తమిళ నటుడు ధనుశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ ట్రైలర్ చూస్తూంటే పక్కా యూత్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.అలాగే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందినట్లు సమాచారం.’జాలీగా రండి.. జాలీగా వెళ్లండి’ అంటూ ధనుశ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.ఇందులో పావిష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. https://youtu.be/STJgVuDibrc?si=E9VH2BOXKiE9RyJT
Author: admin
తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.గాజాను స్వాధీనం చేసుకుంటామని ఉద్ఘాటించారు.ఈ మేరకు ఆయన స్పందిస్తూ…ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అన్నారు. గాజాలోకి హమాస్ మళ్లీ అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు.అయితే గాజాలో ఉన్న పాలస్తీనియన్లను మరో ప్రాంతానికి తరలిస్తామని… అనంతరం గాజాలోకి అమెరికా బలగాలను దింపి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ట్రంప్ చెప్పారు.గాజాలో పాలస్తీనియన్ల కోసం మంచి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలపాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా? అని ప్రశ్నించారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాష్ట్రాన్ని నిలబెట్టేలా తెలంగాణ రైజింగ్ నినాదంతో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కార్యాచరణ తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు .ఇటీవల దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని వివరించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు…
ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన ‘ఇన్ఫోసిస్’ గత ఏడాది అక్టోబరు క్యాంపస్ నియామకాల ద్వారా చేర్చుకున్న 700 మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపించినట్లు సమాచారం.దీని కోసం బౌన్సర్లను, సెక్యూరిటీ గార్డులను ఉపయోగించిందని,ఎలాంటి ముందస్తు నోటీసులు,నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయంగా ఉద్యోగులను తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్) మండిపడింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించడంతోపాటు ఉద్యోగులను బెదిరిస్తున్న ‘ఇన్ఫోసిస్’పై వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. మెటా & గూగుల్ ఉద్యోగుల తొలిగింపు..! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని తొలగించనున్నట్టు గత నెలలో ప్రకటించిన ‘మెటా’, ప్రధానంగా పేలవమైన పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది అని తెలుస్తుంది.ఈ మేరకు 3,600 మందిపై వేటు వేయనుంది.వీరిలో 3 వేల మందిని ఈరోజు నుండి ఇంటికి పంపనున్నట్టు ఆ కంపెనీ నుండి లీకైన ఓ మెమో వెల్లడించింది. అదే…
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఆ దారిలో ప్రయాణిస్తున్న హోంమంత్రి అనిత వెంటనే కాన్వాయ్ ఆపి గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు చేశారు. మంచినీరు అందించారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అనిత వ్యవహారించిన తీరుపట్ల పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతగా వ్యవహరించారని కొనియాడుతున్నారు.
ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర పోలీసులు భద్రత కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లి జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.అయితే జగన్ నివాసం పక్కనున్న వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో ఈ నెల 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని..స్థానిక పోలీసులు ఆ కార్యాలయ సిబ్బందిని కోరారు.కానీ వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి ఎలాంటి స్పందన లేదు.కాగా జగన్ నివాసం దగ్గర భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు నిఘాను పెంచేందుకు 8 సీసీ…
అత్యంత ప్రాధాన్యత కలిగిన మరియు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో నేడు భారత ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. దీనికి ముందు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్ లో ప్రత్యేక పూజలు చేసి బోటులో విహరించారు. మహా కుంభమేళాకు వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో దేశ, విదేశాల నుండి సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. దీనికి తగినట్లుగా యూపీ ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సీబీఐ సిట్ అధికారులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.అయితే ఉత్తరాఖండ్ రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్, పొమిల్‌తో పాటుగా తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ ఎండీ డా రాజు రాజశేఖరన్‌లు…తిరుపతి జల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడాలను సీబీఐ సిట్ అధికారులు తిరుపతిలో అరెస్టు చేశారు. కాగా ఈ నలుగుర్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి…రాత్రి 10.30కు తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు.ఈ మేరకు నలుగురికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ…
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇద్దరూ ఇద్దరే మ్యాచ్ లో వీరిద్దరి మధ్య కనిపించే దూకుడు స్వభావం ఒకప్పటి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంటర్నేషనల్ లీగ్ టీ 20 లీగ్ సందర్భంగా ఒకరినొకరు నెట్టుకుంటూ సరదాగా బాహాబాహీకి దిగిన ఒక వీడియో నెట్టింట నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను షోయబ్ అక్తర్ తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ కి మేము ఇలా సిద్దమవుతున్నాం అంటూ ఆసక్తికర క్యాప్షన్ ను ఆయన ఈ వీడియోకు జత చేసారు. ఇక ఈనెల 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ జట్లు ఈ నెల 23న తలపడనున్నాయి. Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh?…
యువత జూదం ఉచ్చులో చిక్కుకోకుండా తమిళనాడు ఆన్ లైన్ గేమింగ్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాల లోపు యువత డబ్బు చెల్లించి ఆన్ లైన్ గేమ్ లు ఆడేందుకు వీలు లేకుండా నిషేధం విధించింది. ఆన్ లైన్ జూదం అనే ఊబిలో ఇరుక్కుని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ గేమ్ లను క్రమబద్దీకరించేలా నిబంధనలు కఠినతరం చేస్తూ గేమింగ్ అథారిటీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 18 సంవత్సరాల లోపు వారు డబ్బు చెల్లించి ఆడేందుకు నిషేధం విధించింది.
