Author: admin

ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని చెప్పామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.స్వచ్ఛాంధ్ర ,స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వేస్ట్ టు వెల్త్ సహా వివిధ మోడల్స్ ని చంద్రబాబు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్క రోజు మన ఊరు శుభ్రంగా ఉంచటానికి పని చేయాలని పరిసరాలు శుభ్రంగా ఉంటే, మంచి ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఎనర్జీతో సమర్ధవంతంగా మనం పని చేస్తామని పేర్కొన్నారు.జీవనప్రమాణాలు పెంచే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతినెల పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.…

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్,స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్”.ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం నిర్మించనున్నారు.ఇందులో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రంలో పలు పాత్రల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు.అయితే నటులు కావలెను అంటూ సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ చిత్రబృందం ప్రకటన విడుదల చేసింది.అన్ని ఏజ్ గ్రూప్ పురుషులు,మహిళలు…సినిమా,నాటకరంగ నేపథ్యం ఉన్నవారు కావాలి అని ఆ ప్రకటనలో తెలిపారు.తాజాగా స్పిరిట్ సినిమా కాస్టింగ్ కాల్ పై మంచు విష్ణు కూడా స్పందించారు.ఈ మేరకు మంచు విష్ణు ” యో… నేను కూడా ఈ సినిమాకు అప్లై చేశాను… ఏం జరుగుతుందో చూడాలి అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS— Vishnu Manchu (@iVishnuManchu) February 15,…

Read More

వైసిపి అధ్యక్షుడు ,మాజీ సీఎం జగన్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.కాగా హామీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని వీర్రాజు అన్నారు.ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని తెలిపారు.అయితే ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగన్ కు ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో తెలియదా? అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.తెలంగాణ,ఢిల్లీలో ప్రజల తీర్పులు గమనించాలని…ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, దిగజారుడు విమర్శలు సరికాదు అని సోము వీర్రాజు హితవు పలికారు.

Read More

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.ఈ మేరకు ఢిల్లీలోని 10-జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.ఇటీవల తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగిందని తెలుస్తుందితెలంగాణలో నిర్వహించిన కుల గణనకు సంబంధిచిన విషయం కూడా వారి మధ్య చర్చకు వచ్చిందని సమాచారం.కుల గణన,ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, తదనంతర పరిణామాలపై చర్చించారు.అయితే పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా రాహుల్ గాంధీతో చర్చించారని తెలుస్తుంది.కాగా త్వరలో సూర్యాపేట,గద్వాలలో బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.

Read More

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల గులియన్ బారీ సిండ్రోమ్(జీ.బి.ఎస్) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గులియన్ బారీ సిండ్రోమ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల బర్డ్ ఫ్లూ కూడా కలకాలం రేపిన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ ఇది మనుషులకు సోకిందనేది పుకార్లే అని స్పష్టం చేశారు. ఇక కూటమి నేతల మధ్య ఎటువంటి సమస్యా లేదని క్లారిటీ ఇచ్చారు.

Read More

అమెరికా అక్రమ వలసదారులు అమృత్ సర్ లో దిగడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఆర్పీ సింగ్ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చాడు.అమెరికా నుండి భారత్లోలో ప్రవేశించే అంతర్జాతీయ విమానాలకు…అమృత్సర్ విమానాశ్రయమే అతి సమీపంగా ఉంటుందని చురకలు అంటించారు. అయితే అక్రమ వలసదారులతో వస్తున్న విమానం అమృత్ సర్లో దిగుతున్నట్లు విమర్శించారు.ఈ సమస్యను రాజకీయం చేయవద్దు అని,అవగాహనారాహిత్యంతో కుట్రలు పన్నవద్దు అన్నారు.కాగా చాలామంది యువత అక్రమ రీతిలో అమెరికా వెళ్తున్నారు.వాళ్లను బోర్డర్ వద్ద పట్టేస్తున్నారు.పంజాబ్ తో పాటు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా డిపోర్ట్ అయినవారిలో ఉన్నారని అన్నారు. Amritsar is the closest international airport for flights entering India from the USA. That’s why the US plane carrying illegal immigrants is landing there. Stop politicizing…

Read More

ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అని షర్మిల సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులను పట్టించుకొనే దిక్కు లేదని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో వైయస్ సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన రైతులు.. నేడు గిట్టుబాటు లేక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు గారు మొదటి 5 ఏళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మాట తప్పితే.. జగన్ గారు ఏడాదికి రూ.3 వేల…

Read More

విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన నదస్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేసుల దర్యాప్తులో కీలకమైన డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా కేసుల పరిష్కారం, సమస్యలు సవాళ్లపై ప్రాసిక్యుటర్లకు అవగాహన కల్పించేలా ఈకార్యక్రమంలో వర్క్ షాప్ జరిగింది. నేరాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ, ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం కలిగేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. నేరాల నియంత్రణ, నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చేయడంలో అవసరమైన టెక్నాలజీ అందించేందుకు తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయంతోనే నేరస్థులకు సత్వర శిక్ష పడుతుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

Read More

ఢిల్లీ శీష్ మహల్పై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేశారని చెబుతున్నారు . దీని ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉంది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ను ఈ శీష్ మహాల్ అంశంలో బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం చెందగా…27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.

Read More

గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. తన పాటలు, రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించారని బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక వేత్త శ్రీ సేవాలాల్ మహరాజ్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Read More