Author: admin

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ…సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఈ వాలెంటైన్ డే వీక్ సందర్భంగా సింగిల్స్ కోసం అద్భుతమైన “సింగిల్” అనే గ్లిమ్ప్స్ తో ముందుకు వచ్చాడు.ఇందులో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు.ఈ చిత్రానికి కార్తిక్‌రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్‌తో పాటు విద్య కొప్పినీడు, భాను ప్రతాప్‌,రియాజ్‌ చౌదరి నిర్మిస్తున్నారు.కాగా ఈ చిత్రం యూత్‌ఫుల్‌ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. https://youtu.be/d3bbZsRTxNk?si=cwYnaqM0cFdmdjaE

Read More

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఢిల్లీలో లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లాని కలిశారు. ఈ సందర్భంగా, ఈ నెల 22వ తేదీ నుండి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హాలులో ఎమ్మెల్యేల కోసం నిర్వహించనున్న ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించవలసిందిగా కోరారు. ఓరియెంటేషన్ కార్యక్రమం మొదటి రోజు ప్రారంభోత్సవానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గారు హాజరవుతుండగా… రెండో రోజు ముగింపు కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నారు. ఇక ఈనెల 24 నుండి శాసనసభ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే.

Read More

రిలయన్స్ స్పోర్ట్స్ డ్రింక్స్ కేటగిరీలోకి ప్రవేశించింది. ‘స్పిన్నర్’ అనే బ్రాండ్ తో డ్రింక్ ను తీసుకొచ్చింది. కాంపా కోలాతో కూల్ డ్రింక్ మార్కెట్ లోకి వచ్చిన రిలయన్స్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రింక్స్ కేటగిరీలోకి ప్రవేశించింది. స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ‘స్పిన్నర్’ బ్రాండ్ ను ఆవిష్కరించింది. ఈ డ్రింక్ ను రూ.10కే అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డ్రింక్ కు విస్తృతంగా ప్రచారం కల్పించడం కోసం వివిధ ఐపీఎల్ టీమ్ లతో జట్టు కట్టినట్లు పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లతో కలిసి నేషనల్ లెవెల్ లో బ్రాండ్ విజిబిలిటీని పెంచనున్నామని కంపెనీ తెలిపింది. రానున్న మూడేళ్లలో స్పోర్ట్స్ బేవరేజెస్ కేటగిరినీ 1 బిలియన్ డాలర్ల మార్కెట్ అందుకునేలా ఈ డ్రింక్ కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. లెమన్ ఆరెంజ్ నైట్రో బ్లూ…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు ప్రభావం చూపాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఇక ఇన్వెస్టర్ల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో రిజిస్టర్డ్ కంపెనీల విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు ఆవిరైంది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 178 పాయింట్లు నష్టంతో 23,381 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.46గా కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనల కోసం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అమెరికాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్ లో జరగనున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొననున్నట్లూ పేర్కొన్నారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తో చర్చలు జరపనున్నారు. మార్సిల్లేలో కాన్సులేట్ ను కూడా ప్రారంభించనున్నారు. వాషింగ్టన్ లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను కలవనున్నారు. ఈ పర్యటన భారతదేశం-అమెరికా స్నేహాన్ని మరింత సుస్థిరం చేస్తుంది మరియు విభిన్న రంగాలలో సంబంధాలను బలోపేతం చేయనుందని మోడీ వివరించారు.

Read More

నేడు ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం (WORLD PULSES DAY) . పప్పు దినుసులలోని పోషక విలువలు, వాటి వలన పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) 2019 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2016లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అమలు చేసిన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ (IYP) విజయవంతం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మన దేశంలో కూడా అనేక రకాల పప్పు దినుసుల సాగు చేస్తున్నారు. 2015-16లో 163.23 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అయితే, 2023-24 నాటికి 244.93 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.

Read More

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘మజాకా’ అనే చిత్రం తెరకెక్కింది.ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్స్ రావు రమేష్,అన్షు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్తాన్ని ఈ ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్బ్యానర్స్ పై రాజేష్ దండాఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది.ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘మజాకా’ నుండి వరుస అప్డేట్స్ ఇస్తుంది చిత్రబృందం.తాజాగా ఈ సినిమాలోని ‘బేబీ మా’ ఫుల్ సాంగ్ విడుదల చేశారు.ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. https://youtu.be/cijCPIeNhBs?si=upXNjJhkIuI98d36

Read More

ఎన్టీఆర్ దేవర చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను పాప్ సింగర్ షీరన్ స్టేజీ మీద పాడారు.తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జూ.ఎన్టీఆర్ కూడా ఇంస్టాగ్రామ్ లో ఆ వీడియోను స్టోరీలో షేర్ చేస్తూ … సంగీతానికి హద్దులు లేవని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం ప్రత్యేకమంటూ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టొఫర్ షీరన్ కు థాంక్స్ చెప్పారు.బ్రిటన్ కు చెందిన షీరన్ ఇటీవల బెంగళూరులో కాన్సర్ట్ నిర్వహించారు.నిన్న జరిగిన ఈవెంట్ లో ‘ఎందుకు పుట్టిందో పుట్టింది’ అంటూ ఆయన తెలుగులో పాడారు.శిల్పారావుతో గొంతు కలిపారు.వీరు పాట పాడుతుండగా ఆడిటోరియం దద్దరిల్లింది. మధ్యలో ప్రేక్షకులు కోరస్ గా ‘ఆ’ అంటూ అరుస్తూ కేకలు పెట్టారు. బ్రిటీష్ యాసతో షరీన్ నోట చుట్టమల్లే పాట డిఫరెంట్ గా వినిపించింది.తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేశారు. ఈ ఘటన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదని ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని ఆయన పేర్కొన్నారు. రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా శ్రీ రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు… పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని ఆ మూకను నడిపిస్తున్నది…

Read More

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు నిన్న పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని,సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల సమాచారం.హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక,వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు.గంటల తరబడి ట్రాఫిక్ కదలడంలేదని,ప్రయాగ్ రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. అయితే మరోవైపు,భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ.. దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను…

Read More