గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.అటువంటి నేరస్తుడిని సమర్థిస్తూ..మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు.ఈ మేరకు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ…మహిళలు, దళితులు అంటే జగన్ కు చిన్నచూపు ఉందని… వారికంటే వంశీలాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా? అని నిలదీశారు.కాగా దళిత యువకుడిని బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వంశీ కుట్ర పన్నారని…ఇంతగా బరితెగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారని రామానాయుడు ప్రశ్నించారు.అయితే తప్పును ఖండించకపోగా…తప్పు చేస్తున్న వారిని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.
Author: admin
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు థమన్కి కాస్ట్ లగ్జరీ కారు గిప్ట్ గా ఇచ్చాడు.అయితే బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ 4 చిత్రాలకు సంగీతం థమనే అందించాడు.దీనితో థమన్ నందమూరి థమన్ గా మారిపోయాడంటూ అప్పట్లో ట్రెండ్ అయ్యింది. ఈ మేరకు బాలయ్య థమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.తమన్ కు 1.75 కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ పోర్చే కారును బహుమతిగా ఇచ్చాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు,ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరిద్దరి కాంబోలో అఖండ 2 రాబోతుంది.ఈ క్రమంలో బాలయ్య తమన్ ను నందమూరి తమన్ అంటూ సరదాగా సంబోధించారు.
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈనెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత సీఈసీ ఎంపికకు సంబంధించి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈనెల 17న సమావేశం కానుంది. ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై ఒకరి పేరును సిఫార్సు చేయనుంది. దాని ఆధారంగా రాష్ట్రపతి తదుపరి సీఈసీని నియమిస్తారు. సీఈసీ పదవీ విరమణ సమయంలో సంప్రదాయం ప్రకారం ఎలక్షన్ కమీషన్ లో అత్యంత సీనియర్ కమీషనర్ కు సీఈసీగా పదోన్నతి కల్పిస్తారు.
అమెరికా నుండి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలు పంజాబ్ లో దిగడంపై ఆ రాష్ట్రంలో సీఎం భగవంత్ మాన్ కేంద్రంపై విమర్శలు చేసున్నారు.అయితే ఇదంతా ఉద్దేశపూర్వకంగా పంజాబ్ ను అపఖ్యాతిపాలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? అని మాన్ ప్రశ్నించారు.ప్రధాని మోదీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికా అధికారులు మనవారికి సంకెళ్లు వేసి ఉంటారని,ఇది మోదీకి ట్రంప్ ఇచ్చిన బహుమతా? అని నిలదీశారు.ఈ విమానాలు దిగడానికి అమృత్ సర్ ఎంపిక చేయడంలో ఏ విధానాన్ని అనుసరించారో విదేశీ వ్యవహారాల శాఖ చెప్పాలని డిమాండ్ చేశారు.
సమాజ సేవకు ఎంత గానో కృషి చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు: సమాజసేవలో 28 ఏళ్ళు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు అభినందనలు. ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి రంగాలలో పేదలకు, ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ… మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మంత్రి నారా లోకేష్: ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి ఆలోచన, భువనేశ్వరిగారి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్ట్. 1997లో ఒక్క అడుగుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రయాణం ప్రారంభమైంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి తెలియని వారు ఉండరు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి,…
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని విస్తరించనున్నామని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని వెల్లడించారు.అయితే తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలోని పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలకృష్ణ తెలిపారు.కాగా ఈరోజు హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను ప్రారంభించారు.క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని బాలకృష్ణ అన్నారు.
డ్రోన్‌లు యుద్ధరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన డ్రోన్స్ తో కనిపించారు.యుద్ధభూమిలో అపూర్వమైన మార్గాల్లో కమ్యూనికేట్ చేస్తున్నాయని డ్రోన్‌లు కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు అవి బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన బాటమ్-అప్ ఆవిష్కరణలని పేర్కొన్నారు. భారతదేశానికి బలమైన ఉత్పత్తి స్థావరం అవసరం ఖాళీ మాటలు కాదని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు, ప్రధాని మోడీ దీనిని గ్రహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. భారతదేశానికి అపారమైన ప్రతిభ, స్థాయి ఉందని పేర్కొన్నారు. మన యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి మరియు భారతదేశాన్ని భవిష్యత్తులోకి నడిపించడానికి మనకు స్పష్టమైన దృష్టి ఉండాలి మరియు నిజమైన పారిశ్రామిక నైపుణ్యాన్ని నిర్మించాలని రాహుల్ గాంధీ అన్నారు. Drones have revolutionised warfare, combining batteries, motors and optics to manoeuver and communicate on…
ఇకపై అమెరికాలో మహిళలు – పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని,మరో జెండర్ ను గుర్తించమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.తాజాగా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.అమెరికా ఆర్మీలోకి ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేయమని స్పష్టం చేశారు.కాగా ఆర్మీలో ట్రాన్స్ జెండర్ల ఎంట్రీపై నిషేధం విధిస్తూ…ఉత్తర్వులు విడుదల చేశారు.ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.అయితే ఎక్స్ వేదికగా యూఎస్ ఆర్మీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడికి అనుమతించమని స్పష్టం చేసింది.లింగ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్ లో ఉన్న దరఖాస్తులను అన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 0-3తో జపాన్ చేతిలో ఓటమితో నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్ ధ్రువ్ కపిల- తనీషా 13-21, 21-17, 13-21తో హిరొకి- నత్సు చేతిలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ 12-21, 19-21తో తొమొక మియజాకి ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ లో హెచ్.ఎస్.ప్రణయ్ 14-21, 21-15, 12-21తో కెంటా నిషిమొటో చేతిలో ఓటమి చెందాడు. వరుసగా మూడింట్ లో భారత్ ఓడిపోవడంతో తర్వాతి రెండు మ్యాచ్ లతో పనిలేకుండానే జపాన్ సెమీస్ చేరుకుంది.
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మార్చి 19న భూమి మీదకు తిరిగి రానున్నారు.అయితే గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ-9 మిషన్‌లో భాగంగా సునీత విల్లియమ్స్ తో పాటుగా నలుగురు వ్యోమగాములు ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు.కాగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్,అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు.ఇక అప్పటి నుండి సునీత, విల్‌మోర్‌లు స్పేస్ స్టేషన్‌లోనే ఉండిపోయారు.తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు అనంతరం…వారిని వెంటనే భూమీదకు రప్పించే ప్రయత్నం చేయాలని ఎలాన్ మస్క్ సహాయం కోరారు. దాడుపుగా 8 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఉన్నారు.నాసా తాజా మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఐఎస్‌ఎస్ (ISS)కు పంపాలని అనుకుంటుంది.ఈ కొత్త బృందం అక్కడికి చేరుకోగానే…క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్,విల్‌మోర్‌లు విడుదల…
