Author: admin

ఏపీలో ఎక్క‌డా కూడా గుంతలున్న ర‌హ‌దార్లు క‌నిపించకూడ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు అధికారుల‌ను ఆదేశించారు.అయితే గ‌తంలో ర‌హ‌దార్లపైన ప్ర‌యాణించాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉండేద‌ని,దాన్ని పోగొట్టి ఇప్పుడు మ‌న ప్ర‌భుత్వం ర‌హ‌దార్లను బాగు చేశామ‌ని,ఇప్పుడు రోడ్లు కాస్త అందంగా క‌నిపిస్తున్నాయ‌ని, ఇది సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. అయితే ఇక్క‌డితోనే మ‌నం ఆగిపోకూడ‌దని సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా…రోడ్లు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కాంతిలాల్ దండే ఇచ్చిన ప్ర‌జంటేష‌న్ పైన మాట్లాడారు.జాతీయ ర‌హ‌దార్ల‌పైన కూడా త‌నకు ఎక్క‌డా గుంత‌లు క‌నిపించ‌కూడ‌ద‌న్నారు.కాగా ర‌హ‌దార్లకు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డం,రోడ్లు నిర్మించ‌డం ఒక్క‌టే కాద‌ని,వాటి నిర్వ‌హ‌ణ కూడా నిరంత‌రం స‌మ‌ర్థ‌వంతంగా పని చేయని అన్నారు.అయితే మ‌నం చేప‌ట్టిన రోడ్లు నిర్మాణ ప‌నుల‌న్నీ కూడా 4 ఏళ్ళలో పూర్తి కావాలన్నారు.ఈ మేరకు అర్బ‌న్ ఏరియాలో కూడా ఎక్క‌డా గుంత‌లున్న ర‌హ‌దార్లు త‌న‌కు క‌నిపించ‌కూడ‌ద‌ని అన్నారు.

Read More

ఉచిత పధకాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. ఉచిత పధకాలు మంచిది కాదని దురదృష్టవశాత్తు వీటి వలన ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని పేర్కొంది. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే కానీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలని ఉచితాల ద్వారా అలా జరుగుతోందా అని ప్రశ్నించింది. ఎన్నికల్లో ఉచిత పధకాలు ప్రకటించే పద్దతి సరైంది కాదని ధర్మాసనం పేర్కొంది.

Read More

ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.అయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.అయితే ప్రధాని మోదీ విమానమే లక్ష్యంగా టెర్రరిస్టులు దాడి చేయవచ్చనే సమాచారం తమకు అందిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు.దీనితో వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని వెల్లడించారు.అయితే బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై ముమ్మర దర్యాప్తు చేశామని తెలిపారు.ఈ మేరకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. అయితే అతడి మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోందన్నారు.దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Read More

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వ్యాపార పెరుగుదలకు అపార అవకాశాలు ఉంటాయని అన్నారు. 14వ ఇండియా ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశం రెండు దేశాలకు చెందిన అత్యుత్తమ వ్యాపారవేత్తల సంగమంమని పేర్కొన్నారు. మీరంతా ఇన్నోవేషన్, కోఆపరేషన్, ఇంటిగ్రేషన్ మంత్రంతో పని చేయడాన్ని గమనిస్తున్నా. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతానికి చేస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తో ఈ సమ్మిట్ కు అధ్యక్షత వహించడం సంతోషంతో ఉందని మోడీ అన్నారు. గత రెండేళ్లలో వీరిద్దరి మధ్య ఇది ఆరో సమావేశమని తెలిపారు. గతేడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు మేమిద్దరం ఏఐ యాక్షన్ సమ్మిట్ కు అధ్యక్షత వహించాం. గత దశాబ్దం నుండి భారత్ లో జరిగిన…

Read More

రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శారీ’.ఈ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో – హీరోయిన్ గా నటిస్తున్నారు.అయితే వాస్తవ సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ చిత్రం రూపొందుతోంది.ఈ మేరకు ఈ చిత్రం ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.కాగా ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్, LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. https://youtu.be/5e-BZU7mEGk?si=vQzZz6nUs1Kw9bbP

Read More

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.అయితే RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్ర చిత్రీకరణ జరుపుకుంటుంది.కాగా ఈ సినిమాను దర్శకుడు క్రీడ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.ఇందులో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి జోరుగా వినిపిస్తోంది.ఈ చిత్రానికి ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కథ క్రికెట్ ఆట చుట్టూ తిరుగుతుందని..అందుకే ఈ టైటిల్ ను ఖరారు చేయాలనీ చిత్రబృందం భావిస్తుందని చెబుతున్నారు.అయితే ఇందులో కుస్తీకి సంబంధించిన నేపథ్యం కూడా ఉండనుందని తెలుస్తోంది.కాగా ఈ చిత్రానిక పవర్ క్రికెట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా..అనేది చూడాలి.ఇందులో రామ్ చరన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read More

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వన్డే ఫార్మాట్ విశ్వ విజేత ఆస్ట్రేలియా తన స్క్వాడ్ ను ప్రకటించింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ టోర్నీ బరిలోకి దిగనుంది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, పేసర్ హేజల్ వుడ్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాలతో తప్పుకున్నారు. మొదట ప్లేస్ దక్కించుకున్న మార్కస్ స్టోయినీస్ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్క్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఇక వీరంతా లేకుండా ఆస్ట్రేలియా తమ జుట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా టీమ్: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెస్గుర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సన్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. ట్రావెల్ రిజర్వ్: కూపర్ కొన్నోల్లీ

Read More

కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం ‘దిల్‌రూబా’.ఈ చిత్రానికి దర్శకుడు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.తాజాగా పలు కారణాల వలన ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడినట్లు సమాచారం.అయితే ఈ చిత్రాన్ని మార్చి 14న విడుదల చేసేందుకు చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో రుక్సర్ ఢిల్లోన్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

Read More

అయోధ్య రామ‌మందిర ప్ర‌ధాన అర్చ‌కుడు ఆచార్య స‌త్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు. తన 20 ఏళ్ల వ‌య‌సులోనే సత్యేంద్ర దాస్ ఆధ్యాత్మిక బాటలోకి వచ్చారు. నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. 85 ఏళ్ల సత్యేంద్ర దాస్ ఈ నెల 3న బ్రెయిన్ స్ట్రోక్ కు గుర‌య్యారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌నను ల‌క్నోలోని హాస్పిటల్ కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ నేడు ఆయన కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు.అయోధ్య రామా‌ల‌య ప్రారంభోత్స‌వం, బాల‌రాముడి విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ఠ స‌మ‌యంలో ఆయన కీల‌క పాత్ర పోషించారు. రామాల‌య ప్ర‌ధాన పూజారిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 1992లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌కు ముందు నుండే ఆయ‌న రామ‌మందిర అర్చ‌కుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత‌ పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టిన విష‌యం విదితమే. ఈ ఆధ్యాత్మిక యాత్ర‌లో భాగంగా ఆయ‌న‌ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఆయన కేరళలోని కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆయన కుమారుడు అకీరా నందిన్ కూడా ఉన్నారు. ఇక మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు.

Read More