Author: admin

సంపద సృష్టించి పేద ప్రజలకు పంచాలనేదే తమ ఉద్దేశమని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. సచివాలయంలో ఏపీ సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గత ఐదేళ్ల విధ్వంస పాలనతో వెనుకబడ్డామని ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకుసాగుతున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ 6నెలల కాలంలోనే 12.94 శాతం గ్రోత్ రేట్ కనబడినట్లు తెలిపారు. ఉన్న సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలొస్తాయని తెలిపారు. ఇక రేపటికి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 9నెలలవుతుందని గుర్తుచేశారు. గత వైసీపీ పాలనను వద్దని ప్రజలు భారీ మద్దతుతో మనకు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఒక సవాలు ఉండేదని అయితే ఇప్పుడు ఇన్ని సవాళ్లను ఎదుర్కోవడం ఇది మొదటి సారి అని అన్నారు.…

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహా కుంభమేళా’ కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మాఘ పౌర్ణమి సహా పలు ప్రత్యేక దినాలు ఉండడంతో మరింత భక్తజనం రానున్న నేపథ్యంలో అధికారులు కొత్త ఆంక్షలు తీసుకొచ్చారు. అందులోనూ ఇటీవల వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంగా తాజాగా కుంభమేళా ప్రాంతంలో నో వెహికల్ జోన్ గా మార్చారు. నేటి సాయంత్రం 5 గంటల నుండి ప్రయాగ్ రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా మార్చనున్నారు. ఇటీవల ట్రాఫిక్ జామ్ తో లక్షలాది భక్తులు 24 గంటలకు పైగా వాహనాల్లోనే ఉండాల్సి వచ్చింది. దాదాపుగా 350 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్ర సృష్టించింది. ఇక ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి తాజాగా గత రాత్రి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పోలీసులు, అధికారులు సమావేశమయ్యారు.…

Read More

స్వర్ణాంధ్ర విజన్ 2047 లో బ్యాంకులూ భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకర్ లను కోరారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ తో ఆయన సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.స్వర్ణాంధ్ర విజన్-2047’లో బ్యాంకులూ భాగస్వాములేనని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ హార్టీకల్చర్, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. రైతు ఆత్మహత్య అన్న మాటే వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి బ్యాంకులు బలాన్నివ్వాలని కోరారు. ఎంఎస్ఎఈల రుణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని వివరించారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకూ సహకరించాలని కోరారు. ‘ప్రధానమంత్రి సూర్యఘర్’ను విజయవంతం చేద్దామని తెలిపారు. ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యమని పేర్కొన్నారు.

Read More

ఈనెల 19 నుండి పాకిస్థాన్ లో ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్ తన స్వదేశంలో ప్రమాదకరమైన జట్టు అని మాజీ క్రికెటర్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. మంచి పేస్ బౌలింగ్ కలిగిన పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరుకుంటుందన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాల పై వన్డే సిరీస్ గెలిచిన ఊపులో బరిలోకి దిగుతోంది. గడిచిన 6-8 నెలలుగా పాక్ వన్డేల్లో అద్భుతంగా రాణిస్తుంది. జట్టు ఆటతీరు బాగుంది. అనుకూల పరిస్థితుల మధ్య పాక్ సెమీస్ చేరుతుందని భావిస్తున్నా. నాకౌట్ కి అర్హత సాధిస్తే పాక్ మరింత ప్రమాదకర జట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.

Read More

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ బయోవెట్‌ నుండి లంపీ స్కిన్‌ వ్యాధి టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుండి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు.ఎల్‌ఎస్‌డీ వ్యాధితో గత రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి.దీనితో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది.‘బయోలంపివ్యాక్సిన్‌’ అనే ఈ టీకా మన దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేశారు. దీనికి సీడీఎస్‌సీఓ నుండి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్కొంది.ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పని చేస్తుందని వివరించింది. దీన్ని ఐసీఏఆర్‌-ఎన్‌ఆర్‌సీఈ, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపింది. హిస్సార్‌లోని ఐసీఏఆర్‌-ఎన్‌ఆర్‌సీఈ అందించిన ఎల్‌ఎస్‌డీ వైరస్‌/ రాంచీ/ 2019 వ్యాక్సిన్‌ స్ట్రెయిన్‌తో బయోవెట్‌ సంస్థ ఈ టీకాను డెవలప్‌ చేసింది. ఈ టీకాకు సీడీఎస్‌సీఓ లైసెన్సు లభించడం, మన దేశంలో పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యానికి…

Read More

ఫ్రీస్టైల్ గ్రాండ్ స్లామ్ చెస్ టూర్ మొదటి అంచె టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ మరో ఓటమి చవిచూశాడు. అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాతో క్వార్టర్ ఫైనల్ లో మొదటి గేమ్ లో ఓడిన గుకేశ్ రెండో గేమ్ లో కూడా ఓటమితో టోర్నీ నుండి నిష్క్రమించాడు. రెండో గేమ్ లో 18 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించాడు. చివరి నాలుగు స్థానాల కోసం జరిగే పోరులో తలపడనున్నాడు.

Read More

తండేల్ చిత్రాన్ని పైరసీ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తండేలు చిత్ర నిర్మాతలు అల్లు అర్జున్ బన్నీవాసులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ మధ్యన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ ప్రింట్ ను వేయడం దారుణమని, చిత్ర విజయాన్ని ఆనందించే సమయంలో ఇదొక బాధాకరం అయిందని అల్లు అరవింద్ బన్నీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, సినిమాలను ఇలా కొందరు తెలిసి, మరియు కొందరు తెలియక, పైరసీ చేస్తున్నారని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఆ లింక్స్ ను ఫార్వర్డ్ చేస్తూన్నారు. అలా పైరసీ చేస్తున్న వారిని గుర్తించి కేసులు పెడతామని వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫిలిం ఛాంబర్ జాగ్రత్తల వల్ల కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ జరగడం లేదని, గత రెండు నెలల నుంచి మళ్లీ ఈ రాక్షసి విజృంభిస్తుంది అని ఆయన ఆవేదం వ్యక్తం చేస్తూ,…

Read More

స్వచ్ఛమైన ఇంధన వనరుగా అణు విద్యుత్తును పేర్కొన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, భారత్ రైల్వేలో అను విద్యుత్ వినియోగంపై రాజ్యసభలో టిఎంసి సభ్యుడు సాగరిక ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారతీయ రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల రిత్య శిలాజందనం వినియోగాన్ని తగ్గించి అణు విద్యుత్తును వినియోగాన్ని పెంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా టిఎంసి సభ్యుడు, సాగరిక ఘోష్ రాజ్యసభలో వినిపించిన సమస్యపై అశ్విని వైష్ణవ్ ఇచ్చిన లికితపూర్వక సమాధానం అందుకు ఆధారం ఇస్తుంది.టీఎంసీ ఎంపీ సాగరిక, రాజ్యసభలో అణు విద్యుత్ వినియోగించేలా రైల్వే అభివృద్ధి చేస్తుందా..?ఇందులో పురోగతి సాధించిందా.? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇస్తూ, రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల రీత్యా అణు విద్యుత్ తో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విద్యుత్ మంత్రిత్వ శాఖలను సంప్రదించమని…

Read More

నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ…ఓ ఈవెంట్ లో తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని తనను ట్రోల్ చేస్తున్నారని తెలిపారు.రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు.దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.ఈ విషయంపై ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తే…ఇప్పుడు తగిన సమయం కాదు, తర్వాత మాట్లాడతాను అని అన్నారు. అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు.దానికి మెగా అభిమానులు చాలా ఫీలయ్యారు.నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నా కొడుకులాంటివాడు..నాకున్న ఏకైక మేనల్లుడు..అతడకి నేన ఏకైక మేనమామని..అందుకే ఎంతో భావోద్వేగంతో చెబుతున్నాను.దయ చేసి ఆ విషయం వదిలేయండి.చరణ్, నాకు మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఆ రోజున దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి పొరపాటున అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.తర్వాత ఆలోచిస్తూ…

Read More

నిన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ…ఇన్ డైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు.ఒక వ్యక్తిని మేకల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే…మొత్తం 150 మేకలు ఉన్నాయని…ఇక సినిమా అయిపోయే ముందు మరో సీన్ లో కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ ‘‘బాయ్ కట్ లైలా’’ అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు.ఈ మేరకు విశ్వక్ సేన్ & చిత్రబృందం దీనిపై స్పందించింది. కాగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ … ఆ సంఘటన తమ కంట్రోల్ లో జరగలేదని.. ఒకవేళ అది తన ముందు జరిగి ఉంటే వెంటనే వెళ్లి ఆయన వద్ద ఉన్న మైక్ లాక్కునేవాళ్లమని అన్నారు.అయితే తాము ఆ సమయంలో అక్కడ లేమని..చిరంజీవిని రిసీవ్ చేయడానికి బయటకు…

Read More