భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటయింది. శుభ్ మాన్ గిల్ 112 (102; 14×4, 3×6) సెంచరీతో చెలరేగాడు.శ్రేయాస్ అయ్యర్ 78 (64; 8×4, 2×6), విరాట్ కోహ్లీ 52 (55; 7×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. కే.ఎల్. రాహుల్ 40 (29;3×4,1×6) పర్వాలేదనిపించాడు. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు, సాకిబ్ మహ్మద్, జో రూట్, గస్ అట్కిన్ సన్ తలో వికెట్…
Author: admin
డోగ్రీ భాషలో ఇక్ హోర్ అశ్వథామ అనే చిన్న కథకి గాను రచయిత దివంగత చమన్ అరోరాకు సాహిత్య అకాడమీ అవార్డు 2024ను ప్రకటించారు. ఈ కథ మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర గురించి చెబుతుంది. ఇక చమన్ అరోరా 1945లో జమ్మూలో జన్మించారు. జమ్మూ & కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయంలో పట్టభద్రుడయ్యాడు. 1973 నుండి డోగ్రీ భాషలో చిన్న కథలు రాయడం ప్రారంభించారు. వివిధ చిన్న కథలు, నాటకాలు, అనువాదాలు ప్రచురించారు మరియు ఒక టెలి-ఫిల్మ్ ను తీశారు. 2008 నుండి 2013 వరకు సాహిత్య అకాడమీ డోగ్రీ సలహా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మొత్తం 24 భాషల సాహిత్యవేత్తలకు ప్రతి ఏటా సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది.భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ ద్వారా సేవలను అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలనే భక్తులు 9552300009 నంబర్ కు వాట్సప్ సందేశం పంపి సేవలను పొందవచ్చని తెలిపింది. వాట్సప్ దేవాదాయ శాఖ ఆప్షన్ ఎంచుకున్న అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అందించే దర్శనం టికెట్లు, డొనేషన్, వివిధ సేవలను నగదు చెల్లించి పొందవచ్చని స్పష్టం చేసింది.మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి ప్రారంభమయైన సంగతి తెలిసిందే. మొదటి వారం రోజుల్లోనే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల వంటి ముఖ్యమైన ఆలయాలలో దర్శనాలు, పూజలు, విరాళాలు, వసతి, ప్రయాణం వంటి సౌకర్యాలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మెడికల్ కాస్ట్ తగ్గాలని మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందని వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో, సమాజ సేవ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. అనవసరంగా హాస్పిటల్ లో ఉంచి రూం బిల్లులు వసూలు చేసే విధానం మారాలన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా, అవసరమైతేనే హాస్పిటల్ కు పేషంట్ ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా అలోచించి, వైద్య ఖర్చులు తగ్గించాలని అన్నారు. ప్రతీ కుటుంబంలో ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని 1995లో చెప్పిన విషయం ఈసందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. దాని ఫలితాలు ఇవాళ మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు.1995లో ఐటీ గురించి నేడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. భవిష్యత్‍లో…
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.తాజాగా ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ను అందించారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. https://youtu.be/McPGQ-Nb9Uk?si=QSS5DGn0XWtqq8-u
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఒకానొక దశలో భారీ నష్టాలకి జారిన సూచీలు తిరిగి పుంజుకుని స్వల్ప నష్టాలకు పరిమితమవడంతో మదుపర్లు ఊపిరిపీల్చుకున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు నష్టపోయి 76,171గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 23,045 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.90 గా కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రా టెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
విజయవాడలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ మేరకు సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది.వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మంటలు ధాటిగా పొగ దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఎవరో ఒక వ్యక్తి ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టులకు పాకిస్థాన్ లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు జో రోగన్ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న ఆయన ఈ సంచనల వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే పాక్ లో ఫేస్‌బుక్ పై నమోదైన దావా గురించి వివరించారు.పాడ్ కాస్ట్ లో జుకర్ బర్గ్ మాట్లాడుతూ…ఇతర దేశాల్లో మనం అంగీకరించని చట్టాలు చాలా ఉన్నాయి.ఎవరో ఫేస్‌బుక్ లో దేవుడిని అవమానిస్తూ ఉన్న ఫొటోలను పోస్టు చేయడంతో పాక్ లో నాకు మరణశిక్ష విధించాలని మరెవరో దావా వేశారు. అయితే నాకు ఆ దేశానికి వెళ్లాలని లేదు.అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం నాకు లేదు.అనేక దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయి.దీనితో యాప్ లోని చాలా కంటెంట్‌ను తొలగించాల్సి వస్తోంది.ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా మమ్మల్ని జైల్లో వేసేంత శక్తిమంతంగా చట్టాలు ఉన్నాయి.విదేశాలలో…
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్ శతకంతో అదరగొట్టాడు. ఈక్రమంలో తన ఖాతాలో సరికొత్త రికార్డు కూడా చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్ లో గిల్ ఈ అరుదైన మైలురాయిని సాధించడం విశేషం.ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (1) వికెట్ కోల్పోయిన ఆ తర్వాత పుంజుకుంది. కోహ్లీ హాఫ్ సెంచరీతో (52) ఆకట్టుకున్నాడు. అలాగే గిల్ ఈ సిరీస్ లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న సమావేశమయ్యారు.ఈ మేరకు ఏపీలో పెట్టుబడులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.అయితే విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు గురించి చర్చించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని రాజు వేగేశ్న ను మంత్రి నారా లోకేశ్ కోరారు.ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను ఆయనకు నారా లోకేష్ వివరించారు.అయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,ఇతర ఐటీ విధానాల గురించి రాజు వేగేశ్నకు మంత్రి లోకేష్ వివరించారు.ఈ మేరకు రాజు వేగేశ్న ఏపీలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తుంది.
