Author: admin

క్వార్టర్ రూ.99కి అమ్మే బ్రాండ్లు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్ లిక్కర్ పైనా ఎటువంటి పెంపు లేదని క్వార్టర్‌కు రూ. 30 వరకూ పెంచేసినట్టు కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-26 మద్యం రిటైలింగ్ పాలసీని పారదర్శకంగా అమలు చేయడంతో 90 వేల అప్లికేషన్లకు ఫీజు కింద ప్రభుత్వానికి రూ.1800 కోట్లు వచ్చాయని తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో నాణ్యమైన మద్యం అందించేందుకు క్వార్టర్ బాటిల్ ను మార్కెట్ ధరను రూ.99గా నిర్ణయించారు. అయితే ప్రతి నెలకు మార్కెట్ షేర్ పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం మార్కెట్లో ఉన్న వివిధ మద్యం రేట్లను సమీక్షించి రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను సవరించడం జరిగిందని అందువల్ల ఫిబ్రవరి 10, 2025 నుండి సవరించిన మద్యం రేట్లు అమలులోకి వచ్చాయని వివరించారు. రిటైలర్ మార్జిన్ పెంచేందుకు కేవలం ఐఎంఎఫ్ఎల్(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) బ్రాండ్లపై ఏ బాటిల్ అయినా రూ.10 మాత్రమే పెంచారని తెలిపారు.

Read More

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట భారత జట్టు అభిమానులకు నిరాశ కలిగించే అంశం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఈ టోర్నీ బరిలోకి భారత్ దిగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో గాయపడిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడడం లేదు. వెన్ను కింది భాగంలో గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బుమ్రా స్థానంలో ఇటీవల అరంగ్రేటం చేసిన హార్షిత్ రాణాను తీసుకున్నట్లు తెలిపింది.

Read More

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు పోతాయనేది వాస్తవం కాదని పని చేసే పద్దతుల్లో మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. నేడు పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ సమావేశానికి సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు. వివిధ దేశాల అధినేతలు, సాంకేతిక రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏఐ విషయంలో అన్ని దేశాలు కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏఐ తో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలంటే అది స్థానికంగా ఉన్న వ్యవస్థలలోకి చొచ్చకుపోవాలని అన్నారు. అందుబాటు ధరలలో 140 కోట్ల మంది ప్రజల కోసం భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విజయవంతంగా నిర్మించింది. ఏఐ తో ఉద్యోగాలకు ముప్పు లేదని కొత్త టెక్నాలజీ వలన ఉద్యోగాలు పోతాయనేది వాస్తవం కాదని చరిత్ర ఇదే చెబుతుందని పని చేసే విధానం మారుతుందని కొత్త…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం మంజూరు డాక్యుమెంట్స్ ను హడ్కో రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీ.ఆర్.డీ.ఏ) కు అందించింది. అమరావతి నిర్మాణానికి ముంబైలో జరిగిన పాలకమండలి సమావేశంలో హడ్కో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీ.ఆర్.డీ.ఏ కమిషనర్ కు సంబధిత పత్రాలు హడ్కో అధికారులు నేడు అందజేశారు. నాలుగు నెలల్లోగా రుణ ఒప్పందం కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సీ.ఆర్.డీ.ఏ కమీషనర్ ను హాడ్కో అధికారులు కోరారు.

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా మహిళల కోసం “వర్క్ ఫ్రమ్ హోమ్”ని ప్లాన్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ సందర్భంగా మహిళలు మరియు బాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. COVID-19 అప్పుడు వర్క్ చేసే విధానంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా అందుబాటులో ఉన్న సాంకేతికతతో, “వర్క్ ఫ్రమ్ హోమ్” ప్రాముఖ్యతను సంతరించుకుందని పేర్కొన్నారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్‌లు (CWS) మరియు నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లు (NWS) వంటి కాన్సెప్ట్‌లు అనువైన, ఉత్పాదక పని వాతావరణాన్ని సృష్టించడానికి వ్యాపారాలు మరియు ఉద్యోగులను శక్తివంతం చేయగలవని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కు ఉపయోగపడతాయని అన్నారు. ఏపీలో అర్ధవంతమైన మార్పును తీసుకురావడానికి ఈ విధానాలను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ IT & GCC పాలసీ 4.0 ఆ దిశగా…

Read More

ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి గారు ఈరోజు కేంద్రం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ…విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమస్యలపై కేంద్రమంత్రి కుమారస్వామి తో చర్చించారని పేర్కొన్నారు.ఈ మేరకు ఉద్యోగులకు ప్రతినెల జీతాలు సరిగ్గా అందేలా చూస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.కాగా ఈ భేటీలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొన్నారు.ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను,ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. Met the Honourable Minister for Steel and Heavy Industries, Sri Kumaraswamy Ji and discussed the issues of the employees in Vizag Steel Plant and sought his support in ensuring they receive their salaries every month.కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి…

Read More

తాజాగా ఏపీ లో కూటమి ప్రభుత్వం విఐపిల భద్రత మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను 9.2 కోట్లతో సిద్ధం చేస్తూ, వాటికి సంబంధించిన ఉత్తర్వులను హోంశాఖ జారీ చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కొరకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. 10 ఫార్చునర్ టయోటా వాహనాలను, బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార పెద్దలకు అన్నివేళలా దృఢమైన భద్రత కల్పించేందుకు తాజాగా ఏపీ సర్కార్ ఈ నిర్ణయం చేపట్టింది.

Read More

ఇటీవల మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇలా ఎంతోమంది ప్రముఖులు హాజరవ్వడం జరిగింది. అయితే, తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా కలిసి పడవలో ప్రయాణించి త్రివేణి సంగమానికి చేరుకున్నారు దీని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే త్రివేణి సంగమం లో ఇప్పటివరకు 44 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read More

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’.ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో విష్ణు కు జోడిగా ప్రీతి ముకుంద్ నటిస్తుంది.ఇందులో మోహన్ బాబు రెబెల్ స్టార్ ప్రభాస్ , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘శివ శివ శంకర’ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ పాటను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ గురూజీ విడుదల చేశారు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా.. సాంగ్ లింక్ షేర్ చేశారు విష్ణు.అయితే ఈ పాటను విజయ్ ప్రకాశ్ పాడారు.ఈ చిత్రానికి స్టీపెన్ దేవస్య్ సంగీతం అందిస్తున్నాడు.ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. https://www.youtube.com/watch?v=VnPFQ7nNu0U

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి తెలిపారు.‌ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రకారం, 15% వృద్ధి లక్ష్యంగా పని చేసేలా ప్రతి డిపార్టుమెంటు ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని ప్రయారిటీగా తీసుకుని, త్వరితగతిన పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ పరిగణనలోకి తీసుకుని, తగు మార్పులు చేసుకుంటూ పాలన సాగించాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 158 సేవలు అందిస్తున్నామని, వచ్చే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింతగా విస్తరిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రికి వివరించారని తెలిపారు. వాయిస్ ఎనేబుల్డ్ సేవలతో పాటుగా, ప్రజల ఫీడ్ బ్యాక్ ని కూడా వాట్సాప్ ద్వారా అందించేలా చూడాలని సీఎం…

Read More