అన్నమయ్య జిల్లాలో ఈరోజు జరిగిన యాసిడ్ దాడిపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని సీఎం ఆదేశించారు.కాగా బాధితురాలికి మెరుగైన వైద్య అందించేందుకు అవసరమైతే బెంగళూరుకి గానీ,విజయవాడకు గాని పంపాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.ఈ మేరకు బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా సీఎం చంద్రబాబు ఇచ్చారు.
Author: admin
ఈనెల 19 నుండి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి విజేతకు అందించే నగదును ఐసీసీ తాజాగా ప్రకటించింది. విజేతకు రూ. 20.80కోట్ల నగదు బహుమతి దక్కనుంది. అలాగే రన్నరప్ కు రూ. 10.40 కోట్లు, సెమీ ఫైనల్స్ కి చేరిన జట్లకు చెరో రూ. 5.20 కోట్లు అందించనున్నట్లు ఐసీసీ వివరించింది. ఇక నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచిన జట్లలకు తలో రూ. 3 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్లకు చెరో రూ. 1.20 కోట్లు ఇవ్వనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్ కు సుమారు రూ. 29 లక్షలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రెండు గ్రూపులుగా ఏర్పడి 8 జట్లు ఈ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా , దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్-3 అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని నాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు.ఇందులో శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.పవర్‌ఫుల్ యాక్షన్ తో బ్రూటల్ థ్రిల్లర్ గా దర్శకుడు రూపొందిస్తున్నాడు.ఇప్పటికే హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది.హిట్-3 నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు కూడా మంచి ఆదరణ లభించింది.ఇందులో అర్జున్ సర్కార్ గా నాని చాలా బలమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.ఇందులో నానితో పాటూ మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారని సమాచారం.వారు ఇద్దరు ఎవరంటే ఇప్పటికే హిట్ సిరీస్ లో నటించిన అడివి శేష్ ఒకరు కాగా, మరొకరు విశ్వక్ సేన్.ఈ ఇద్దరు…
వైసిపి నేత ,మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్ ) టీడీపీలో చేరారు.ఈ మేరకు అయన టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.అయితే గత ఏడాది వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.అనంతరం ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేయగా.. తాజాగా టీడీపీ అధిష్టానం నుండి లైన్ క్లియర్ కావడంతో ఆళ్ల నాని తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
ముంబై-2008 పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు సిద్ధమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీతో సమవహేశంలో డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.కాగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను భారత్ కు అప్పగిస్తామని చెప్పారు.ముంబై పేలుళ్ల కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని,ఈ అంశంలో భారత్ కు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.అయితే నేరస్థుల అప్పగింతలో భాగంగా రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఆమోదం తెలిపారు.ఈ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ…ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.2,378 కోట్ల గృహ నిర్మాణ నిధులు మురిగిపోయాయని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అన్నారు. PMAY Gramin క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్దిదారులకు తొలగించిందని ఆక్షేపించారు. గృహ నిర్మాణ నిధులు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. గత తప్పిదాలను సరిదిద్దుతూ అర్హులు అందరికీ గృహాల మంజూరీకై చర్యలు చేపట్టామని తెలిపారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీల భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ట్యాక్స్ లు, వలసలు, ఇరుదేశాల వ్యూహం భాగస్వామ్యాలపై చర్చించినట్లు సమాచారం. చాలా కాలం నుండి మోడీ తనకు మంచి మిత్రుడని రానున్న రోజుల్లో కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా తమకు వనరులు ఉన్నాయని భారత్-అమెరికా మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయని అన్నారు. ఇరు దేశాలు కలిసి ఉండడం ముఖ్యమని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో పలువురు ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి భారత్ పయనమయ్యారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ డిస్నీప్లస్ హాట్ స్టార్, జియో సినిమా విలీనమయ్యాయి.ఇకపై ఈ యాప్ ‘జియోహాట్ స్టార్’ అనే పేరుతో అందుబాటులో ఉండనుంది.కాగా ఈ రెండు యాప్స్ విలీనం అవ్వడంతో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది.ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే యాప్ లో చూడవచ్చు.జియో హాట్‌స్టార్‌లో 100 లైవ్ టీవీ ఛానెల్స్,30 గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది.ఐపీఎల్ సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్ ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది.డిస్నీప్లస్ హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ ల హక్కులను కలిగి ఉంది.దీనితో అన్ని క్రికెట్ మ్యాచ్ లను జియో హాట్‌స్టార్ లో వీక్షించవచ్చు. జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ వివరాలు:- మొబైల్ రూ. 149/ 3 నెలలు రూ. 499/ ఏడాది సూపర్ రూ. 299/ 3 నెలలు రూ. 899/ ఏడాది ప్రీమియం…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ వ్యాపారవేత్త టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇరువురు వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. ఈమేరకు వీరి భేటీ పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు మోడీ ‘ఎక్స్’ లో తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు వెల్లడించారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మస్క్ ముగ్గురు పిల్లలను కూడా ప్రధాని మోడీ కలిశారు. అలాగే యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌జ్, వివేక్ రామస్వామితోనూ ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు.
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య గారి జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని పేర్కొన్నారు.నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన దేశసేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
