అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంకల్ప పత్ర’ పార్ట్-3 పేరుతో మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. కేంద్రమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు ఉండవన్నారు. 50 వేల ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని . బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని వివరించారు. ఢిల్లీకి చేసిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదని ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం అందించలేదని దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదని ఆక్షేపించారు. ఎన్నడూ లేని విధంగా కేజీవాల్ నేతృత్వంలో అవినీతి మరింతగా పెరిగిపోయిందని అమిత్ షా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ.15 వేల కోట్లు,…
Author: admin
ప్రముఖ నటి 52 సంవత్సరాల మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించారు. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించారూ. యూపీలో మహాకుంభమేళాలో ఆమె సాధ్విగా మారిపోయారు. కుంభమేళాకు రావడం సంతోషంగా ఉందని, సన్యాసం స్వీకరించడం తన అదృష్టమని తెలిపారు.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోడీ మధ్య జరిగిన సమావేశంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ ఇండోనేషియా నిర్ణయించాయి. సుబియాంతో మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చారు. రేపు ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కాగా, ఇరువురి నేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చించారు. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం ఉపయోగపడేలా ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. భారత్ కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని మోడీ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించినట్లు మోదీ వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్, ఇండోనేషియా కలిసి పని చేయబోతున్నట్లు తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ఇరుదేశాలు పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక…
రాజకీయాల్లోకి వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న తెలిపిన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసి తన రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ రాజీనామా లేఖ సమర్పించినట్లు దాన్ని ఆయన ఆమోదించారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా మాత్రమే కాదు.. రాజకీయాల నుండి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.వైసీపికి 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. నా రాజీనామాతో కూటమీ లబ్ధి పొందుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక జగన్ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఏపీ సీఎం చంద్రబాబుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం, కొత్త ఓటర్లను గుర్తించడం, ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడమే ప్రధానోద్దేశంగా జనవరి 25న ప్రతియేటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశం జరుపుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2025, జనవరి నాటికి 99.1 కోట్లకు పెరిగారు. ఈ సంఖ్య త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ నిలవనుంది. ఈ సంవత్సరం ఓటరు దినోత్సవానికి సంబంధించి ఓటును మించింది ఇంకొకటి లేదు.. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను (NOTHING LIKE VOTING, I VOTE FOR SURE)…
16 ఏళ్ల క్రితం ముంబయిలో జరిగిన మారణహోమాన్ని తలుచుకుంటే దేశ ప్రజలకు ఇప్పటికీ వణుకు పడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు అప్పగించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో తహవూర్ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. 64 ఏళ్ల తహవూర్ రాణా పాకిస్థాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఇక అతడి అప్పగింత విషయమైన భారత్ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు.…
భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని చేసి చూపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనైన జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన చారిత్రక బ్రిడ్జి పై తొలిసారి వందే భారత్ ట్రైన్ ను నడిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సెమీ హై స్పీడ్ వందేభారత్ ట్రైన్ ట్రయల్ రన్ ఇండియన్ రైల్వేస్ నేడు ప్రారంభించింది. కాత్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ ట్రైన్ ప్రయాణించింది. కాశ్మీర్ అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ ట్రైన్ ను ప్రత్యేకంగా రూపొందించారు. భారత్లోని మిగతా ప్రాంతాలతో కాశ్మీర్ ను కనెక్ట్ చేసే విధంగా చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుండి 359 మీ ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇక గతేడాది జూన్ లో ఈ బ్రిడ్జి…
ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో ఓ పుస్తకాన్ని బిల్ గేట్స్ విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన కాపీని సీఎం చంద్రబాబుకు బహుకరించారు. ఆ పుస్తకం తనకు బహూకరించినందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సీఎం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.”సోర్స్ కోడ్” పేరిట నా స్నేహితుడు బిల్ గేట్స్ పుస్తకం విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ పుస్తక కాపీ నాకు బహూకరించినందుకు ధన్యవాదాలు. బిల్ గేట్స్ తన జీవిత ప్రయాణంలోని అనుభవాలు, పాఠాల సమాహారంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారని వివరించారు. కాలేజీ వదిలి మైక్రోసాఫ్ట్ ప్రారంభ నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు పలువురు మంత్రుల బృందం దావోస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు, దిగ్గజ సంస్థల అధినేతలతో వీరు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల కల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు. కాగా, దావోస్ లో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఏపీ సీఎస్ కె. విజయానంద్, సీఎంవో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మూడు రోజులపాటు దావోస్ లో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. త్వరలో దేశ, విదేశీ ప్రతినిధులు, సంస్థల సీఈవోలు రాష్ట్రంలో పర్యటించనున్నారని, దానికి తగినట్లుగా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని వివరించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సందర్శించారు. లాభాపేక్ష లేని సంస్థ ఇదని కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” కోసం 30,000 మంది బడి పిల్లలకు ఇక్కడి నుండి దాదాపు 25 ఇన్సులేటెడ్ కంటైనర్లలో భోజనం సరఫరా అవుతుంది. ఇంత మందికి ఆహారం తయారు చేస్తున్నా కిచెన్ ను వాళ్ళు నిర్వహించే తీరు, శుభ్రత చాలా బాగుందని ఆమె ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 24 లక్షలకు పైగా బడి పిల్లలకు ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే ఆహారం పంపిణీ చేయబడుతోందని అక్షయపాత్ర మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీ వంశీధర దాస వివరించారు . అక్కడ బియ్యం శుభ్రపరిచే యంత్రాన్ని భువనేశ్వరి ప్రారంభించారు.దీని పట్ల ఆమె హార్షం వ్యక్తం చేశారు.
