కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏరో – ఇండియా 2025లో యుద్ధ విమానాన్ని నడిపారు.అయితే స్వదేశంలో సగర్వంగా తయారైన HJT-36 యశష్ జెట్ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పైలట్ రామ్ తో కలిసి ట్రావెల్ చేశారు.ఈ మేరకు యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.ఈ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ తయారు చేసింది.ఇలాంటి అరుదైన అవకాశం లభించిందని ఆనందంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా విమానయాన,రక్షణ తయారీలో రోజురోజుకూ పట్టు సాధిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.కాగా ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో…అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం.. మరచిపోలేని అనుభూతినిచ్చింది. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో…
Author: admin
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో చేస్తున్నాడు.కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ గుండె చేయించుకుని తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఈ మేరకు సినిమా నుండి టైటిల్, టీజర్ ఫిబ్రవరి 12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ టీజర్‌ని తెలుగుతో పాటు తమిళ్,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.తమిళ్ టీజర్‌కు సూర్య,హిందీ టీజర్‌కు రణబీర్ కపూర్ వాయిస్ ఇస్తుండగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.ఈ మేరకు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటోలు చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేశారు.ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నారు అని సమాచారం.…
హాస్య నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు.అధిక రక్త పోటుకు గురి కావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అయితే పృథ్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి.ఇటీవల లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ మాట్లాడుతూ…వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు.కాగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు చెప్పారు.ఈ వివాదం ఇలా ఉండగానే పృథ్వీ అస్వస్థతకు గురైయ్యారు. https://youtube.com/shorts/SRog4895qGM?si=Hu0Df1L7v4wvZeSV
వరుసగా ఐదో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నేల చూపులు చూశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సూచీలు నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,018 పాయింట్లు నష్టపోయి 76,293గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 310 పాయింట్లు నష్టంతో 23,071 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.82గా కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలతో ముగిశాయి.
తెలుగు సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం,ఆయన కుమారుడు రాజా గౌతమ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.ఇందులో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేయనున్నారు.ఈ చిత్రానికి ఆర్.వి.ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలను పోషించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.అయితే ఈ నెల 14 తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసి , చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. https://youtu.be/B2WVxBp0ngU?si=2XpoPdvXs7wl1a_V
సినీనటిగా, బుల్లితెర యాంకర్ గా ఎంత ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే.అయితే తాజాగా హాస్పిటల్ బెడ్ పైన తన ఫోటోను రష్మీ షేర్ చేసింది, తన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యాను అని రష్మీ పేర్కొంది.తన భుజం సమస్య కారణంగా తనకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నానని తెలిపింది రష్మి,సర్జరీ తర్వాత తనకు ఇష్టమైన డాన్స్ చేయగలుగుతానని అంత సెట్ అవుతుందని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తాజాగా ఈ విషయం వైరల్ అవుతుంది.రష్మి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
భారత్ తన సొంత వృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఇండియా ఎనర్జీ వీక్-2025ను వర్చువల్ గా ప్రారంభించి మాట్లాడారు. ఈ 21వ శతాబ్దం మనదేనని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. మన స్వయం సమృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధి రేటును కూడా నడిపిస్తున్నాం. మన ఎనర్జీ రంగం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వనరులు, ఆర్థిక బలం, మేధో సంపత్తి, రాజకీయ స్థిరత్వం మన దేశానికి ఉన్నాయి. సౌర ఉత్పత్తి సామర్థ్యం పెంచి మూడో అతిపెద్ద సోలార్ ఎనర్జీ ఉత్పత్తి దేశంగా నిలిచాడు. మన శిలాజేతర ఇంధన శక్తి 3 రెట్లు పెరిగింది. పారిస్ జీ20 ఒప్పందాల లక్ష్యాలు చేరుకున్న మొదటి దేశం మనది. రానున్న 5 సంవత్సరాలలో మరిన్ని సరికొత్త మైలురాళ్ళు దాటబోతున్నాం. 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గార…
గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నట్లు వివరించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యింది. దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాము. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం…
కాంగ్రెస్ ప్రధాననేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణను పర్యటించనున్నారు. హనుమకొండలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హనుమకొండకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు హనుమకొండకు చేరుకుని, హోటల్ సుప్రభలో అర్ధగంట విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం, కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ భేటీ అవనున్నారు, ఈ మేరకు హనుమకొండలో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన తర్వాత ఇదే రోజు రాత్రి 7:30 గంటలకు ఆయన రైల్లో కాజీపేట రైల్వే స్టేషన్ నుండి తమిళనాడు వెళ్ళనున్నారు, ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణం చేయనున్నారు
ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో ఉన్నారు. నిన్న బయలుదేరి వెళ్లిన ఆయన ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పారిస్ లో జరగనున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ సహా అధ్యక్షునిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ సహా 100 దేశాలకు చెందిన సంస్థల సీఈవోలు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. రేపు ఫ్రాన్స్ నుండి అమెరికా బయలుదేరతారు. నైపుణ్య శిక్షణా రంగం (స్కిల్ ట్రైనింగ్) లో భారత్ అగ్రరాజ్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ అన్నారు. సాంకేతిక రంగంలో భారత్ సాధించిన అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. భారత్ ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఇంజనీర్లను తయారుచేస్తుందని అమెరికా, యూరప్ దేశాలన్నీ కలిసిన ఇంతమంది ఇంజనీర్లు తయారవడం లేదని అన్నారు. అందుకే భారత్ స్కిల్ సెక్టార్ లో ఒక అగ్రరాజ్యమని అన్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన ఫ్రెంచ్ మీడియా సంస్థలకు…
