Author: admin

మ్యాడ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘8 వసంతాలు’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మధురం, మను లాంటి బ్యూటిఫుల్ సినిమాలు తీసిన ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుద‌లైంది. ఈ టీజర్ చూస్తుంటే.. ఒక బ్రేకప్ స్టోరీకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఫణింద్ర నరిశెట్టి తనదైన డైలాగ్స్ తో సినిమాని నడిపిస్తాడని అర్థమైపోతుంది టీజర్ చూస్తుంటే. టీజర్లోనే ప్రేమ, బ్రేకప్ కి సంబంధించి పలు డైలాగ్స్ ఉన్నాయి. టీజర్ లో అన్నీ రివర్స్ షాట్స్ తో అందంగా ఆహ్లాదంగా చూపించారు. టీజర్ 1 అంటూ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఇంకో టీజర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. https://youtu.be/Wp7emkCa50o?si=7l4LFlqFHvABhyxp

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజైన నేడు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. నష్టాల్లో కొనుగోళ్ల మద్దతు లభించినా తరువాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆద్యంతం ఒడిదుడుకుల్లో కదలాడి నష్టాలతో ముగించాయి. దీంతో వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ వేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 329 పాయింట్లు నష్టపోయి 76, 190వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో 23,092 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.25గా కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ లో టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024 ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. కాగా ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్ కు కూడా స్థానం దక్కలేదు. గత వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ నుండి కనీసం ఒక్కరు కూడా ఐసీసీ టీమ్ లో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కు కెప్టెన్ గా శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంకను ఎంపికయ్యాడు. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024: చరిత్ అసలంక (కెప్టెన్)- (శ్రీలంక), సయామ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మనుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్థాన్), పథుమ్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్) (శ్రీలంక), షెర్ఫానే రూథర్ ఫర్డ్ (వెస్టిండీస్) అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్) వనిందు హసరంగ (శ్రీలంక) షహీన్ షా అఫ్రిది(పాకిస్థాన్) హరీస్ రవూఫ్ (పాకిస్థాన్) అల్లా మహ్మద్ ఘజన్ ఫర్(ఆఫ్ఘనిస్థాన్).

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి టెండర్ల ప్రక్రియను ఈనెలాఖరులోపు పూర్తిచేసి వచ్చే నెల రెండోవారంలో పనులు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందని మండిపడ్డారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైనట్లు వివరించారు. రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. మొత్తం 40 పనులకు ఇప్పటి వరకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలో టాప్-5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫోస్టర్ చేత చేయించినట్లు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేశారు. తమపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలను ఆపేసిందని ఆక్షేపించారు.

Read More

యశ్‌ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ‘టాక్సిక్‌’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారంటూ ఎంతో మంది కథానాయికల పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.ఈ ప్రాజెక్టులో నయనతార భాగమైనట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్‌ ఒబెరాయ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం నేను రాకింగ్‌ స్టార్‌ యశ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా.దీనిలో నయనతార కూడా భాగమయ్యారు.ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడించకూడదు.త్వరలోనే గీతూ మోహన్‌ దాస్‌ ఓ ప్రకటన చేస్తారు. అప్పటి వరకు వేచిచూడండి’’ అని అక్షయ్‌ అన్నారు.నయనతార ఏ పాత్రలో కనిపించనున్నారనే దానిపై స్పష్టత లేదు.

Read More

ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనివల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌కు సూచించింది.ప్రతిచోటా అనుసరిస్తున్న టీడీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆయన తరఫున మరో లాయర్‌ అశ్వినీ దూబే ఈ వ్యాజ్యాన్ని వేశారు. టీడీఎస్‌ విధానం సమానత్వపు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఎలాగైనా దీన్ని రద్దు చేయాలని కోరారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ వ్యాజ్యాన్ని తాము విచారణకు స్వీకరించలేమని…

Read More

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ వెబ్‌ ప్రాజెక్ట్‌తో బిజీగా మారిన న‌టి స‌మంత‌. విడుదల తర్వాత రిలాక్సేషన్‌ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత బిజీగా మారిపోయారు. వరుస ఈవెంట్స్‌లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. జీవితంలో ప్రతి దాన్ని చివరిదిగా భావించే దశలో తాను ఉన్నానని సామ్‌ తాజాగా తెలిపారు.ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఇందులో సామ్‌ మాట్లాడుతూ.. సాధారణంగా ఉండే సినిమాలను ఎన్నో అంగీకరించొచ్చన్నారు.తాను మాత్రం కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటినే ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు.వంద శాతం నమ్మితేనే ఆ పాత్రలను చేస్తానని, లేకపోతే చేయలేనని తెలిపారు.సవాలుగా అనిపించే పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించారు.రాజ్‌ అండ్‌ డీకే ఎక్కువగా సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారని…వారితో వర్క్‌ చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని సామ్‌ చెప్పుకొచ్చారు. గొప్ప సినిమాలో నటించాననే ఫీల్‌ రాకపోతే వర్క్‌ చేయలేనని సామ్‌ వివరించారు.

Read More

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నాయకుడు మనీశ్‌ సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను తిహాడ్‌ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసిందని ఆరోపించారు.ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.నేను జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నానని భాజపాకు అర్థమైంది. నా భార్య అనారోగ్యంగా ఉందని,కుమారుడు చదువుకుంటున్నాడనీ తెలుసు.అప్పుడు వాళ్లు నాకు ఓ అల్టిమేటం ఇచ్చారు.అరవింద్‌ కేజ్రీవాల్‌ ను వదిలేయ్‌.. లేదా జైల్లోనే మగ్గిపో’ అని చెప్పారు.నేను బీజేపీ చేరితో ఆప్‌ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తామని చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఆ ఆఫర్‌కు అంగీకరించకపోతే సుదీర్ఘకాలం జైల్లోనే ఉండేలా చేస్తామని భాజపా బెదిరించింది’’ అని సిసోదియా ఆరోపించారు.

Read More

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుండి భారత్ చేరుకున్న ఆయన నేరుగా నేడు ఢిల్లీకి చేరుకున్నారు. నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు ఈసమావేశం జరిగింది.ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ఆర్థిక సహకారం, వైజాగ్ స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు సహా రాష్ట్రం తరఫున విజ్ఞప్తులను కేంద్ర మంత్రి ముందు ఉంచినట్లు సమాచారం. ఇక అనంతరం సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Read More

అటవీ శాఖలో సమూల సంస్కరణలకు డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.గత ఆరు నెలలుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై పూర్తి స్థాయిలో దృష్టి నిలిపి, గ్రామీణ పాలన, క్షేత్రస్థాయి పర్యటనలు, అభివృద్ధి, సంస్కరణలతో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ తాజాగా అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్. మరియు హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు.అటవీ భూముల పరిరక్షణ కోసం కఠిన చర్యలు, ఎర్ర చంద్రనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం, అటవీ ఉత్పత్తుల ఆదాయం పెంపు దిశగా ప్రణాళికలు, వన్యప్రాణుల సంరకణకు ప్రాధాన్యత, అటవీ శాఖ సిబ్బంది కొరత తీర్చడం, కలప ద్వారా ఆదాయ వనరుల వృద్ధి వంటివాటిపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించనున్నారు.

Read More