గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న వంశీని వైసీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు.ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు రానున్నారు.విజయవాడ చేరుకున్న తర్వాత నేరుగా ఆయన జైలుకు వెళ్లి,ములాఖత్ లో వంశీని కలుస్తారు.మరోవైపు జైల్లో వంశీని ఉంచిన సెల్ వద్ద భద్రతను పెంచారు.అదనంగా గార్డులను నియమించారు.
Author: admin
క్రికెట్ అభిమానులును వినోదాన్ని అందించడమే కాకుండా ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీని వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు వెలుగులోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుండి ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. అతనితో పాటు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్ ను కూడా ప్రజా సదన్ లో కలుసుకుని అభినందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రోత్సాహించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ వచ్చే నెల 22 నుండి ప్రారంభం కానుంది.
ఏపీలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది.అయితే ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు “గులియన్ బారే సిండ్రోమ్” వ్యాధి సోకింది.గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో 2 రోజులపాటు చికిత్స పొంది నిన్న మృతి చెందింది.ఈనెల 3 తేదీన గుంటూరు జీజీహెచ్ కు కమలమ్మను తీసుకెళ్లగా ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.ఈ వ్యాధి ప్రమాదకరమైన అంటు వ్యాధి కాకపోయినప్పటికీ…కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తాయని వైద్యులు తెలిపారు.ఈ వ్యాధి ఎందుకు సోకుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదని పేర్కొన్నారు.
రాష్ట్రపతి భవన్ లో ప్రతి శనివారం నిర్వహించే ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్ ‘ కార్యక్రమం ఈ సారి కొత్త విధానంలో నిర్వహించారు. సైనిక విన్యాసాలు, సెరిమోనియల్ మిలిటరీ బ్రాస్ బ్యాండ్ ను కూడా ఈ వేడుకలో భాగం చేశారు. ఇక పై ఈకార్యక్రమం ఇదే విధంగా సరికొత్త విధానంలో జరగనుంది. విశాల మైదానంలో సంగీత వాయిద్యాల మధ్య వీనుల విందైన ప్రదర్శనలతో జరగనుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక తాజాగా జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ వీక్షించారు. ఫిబ్రవరి 22 నుండి ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో సందర్శకులను అనుమతించనున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్ ‘ కార్యక్రమాన్ని 2007 నుండి ఒక వేడుకగా జరుపుతున్నారు. వారం వారం రాష్ట్రపతి గార్డ్స్ గా కొత్త దళం బాధ్యతలు చేపడుతుంది. 2012 నుండి ప్రజలను కూడా ఈ కార్యక్రమం వీక్షించేందుకు అనుమతిస్తున్నారు. సందర్శకులు రాష్ట్రపతి భవన్…
తిరుపతిలోని పారిశుధ్య కార్మికులు నివసించే స్కావెంజర్స్ కాలనీ నగర మున్సిపల్ కమిషనర్ మౌర్య చూపిన చొరవతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. దాదాపు 300 కుటుంబాలు నివసించే ఆ ప్రాంతం ఒకప్పుడు మురికివాడ లాగా ఉండగా నగరం మున్సిపల్ కమిషనర్ మౌర్య చూపిన శ్రద్ధతో ఆవిడ తీసుకున్న చర్యలతో పరిశుభ్రంగా మారడంతో పాటు అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈమేరకు ఒక దినపత్రికలో వచ్చిన వార్తను తన పోస్ట్ కు జత చేశారు. స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం…. ఆ దిశగా సాగాలి మన ప్రయాణం. మార్పుకు కారణమైన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు అభినందనలంటూ సీఎం ట్వీట్ చేశారు. స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం…. ఆ దిశగా సాగాలి మన ప్రయాణం.మార్పుకు కారణమైన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు అభినందనలు.#SwarnaAndhraSwachhAndhra pic.twitter.com/xmOoJvtrAM— N Chandrababu Naidu (@ncbn) February 17,…
దేశ రాజధాని ఢిల్లీ మరియు ఆ పరిసర ప్రాంతాలలో నేడు ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం తమ నివాసాల నుండి బయటికి పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. భయాందోళనలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోడీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి లో నేటి నుండి మూడు రోజుల పాటు టెంపుల్ ఎక్స్ పో 2025 జరగనుంది. ఈనేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కాన్ఫరెన్స్ ను ప్రారంభించనున్నారు. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఆలయాలపై చర్చలు, వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు. దాదాపు 58 దేశాలలోని 1500కు పైగా భక్తి సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్ గా తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ లో జరగనుంది.
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ కు సర్వం సిద్ధమైంది. నేడు ప్రారంభం కానున్న మ్యాచ్ లలో నాగ్ పూర్ వేదికగా ముంబై-విదర్భ అహ్మదాబాద్ వేదికగా కేరళ గుజరాత్ తలపడనున్నాయి. కెప్టెన్ ఆజింక్య రహానె, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, షామ్స్ ములాని, తనుష్ కొటియాన్ లు ముంబయిలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. యశ్ రాథోడ్, సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్, కెప్టెన్ అక్షయ్ వడ్కర్ లతో విదర్భ కూడా పటిష్టంగానే కనబడుతోంది. ఇక గుజరాత్ కేరళ మధ్య కూడా ఆసక్తికర పోరు జరగనుంది. ఇరు జట్లు సెమీఫైనల్ గెలిచి ఫైనల్ చేరాలని గట్టిగా భావిస్తున్నాయి.
ప్రతి వేసవి సీజన్ లోనూ భారత క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుండి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైటైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. Mark your calendars, folks! 🥳🗓#TATAIPL 2025 kicks off on March 2️⃣2️⃣ with a clash between @KKRiders and @RCBTweets 🤜🤛When is your favourite team's first match? 🤔 pic.twitter.com/f2tf3YcSyY— IndianPremierLeague (@IPL) February 16, 2025
ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వారు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ను ఆయన సత్కరించారు. రాజేంద్ర ప్రసాద్ ను పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర పరిశ్రమలో రాజేంద్ర ప్రసాద్ పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి నాలుగు దశాబ్దాలకు పైగా మంచి స్నేహం ఉంది వాళ్లిద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించి అలరించిన సంగతి తెలిసిందే.
