్గింది.ఈ మేరకు మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.గత ఏడాది 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది.ఈ విషయాన్ని సెంట్రమ్ నివేదికలో పేర్కొంది. ఫిబ్రవరి 15, 2025 నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి 19.77 ఎంఎంటీ కాగా.. గత సీజన్ ఇదే సమయానికి కంటే 12శాతం తక్కువ.అయితే చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా చెరకును వినియోగించడం వలన..చక్కెర ఉత్పత్తికి కొరత ఏర్పడిందని తెలుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లో చక్కెర ధరలు టన్నుకు రూ.41వేలు ఉండా.. మహారాష్ట్రలో టన్నుకు రూ.37,500 కంటే ఎక్కువగా ఉంది.ప్రభుత్వం ఇటీవల ఒక ఎంఎంటీ చక్కెర కోటా ఎగుమతికి ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఏడాది దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా అత్యుత్తమ కంపెనీల జాబితాలో రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈక్రమంలో యాపిల్, నైక్ వంటి దిగ్గజం కంపెనీలను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024 సంవత్సరానికి గానూ ఫ్యూచర్ బ్రాండ్ విడుదల చేసిన అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ లో జాబితాలో మన భారతీయ కంపెనీ నిలవడం విశేషం. 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇప్పుడు ఏకంగా టాప్ 2 గా అవతరించింది. 2023లో అగ్రస్థానంలో ఉన్న యాపిల్ ఇప్పుడు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక. సౌత్ కొరియాకు చెందిన శామ్ సంగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 10 అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ లు: 1.శాంసంగ్ (సౌత్ కొరియా)2. రిలయన్స్(భారత్) 3.యాపిల్ (అమెరికా) 4. నైక్ (అమెరికా) 5. ఏఎస్ఎంఎల్ సెమీ కండక్టర్స్ (నెదర్లాండ్స్) 6. డెనహార్ కార్పొరేషన్ (అమెరికా) 7.ది వాల్ట్ డిస్నీ (అమెరికా) 8.మౌటాయ్ (చైనా) 9. టీఎంసీ సెమీ కండక్టర్స్ (తైవాన్) 10.ఐ.హెచ్.సీ (యూ.ఏ.ఈ).
ఈనెల 19వ తేదీ నుండి మార్చి 1 వరకు జరగనున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.శ్రీనివాసరావు ఆహ్వానపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
