కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఆమె కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టం రానుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది. ఇక 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఖర్చులు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడు బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
Author: admin
వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు అగ్ర కధానాయకుడు ప్రభాస్. ఆయన ప్రధాన పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రంలో తాను నటిస్తున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్, దర్శకుడు హాను తో దిగిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. భారతీయ సినిమా బాహుబలితో నా 544వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నా ప్రియమైన స్నేహితుడు సుదీప్ ఛటర్జీ ఈ మూవీకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఈ చిత్రం చాలా మంచి కథతో తెరకెక్కుతోందని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
నితిన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’.దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు.ఈ చిత్రం నుండి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు.అయితే చిత్రబృందం సినిమాలో రెండో సింగిల్ సాంగ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.అయితే గూసి బేబీ నువ్వు గుచ్చి గుచ్చి చూడద్దే అంటూ సాగే సెకండ్ సింగిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈ సినిమాను మార్చి 28 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్దమైంది. https://youtu.be/ZriIeW55aqw?si=3tjDygRPfZSfJlJ8
దేశవ్యాప్తంగా మోడీ వేవ్, చరిష్మా ఎంత మాత్రం తగ్గలేదని మరోసారి స్పష్టమవుతోంది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ సొంతంగా 41 శాతం ఓట్లతో 281 సీట్లు సాధిస్తుందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్ ‘ పోల్ తెలిపింది. కాంగ్రెస్ కు సొంతంగా 78 సీట్లు మాత్రమే వస్తాయని ఇతరులు 184 సీట్లు సాధిస్తారని పేర్కొంది. ఎన్డీయే 343 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇండియా కూటమి 188 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ మినహా మహారాష్ట్ర, హార్యానా తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తిరుగులేదని మరోసారి స్పష్టంగా తెలుస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణా రంగంలో దూసుకెళ్తోందని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ఏరో ఇండియా వాణిజ్య కార్యకలాపాల ముగింపు సమావేశంలో మాట్లాడారు. భారత డిఫెన్స్ సెక్టార్ లో సాధిస్తున్న అభివృద్ధిని ప్రదర్శించే వేదికగా ఏరో ఇండియా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన పట్ల ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. పది సంవత్సరాల క్రితం వరకు కూడా భారత రక్షణ రంగ అవసరాల కోసం 70 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుండగా నేడు ఆ స్థాయిలో దేశంలోనే తయారవుతున్నాయి అన్నారు. చిన్న తరహా వెపన్స్ నుండి అడ్వాన్స్డ్ మిస్సైల్స్ వరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి విదేశాలకు కూడా పంపుతున్నట్లు వివరించారు. ఇక షో చివరి రోజున ఇథియోపియా, శ్రీలంక, జింబాబ్వే, యెమెన్ తదితర దేశాల రక్షణ మంత్రులు, సైనిక అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు…
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. JEE (Mains) – 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి లోకేష్ అభినందించారు. మనోజ్ఞ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ అవసరం ఉన్న ఒక్క మెసేజ్ పెడితే చాలని అన్నగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసానిచ్చారు. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో తనకు తెలుసన్న మంత్రి లోకేష్ ఆమె తల్లిని కూడా సత్కరించారు.
ఈనెల 19 నుండి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ మొత్తం నలుగురు అంబాసిడర్ లను ప్రకటించింది. దీనికి భారత్ నుండి మాజీ బ్యాటర్ శిఖర్ ధావన్ ఎంపిక చేసింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫ్ రాజ్ ఖాన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలను ఎంపిక చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇందులో అంబాసిడర్‌గా ఆస్వాదించే అవకాశం లభించడం గౌరవప్రదమైన అంశం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన క్షణాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి. ఇక ఈ టోర్నీలో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ప్రతి మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడడం మనం చూస్తామని ధావన్ ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టలో ధావన్ కీలకపాత్ర పోషించాడు. 2013లో ధోనీ నాయకత్వంలో భారత్…
నేడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి నెలలో చివరి ఆదివారం ఆయన “మన్ కీ బాత్” అనే రేడియో కార్యక్రమం ద్వారా ప్రజలతో తన భావాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రేడియో అనేక మంది వ్యక్తులకు శాశ్వతమైన జీవన రేఖగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు విషయాలు తెలియజేయడం, ప్రజలను అనుసంధానం చేయడం వార్తలు, సంస్కృతి, సంగీతం, కథ చెప్పడం ఇలా రేడియో అనేది సృజనాత్మకతను వ్యక్తం చేయడానికి శక్తివంతమైన మాధ్యమమని వివరించారు. రేడియో ప్రపంచంతో అనుబంధం ఉన్న వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23న జరగనున్న #MannKiBaat కోసం మీ ఆలోచనలు మరియు ఇన్‌పుట్‌లను పంచుకోవాలని కోరారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. తాజాగా జరిగిన గ్రూప్ -డి లో 5-0తో మకావు పై ఘనవిజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ లో సతీష్ కుమార్ – ఆద్య వరియత్ ద్వయం 21-10, 21-9తో చాంగ్ లియోంగ్-వెంగ్ జీ జోడీ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-16, 21-12తో ప్యాంగ్ పాంగ్ పై గెలిచాడు. మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ 21-15, 21-9తో హావో చాన్ పై నెగ్గింది. పురుషుల డబుల్స్ లో అర్జున్ -చిరాగ్ 21-15, 21-9తో గెలిచారు. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ 21-10, 21-5తో విజయం సాధించారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.పటమట పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్ఎస్ ລ້ 140(1), 308, 351(3), 325 3(5) వంశీపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి.
