దక్షిణ తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం తెల్లవారుజామున 12:17 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది.రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది.చియూయ్ కౌంటీ హాల్‌కు ఆగ్నేయంగా 38 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.ఈ భూకంపం ధాటికి చియూయ్,తైవాన్ నగరాల చుట్టూ స్వల్పస్థాయిలో నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలో 27 మందికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొంది.వారందరినీ ఆసుపత్రులకు తరలించినట్లు తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది. మరణాలకు సంబంధించిన ఇప్పటి వరకూ ఎలాంటి నివేదికలూ లేవు.
Author: admin
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆప్‌కు చెందిన నలుగురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఇద్దరు కౌన్సిలర్‌లు రేఖా రాణి ,శిల్పా కౌర్ ఉన్నారు. రేఖా రాణి భజన్‌పుర నుంచి, శిల్పా కౌర్ ఖ్యాలా నుంచి ఆప్ కౌన్సిలర్‌లుగా ఎంపికయ్యారు. మిగతా ఇద్దరిలో ఆప్ మాజీ ఎమ్మెల్యే శ్రీదత్ శర్మ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు పార్లమెంటరీ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఛౌదరి విజేంద్ర ఉన్నారు. శ్రీదత్ శర్మ 2015 నుంచి 2020 వరకు ఢిల్లీలోని ఘోండా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. వీరంతా బీజేపీ నేతలు హర్ష్ మల్హోత్రా, మనోజ్ తివారీ, కమల్‌జీత్ సెహ్రావత్ సమక్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో…
టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య ఖైరతాబాద్ ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లారు.తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి ఆయన ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లడం జరిగింది.అక్కడ ఆయన ఆర్‌టీఏ జాయింట్ కమిషనర్ రమేశ్‌ను కలిశారు.అనంతరం రవాణా శాఖ అధికారులు చైతూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేశారు.విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. చైతూ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ఆయన ‘తండేల్’ మూవీలో నటిస్తున్నారు. రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రానికి చందూ మొండేటి డైరెక్టర్.హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, టీజర్, పోస్టర్లు ‘తండేల్’పై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కాసేపటి క్రితం ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.కాగా ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేసి,తీవ్రంగా గాయపరిచాడు.దీంతో ఐదు రోజుల పాటు లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు.సైఫ్ కోలుకోవడంతో ఈరోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.ఇక సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని ముంబయి పోలీసులు ఆదివారం నాడు థానేలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా పోలీసులు గుర్తించారు.అయితే అతడు తన పేరు మార్చుకుని, అక్రమంగా ఇండియాలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల అధికారులు సైఫ్ నివాసాన్ని సందర్శించి క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేశారు.
ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై ట్రేడ్ టారిఫ్ లు విధించనున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నేల చూపులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,235 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 299 పాయింట్ల నష్టంతో 23,045 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61గా కొనసాగుతోంది. ఐటీసీ, హిందూస్తాన్ యూనీలివర్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీ షేర్లు లాభాలతో ముగిశాయి.
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.నేడు గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.దీంతో జనవరి 19 రాత్రి నుంచి పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 14కి చేరిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ రహిత భారత్ దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొని ఊపిరితో ఉందన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ. మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక ముందడుగని అన్నారు. సీ.ఆర్.పీ.ఎఫ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ కు చెందిన బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు అమిత్ షా స్పందించారు.
ఎక్కువ రోజుల పాటు సిమ్ కార్డును రీఛార్జి చేసుకోకుండా వినియోగించకుండా ఉంటే అది రద్దై వేరేవారికి కేటాయించబడుతుంది. పెరిగిన ధరలతో ఇలా ఎంతోమంది వారి వద్ద ఉన్న కొన్ని నెంబర్లను వదిలేసుకుని ఉంటారు. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకొచ్చిన నిబంధనలతో మీ సిమ్ కార్డ్ ను నెలకు రూ 20 తో రీఛార్జి చేసుకుని మీరు వినియోగించుకోవచ్చు. ఎంతోమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్ ను వాడకుండా ఉంటే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుండి రూ.20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (వి.ఐ), బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో రూ.20తో…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీలను ప్రకటిస్తున్నాయి. ఇక ఇదివరకే ‘సంకల్ప పత్రా’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణులకు రూ.21వేల ఆర్థికసాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను రూ.500కే ఇస్తామని తెలిపారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఇక నేడు తాజాగా మరో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈమేరకు ‘సంకల్ప పత్రా’ పార్ట్-2ను బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలుచేస్తామని అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని బీజేపీ తెలిపింది. భీమ్ రావ్ అంబేడ్కర్…
ఏదైనా మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు నెట్వర్క్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అందరూ ఏదో ఒక సమయంలో అనుభవించి ఉంటారు. మనం వినియోగించే నెట్వర్క్ తాలుకు సిగ్నల్ లేకపోయినా వేరొక నెట్వర్క్ నుండి సిగ్నల్ ను వినియోగించుకునే సదుపాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు టెలికాం డిపార్ట్మెంట్ (డాట్) ప్రకటించింది. దీని ద్వారా.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు.. తమ సొంత సెల్యులార్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ.. ఇతర టెలికం నెట్వర్క్లను వినియోగించుకుని 4జీ సేవలను పొందొచ్చు. డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్) కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. టెలికం యాక్ట్-2023 కింద భారత ప్రభుత్వం ఈ డీబీఎన్ ను ఏర్పాటు చేసింది. ఐసీఆర్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ‘టెలికం సర్వీస్ ప్రొవైడర్లయిన బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో సంస్థలు…
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన వరుస సమావేశాలతో ఆయన బృందం బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నేడు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మీ అందర్నీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్‌లో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్‌లో అన్ని రంగాలను అభివృద్ధి చేశాం. ఇంటర్నెట్, ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలు ప్రవేశపెట్టానని ఆయన పేర్కొన్నారు. నేను ప్రతి సారీ తప్పకుండా దావోస్ వస్తున్నా. గ్లోబల్ గా వస్తున్న కొత్త డెవలప్మెంట్స్ ఏంటి , వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి లాంటివి ఇక్కడ నేర్చుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. పలువురు ప్రముఖు పారిశ్రామిక వేత్తలను ఆయన కలిశారు.
