Author: admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణం, పెట్టుబడుల సాధన, యువతకు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పూర్తయింది. కాగా, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారని టీడీపీ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపింది. ఈ నాలుగు రోజుల పర్యటనలో క్షణం తీరిక లేకుండా ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారని పేర్కొంది. ఈమేరకు సీఎం చంద్రబాబు కలిసిన ప్రఖ్యాత సంస్థల అధినేతలు, ఆయన జరిపిన చర్చల వివరాలను ఈ పోస్ట్ లో తెలిపింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. నాలుగు రోజుల టూర్‌లో క్షణం తీరిక లేకుండా ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో…

Read More

అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల ‌ఏపీ సీఎం చంద్రబాబను డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించి నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ సీఎం రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా…

Read More

భారతదేశానికి ఉన్న ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ప్రపంచానికి ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. చరిత్రలో తమిళనాడు పాత్ర దేశ ఐక్యతను, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడులో ఇటీవలి పురావస్తు పరిశోధనలు 5,300 సంవత్సరాల క్రితం ఇనుము వాడకాన్ని వెల్లడిస్తున్నాయి, ఇనుప యుగంలో భారతదేశం యొక్క ప్రారంభ పురోగతిని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇనుపయుగం తమిళనాడులోనే మొదలైందన్న స్టాలిన్ వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

Read More

ఇనుప యుగం (ఐరన్ ఏజ్) మొదట తమిళనాడులోనే ప్రారంభమైందని, 5,300 ఏళ్ల క్రితమే ఇక్కడ దానిని ఉపయోగించినట్లు శాస్త్రీయంగా నిరూపితమైనట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర పురావస్తు శాఖ ప్రచురించిన ‘యాంటిక్విటీ ఆఫ్ ఐరన్’ పుస్తకాన్ని తాజాగా ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడులో చేపట్టిన తవ్వకాలు, వాటిని విశ్లేషిస్తే వచ్చిన ఫలితాలను బట్టి తమిళనాడులో 5,300 ఏళ్ల క్రితమే పోత ఇనుము టెక్నాలజీ ఉంది. దీన్నిబట్టి క్రీ.పూ.4,000. నాటికి ఈ ప్రాంతంలో ఇనుప యుగం ఉందని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తవ్వకాల ద్వారా సేకరించిన వస్తువులను పుణెలోని ఓ పరిశోధనా సంస్థకు, ఫ్లోరిడాలోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థకు పంపించినట్లు తెలిపారు . ఆ వచ్చిన ఫలితాల ద్వారా ఈ విషయం వెల్లడైందని వివరించారు. జాతీయసంస్థల సాయంతో తవ్వకాల్లో దొరికిన వస్తువులకు రేడియో కార్బన్ డేటింగ్ ఎనాలిసిస్ చేయించామని సీఎం స్టాలిన్ తెలిపారు. వాటిని…

Read More

కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (డబ్ల్యూసీసీ) అడ్వైజరీ బోర్డు లో ఐసీసీ ఛైర్మన్ జై షాకు స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఈ ఇండిపెండెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్ డబ్ల్యూసీసీ సమావేశం జరగనుంది. ప్రస్తుత కెప్టెన్లు, మాజీ క్రికెటర్లు, పలు సంస్థల ప్రతినిధులు సహా పలువురికి అడ్వైజరీ బోర్డులో స్థానం కల్పించారు. భారత్ నుండి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాలకు స్థానం కల్పించారు.

Read More

చెస్ యువ కెరటం గుకేష్ దొమ్మరాజు తాజా ఫిడే ర్యాంకింగ్స్ లో 2784 రేటింగ్ పాయింట్లతో అత్యుత్తమ భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా ‌నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో భారత్ తరపున మెరుగైన ర్యాంకులో ఉన్న అర్జున్ ఇరిగేశి (2779.5 పాయింట్లు)ని అధిగమించాడు. 2024 సెప్టెంబర్ నుండి అర్జున్ ర్యాంకింగ్స్ లో భారత్ తరఫున మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ఇటీవల డిసెంబర్లో డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ తాజాగా టాటా స్టీల్ చెస్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇక ఫిడే ర్యాంకింగ్స్ లో నార్వే దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (2832.5) అగ్రస్థానంలో ఉన్నాడు. అమెరికా ప్లేయర్లు హికరు నకముర (2802), ఫాబియానో కరువానా (2798) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Read More

ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రతిష్టాత్మక గిన్నిస్ రికార్డును సాధించింది. వాంఖడే స్టేడియం 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఎంసీఏ 14,505 రెడ్, వైట్ బాల్స్ తో “ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం” అనే వాక్యాన్ని రూపొందించింది. ఇలా ప్రపంచంలో క్రికెట్ బాల్స్ తో రూపొందించిన పెద్ద సెంటెన్స్ ఇదే. 14505 బంతులతో ఈ వాక్యాన్ని నిర్మించి ముంబయి క్రికెట్ సంఘం గిన్నిస్ రికార్ ఫీట్ సాధించింది. వాంఖడే స్టేడియంలో మొదటి టెస్టు మ్యాచ్ జరిగి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు మాజీ ముంబయి ఆటగాడు ఏక్నాథ్ సోల్కర్ కు అంకితమిస్తున్నాం. ఈ వాక్యాన్ని నిర్మించడానికి ఉపయోగించిన బంతులను పాఠశాల క్రికెటర్లకు, క్లబ్స్, ఎన్టీవోలకు అందజేయనున్నట్లు ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ తెలిపారు. 1975, జనవరి 23 నుండి 29 వరకు భారత్-వెస్టిండీస్ మధ్య వాంఖడేలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. ఈ టెస్టులో…

Read More

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలవడం సంతోషంగా ఉందని ఎడ్గర్ పాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని ఆ గ్రామంలోని ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన వధువు తండ్రి పోలీసుల సహాయం కోరాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళిత వర్గానికి చెందిన విజయ్ రేగర్‌కు లావెరా గ్రామానికి చెందిన దళిత మహిళ అరుణతో పెళ్లి నిశ్చియమైంది. దళిత వరుడు గుర్రంపై ఊరేగడంపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారు వ్యతిరేకం వ్యక్తం చేశారు. దీంతో వధువు అరుణ కుటుంబం ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో మానవ్ వికాస్ అవమ్ అధికార్ కేంద్ర సంస్థాన్ ద‌కార్యదర్శి రమేష్ చంద్ బన్సాల్ సహా స్థానిక కార్యకర్తలను అరుణ తండ్రి నారాయణ్ కలిశాడు. వారి సహాయంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ…

Read More

బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, స్టార్ హీరోయిన్‌ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. తాజాగా ముంబయిలో దీని ట్రైలర్‌ రిలీజ్ వేడుక జరిగింది. అందులో రష్మిక రిటైర్మెంట్‌ గురించి సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ‘‘ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఒక నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అని దర్శకుడితో ఒక సందర్భంలో చెప్పాను. అంత గొప్ప పాత్ర ఇది. షూటింగ్‌ సమయంలో ఎన్నో సార్లు భావోద్వేగానికి గురయ్యా. ట్రైలర్‌ చూశాక కూడా ఎమోషనల్‌ అయ్యా. విక్కీ కౌశల్‌ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌ నన్ను సంప్రదించినప్పుడు ఆశ్చర్యపోయా. ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్‌…

Read More