టీమ్ ఆఫ్ ది ఇయర్ వన్డే, టెస్టు జట్లను ఇంటర్నెట్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024: చరిత్ అసలంక (కెప్టెన్)- (శ్రీలంక), సయామ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మనుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్థాన్), పథుమ్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్) (శ్రీలంక), షెర్ఫానే రూథర్ ఫర్డ్ (వెస్టిండీస్) అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్) వనిందు హసరంగ (శ్రీలంక) షహీన్ షా అఫ్రిది(పాకిస్థాన్) హరీస్ రవూఫ్ (పాకిస్థాన్) అల్లా మహ్మద్ ఘజన్ ఫర్(ఆఫ్ఘనిస్థాన్). ఐసీసీ టెస్టు జట్టు: కమిన్స్ (కెప్టెన్- ఆస్ట్రేలియా), బుమ్రా(భారత్), జైశ్వాల్(భారత్), జడేజా (భారత్), డకెట్(ఇంగ్లాండ్), రూట్(ఇంగ్లాండ్), జే. స్మిత్ (వికెట్ కీపర్), బ్రూక్, (ఇంగ్లాండ్), విలియమ్స్ (న్యూజిలాండ్), హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక). ఐసీసీ మహిళల వన్డే జట్టు: స్మృతి మందాన, దీప్తి(భారత్), లారా వోల్వార్డ్ (కెప్టెన్), మరిజేన్ క్యాప్ (దక్షిణాఫ్రికా), ఆష్లీ గార్డ్నర్, అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా), అమీ…
Author: admin
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుండి సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ వైదొలిగాడు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ తో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడోసీడ్ జకోవిచ్ తొలి సెట్లో 6-7 (5-7)తో వెనుబడిన సమయంలో గాయంతో తప్పుకున్నాడు. అయితే వైదొలగడానికి ముందు నొవాక్ గట్టి పోరాటం కనబరిచాడు. నేటి మ్యాచ్ కోసం కోలుకోవడానికి ప్రయత్నించినట్లు జకోవిచ్ పేర్కొన్నాడు. మరొక గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేసరినందుకు జ్వెరెవ్ కు అభినందనలు తెలిపాడు. అతను టైటిల్ గెలవాలని జ్వెరెవ్ దానికి అర్హులని జకోవిచ్ పేర్కొన్నాడు.మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ టెన్నిస్ స్టార్ యానెక్ సినర్ టైటిల్కు చేరువయ్యాడు. సెమీస్ పోరులో ఈ టాప్ సీడ్ 7-6 (7-2), 6-2, 6-2తో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ పై విజయం సాధించాడు.
తాజ్ మహల్‌ను వీక్షించాలనుకునే పర్యాటకులకు గుడ్‌న్యూస్.వరుసగా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్రవేశం కల్పించనున్నారు.మొఘల్ చక్రవర్తి షాజహాన్ 370వ ఉర్సు సందర్భంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు.జనవరి 26 నుంచి 28 వరకు మూడురోజుల పాటు ఉర్సు జరుగనున్నది.ఈ సందర్భంగా పర్యాటకులకు ఉచితంగా తాజ్ మహల్ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. ఏటా షాజహాన్ వర్ధంతి సందర్భంగా ఉర్సు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.ఈ క్రమంలో మూడురోజుల పాటు పర్యాటకులు తాజ్ అందాలను చూసి అనుభూతి చెందే అవకాశం కల్పించారు. అంతేకాకుండా సందర్శకులు షాజహాన్‌తో పాటు ముంతాజ్ ఒరిజినల్ సమాధులను చూసేందుకు వీలుంటుంది. ఇతర సమయాల్లో సందర్శకులకు ఈ అవకాశం ఉండదు. ఉర్సు సమయంలోనే ప్రత్యేకంగా అండర్‌గ్రౌండ్ ద్వారాలను తెరుస్తారు. ఈ సమయంలోనే పర్యాటకులకు షాజహాన్, ముంతాజ్‌ల సమాధులను చూసే అవకాశం వస్తుంది. ఉర్సు లో భాగంగా తొలిరోజు సమాధులను శుద్ధి చేసి ప్రార్థనలు చేస్తారు. రెండోరోజు సుగంధ ద్రవ్య…
2025 క్వాడ్ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలోనే జరుగుతుందని క్వాడ్ విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నాలుగు దేశాల కూటమి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లు ఇందులో సభ్యదేశాలు.హిందూ మహా సముద్రంలో 2004 సునామీ విధ్వంసం నేపథ్యంలో మానవతా సాయం, విప్పత్తు నిర్వహణ కోసం క్వాడ్ ఏర్పడింది. 2007లో నాటి జపాన్ ప్రధాని షింజో అబే క్వాడ్ ను లాంఛనంగా ప్రారంభించారు. 2024లోనే క్వాడ్ శిఖరాగ్ర సమావేశం భారత్ లో జరగాల్సి ఉన్నా, అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని అమెరికాలోని విల్మింగ్టన్ లో నిర్వహించారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిందీ చిత్రం.పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు వచ్చింది.అయితే దీనికి బ్రిటన్‌లోనూ అడ్డంకులు ఎదురయ్యాయి.ఆ సినిమాను అడ్డుకోవడంపై తాజాగా భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ‘‘ఎమర్జెన్సీ చిత్రాన్ని అనేక సినిమా హాళ్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారంటూ వెలువడిన కథనాలు,నివేదికలు మా దృష్టికి వచ్చాయి.భారత వ్యతిరేక మూకలనుంచి వచ్చే బెదిరింపులు,హింసాత్మక నిరసనల వంటి అంశాలను మేం యూకే ప్రభుత్వం వద్ద లేవనెత్తుతూనే ఉన్నాం.ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలి.యూకే ప్రభుత్వం ఆ దిశగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం…భారత దౌత్యకార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాం’’ అని జైస్వాల్ పేర్కిన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా వైభవోపేతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.గంగా,యమున,సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో అందుకు నుగుణంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా మౌని అమావాస్య రోజున ఆ ప్రదేశంలో వీఐపీ జోన్ ఉండదని ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని ప్రభుత్వం తెలిపింది.ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాలను అనుమతించబోమని వెల్లడించింది.ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఒక్కరోజే దాదాపు 8 నుంచి 10కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు(అమృత స్నానం) ఆచరించే అవకాశం ఉన్నందున 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌ను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ట్రాఫిక్, జనం రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని మోహరించామన్నారు.144ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న ఈ సందర్భానికి ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనబోతోందని…
రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చూసిన తర్వాత కథానాయకుడు మహేష్ బాబు తనకు ఫోన్ చేసి, ఈ తరహా కథకు మీదైన కామెడీ జోడించి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారని,అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథకు బీజం పడేలా చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘వరుణ్ డాక్టర్’ చూసి నాకు భలే అనిపించింది. అందులో చాలా పద్ధతిగా కామెడీ చేశారు.అలాంటి డార్క్ కామెడీని కొంత తీసుకుని, దానికి నాదైన కామెడీ టైమింగ్ జోడించి ఈ కథ రాసుకున్నా. అసలు ఈ ఐడియా ఇచ్చిందే అగ్ర కథానాయకుడు మహేష్ బాబు.ఆయన రజనీకాంత్ ‘జైలర్’ చూసిన తర్వాత నాకు ఫోన్‌చేసి 45 నిమిషాలు మాట్లాడారు. ‘ఇలాంటి ట్విస్ట్‌తో మీరు ఒక సినిమా చేస్తే వండర్స్ క్రియేట్ చేస్తారు’ అని…
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిని మురుగు కాలువగా మార్చారని ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగి తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై అఖిలేశ్ స్పందిస్తూ.. ముందు సొంత రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన సరిచూసుకోవాలన్నారు. ‘ఇతరులను సవాలు చేసే ముందు యూపీలో పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. మథుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు సిద్ధమా..?’ అని సీఎం యోగి పేరు ప్రస్తావించకుండా అఖిలేశ్ ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు. గురువారం బీజేపీ తరఫున ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ప్రసంగించారు. ‘బంగ్లాదేశీయులు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను ఆప్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఢిల్లీని డంపింగ్ యార్డ్‌లా చేసింది. యమునా నదిని మురుగు కాలువగా మార్చింది. కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో…
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు,హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు.వందల మందిని దేశం నుంచి పంపించేశారు.ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే.అయితే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం…ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని కరోలిన్ తెలిపారు.
