Author: admin

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే ఇతివృత్తంతో శకటాలను రూపొందించారు. త్రివిధ దళాలు తమ ప్రదర్శనను లతో ఆకట్టుకున్నాయి. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తా చాటాయి. కర్తవ్యపథ్ 9 కి.మీ మేర ఈ కవాతు చేశాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

Read More

విజయవాడలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ, హెచ్ ఆర్ డి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా పరేడ్ లో పలు శాఖలకు సంబంధించిన శకటాలు ఆకట్టుకున్నాయి.

Read More

అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్‌ సెక్రటరీ)గా పీట్‌ హెగ్సెత్‌ ఎన్నికను అమెరికా సెనేట్‌ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్‌ హెగ్సెత్‌ పేరును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందుగానే ఎంపిక చేసినప్పటికీ లైంగిక దాడి,మద్యపాన వ్యసనం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెగ్సెత్‌ ఎన్నికపై సెనేట్‌లో 50 శాతం అనుకూలంగా,50 శాతం వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి.ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌ తన ఓటును ఉపయోగించుకుని హెగ్సెత్‌ గెలుపునకు మార్గం సుగమం చేశారు.

Read More

ఇజ్రాయెల్‌- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.దీనికి అనుగుణంగా తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు మహిళా సైనికులను హమాస్‌ నిన్న విడుదల చేసింది.ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.అనంతరం వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారు.వీరిని విడుదల చేసినందుకు గానూ ఇజ్రాయెల్‌ సైతం 100కు పైగా పాలస్తీనియన్లను విడిచిపెట్టింది. తాజాగా విడుదలైన మహిళా సైనికులను 2023 అక్టోబర్‌ 7న గాజా సరిహద్దుకు సమీపంలోని వహల్‌ ఓజ్‌ మిలిటరీ బేస్‌ నుండి హమాస్‌ బంధించి తీసుకెళ్లింది.అప్పటి నుండి 477 రోజులుగా ఆ మహిళా సైనికులు హమాస్‌ చెరలోనే ఉన్నారు.అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలిరోజు గాజా నుండి ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను హమాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా తమ జైళ్లలో ఉన్న 100 మందికిపైగా పాలస్తీనియనన్లకు విముక్తి కల్పించి వారిని రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించింది. కాగా,…

Read More

ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు.”గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం.ఈ సందర్భంగా మన రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా,మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం,గౌరవం,ఐక్యతపై ఆధారపడి ఉండేలా చూసుకున్న వారందరికీ మేము నివాళులు అర్పిస్తున్నాము. ఈ జాతీయ పండుగను పరిరక్షించడానికి ఒక ప్రయత్నం” అని ఆయన అన్నారు.మన రాజ్యాంగ విలువలను గౌరవిస్తామని,బలమైన,సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.దీనితో పాటు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. Happy Republic Day. Today, we celebrate 75 glorious years of being a Republic. We…

Read More

కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల్లో నలుగురి సినీ ప్రముఖులకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ నుండి నందమూరి బాలకృష్ణ…తమిళనాడు నుండి అజిత్..అదే రాష్ట్రం నుండి కేరళకు చెందిన శోభనకు..కర్ణాటక నుండి అనంత్ నాగ్ కు పద్మ అవార్డులు ప్రకటించారు.అటు బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు.వెండితెరపై ఒకే సినిమాలో హీరో,హీరోయిన్లుగా నటించిన బాలకృష్ణ, శోభన లకు కూడా ఒకేసారి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం విశేషం.బాలయ్య – శోభన కలసి మువ్వగోపాలుడు,నారీ నారీ నడుమ మురారి సినిమాల్లో కలిసి నటించారు.అంతేకాదు తెలుగు సహా దక్షిణాది నుండి తండ్రి తర్వాత కుమారుడిగా పద్మ అవార్డు అందుకున్న హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేసారు.బాలకృష్ణ హీరోగా 50 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ అవార్డు రావడం పట్ల నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళ అగ్ర కథానాయకుడిగా 3 దశాబ్దాలుగా…

Read More

ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు: భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో  సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళ… భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047ల లక్ష్యసాధనకు రాజ్యాంగ స్పూర్తితో కృషి చేద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్: మన దేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన పర్వదినం జనవరి 26. గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్రంగా మార్గ నిర్దేశనం చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తిని అజరామరంగా వర్ధిల్లేలా చేయడం మనందరి బాధ్యత. మన దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని… రాజ్యాంగ రచన చేసి గణతంత్ర…

Read More

కేంద్రం తనకు పద్మభూషణ్ ప్రకటించడం పై నటుడు అజిత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ సమయంలో తన తండ్రి కూడా ఉండి ఉంటే ఎంతో బాగుండేదని అన్నారు.పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా. సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. వారం ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగ్ నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు.ఈరోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోంది.నన్ను చూసి ఆయన గర్వపడేవాడు.భౌతికంగా మా మధ్య లేకపోయినా..నేటికి ఆయన నాతోనే ఉన్నాడని అనుకుంటున్నాను.25 ఏళ్ల నుంచి నా భార్య…

Read More

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు చెన్నై వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ 2 వికెట్ల‌ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 45 (30; 2×4, 3×6) టాప్ స్కోరర్. బ్రిడన్ కార్సే 31 (17; 1×4, 3×6), స్మిత్ 22 (12; 1×4, 2×6) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, హార్థిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ కూడా తడబడింది. అయితే తిలక్ వర్మ 72 నాటౌట్ (55;…

Read More

రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.

Read More