నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తి దామోదరం సంజీవయ్య గారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కారని పేర్కొన్నారు. తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారని ఆయన జయంతి వేడుకలను కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.దామోదరం సంజీవయ్య గారి ఆశయ సాధనకు కృషి చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Author: admin
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరింది. తాజాగా జరిగిన గ్రూప్ -డి లో ఆఖరి పోరులో 2-3తో కొరియా చేతిలో ఓడినా భారత్ ముందడుగేసింది. ఈ గ్రూపులో మొదటి స్థానంలో నిలిచిన కొరియాతో పాటు రెండో స్థానంలో నిలిచిన భారత్ కూడా క్వార్టర్స్ లో చోటు దక్కింది. మిక్స్డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీష్ క్యాస్ట్రో, మహిళల సింగిల్స్ మాళవిక బాన్సోద్ ఓటమి చెందారు. పురుషుల సింగిల్స్ లో సతీష్ కుమార్ కరుణాకరన్ విజయం సాధించాడు. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసా జాలీ గెలిచారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్-అర్జున్ జోడీ ఉండడంతో కొరియా 3-2తో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారికంగా 2025 ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసందర్భంగా ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులందరూ మంచి విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఔత్సాహిక విద్యార్థులందరికీ, ఆత్మవిశ్వాసంతో మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగాల్సిన మీ తరుణం ఇది! కాబట్టి దృష్టి కేంద్రీకరించండి, పరీక్షల కోసం బాగా ప్రిపేర్ కావాలని మీరందరూ గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను! అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంతో ముగించింది. 7 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్, 12 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. తెలంగాణ 3 గోల్డ్, 3 సిల్వర్, 12 బ్రాంజ్ మెడల్స్ సాధించి 26వ స్థానంలో నిలిచింది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 68 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్, 27 బ్రాంజ్ మెడల్స్ తో 121 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 54 గోల్డ్ మెడల్స్, 71 సిల్వర్, 73 బ్రాంజ్ మెడల్స్ తో మొత్తంగా 198 మెడల్స్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. హార్యానా 153 మెడల్స్ సాధించింది. అందులో 48 గోల్డ్, 47 సిల్వర్, 58 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. దీంతో మూడో స్థానంలో నిలిచింది.
బ్రెజిల్ లో ఇటీవల జరిగిన ఒక వేలంలో ఒంగోలు జాతి గిత్త రికార్డు స్థాయిలో రూ.41 కోట్లు ధర పలికి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు హార్షం వ్యక్తం చేశారు. ఒంగోలు జాతి గిత్త ప్రపంచ వేదికపై తన సత్తాను చాటిందని కొనియాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వాన్ని ప్రపంచానికి చూపిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 41 కోట్లు సంపాదించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒంగోలు పశువులు దాని ఉన్నతమైన జన్యువులు, బలం మరియు ఓర్పుకు ప్రసిద్ధి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించడానికి మరియు పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తోందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో దాదాపు రూ. 40 కోట్లు. ఈ రేంజ్ లో ధరతోఈ గిత్త గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో…
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కొత్త ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకోకపోవడం.. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఆవిధంగా ఉంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు.
రాష్ట్ర పర్యాటక శాఖ సంబంధిత అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ…హ్యాపీ అని పర్యాటకులు భావించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది టూరిజం శాఖలో 20 శాతం వృద్ధిరేటు సాధించాలని అన్నారు. టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి. టూరిజం, కల్చరల్ రంగాల్లో ఈవెంట్ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్తగా నిర్మాణం చేపట్టబోయే నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సచివాలయంలో రాష్ట్ర పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పౌల్ట్రీల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. పటిష్టమైన చర్యలతో పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా ఉడికించిన గ్రుడ్లను, మాంసాన్ని తీసుకోవచ్చని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు బోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యురిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారు. కేంద్ర నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా రేపు రాష్ట్రానికి రానున్నారని వివరించారు. బాగా ఉడికించిన గ్రుడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా ప్రజలు తినవచ్చని తెలిపారు. తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విఅవాస్తవాలతో అలజడి సృష్టించవద్దని అన్నారు. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరో చెప్పిన మాటలను, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. వైరస్ సోకిన కోళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నిటినీ తీసుకుంది. ప్రజలెవరూ ఈ విషయంలో భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. ఉంగుటూరు మం. బాదంపూడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చిపెట్టామని కోళ్ల ఫారాల నుండి కిలోమీటర్ పరిధిని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించి రెడ్ అలర్ట్ జారీ చేశామని జిల్లా అధికారులు తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను స్వల్ప నష్టాలతో ముగించాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దూసుకెళ్లిన సూచీలు అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో వరుసగా ఏడో రోజు నష్టాలతో ముగించినట్లయింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 76,138 గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు నష్టంతో 23,031 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.89 గా కొనసాగుతోంది. టాటా స్టీల్, జొమాటో, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి.
