పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు . కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టిపెట్టారని ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి రావాలని తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు. ఈ సంస్థ ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ. చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సి.ఈ.ఓ. టి.జి.విశ్వప్రసాద్ తెలియచేశారు. ‘వాహన తయారీ, ఆర్. అండ్ డి. కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలాంటివి ఇందులో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈ.వి. పార్కు. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి…
Author: admin
ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలి. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు . ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుంది. అయితే ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్ లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ చర్యలు, శాఖపరమైన విచారణలకు సంబంధించినవి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అంశంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది, ఆర్.డబ్ల్యూ.ఎస్., అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల…
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన కూడా చేశారు. కాగా, దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన తెలుగులో తన పోస్ట్ చేశారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని ఈ చర్య చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో, ఈ కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు…
రెండేళ్ల క్రితం వైట్ హౌస్ పై ట్రక్కుతో దాడి చేసేందుకు ప్రయత్నించిన భారత సంతతి వ్యక్తి సాయి వర్షిత్‌కు 8 ఏళ్ల జైలుశిక్ష పడింది.2023, మే 22వ తేదీన 20 ఏళ్ల కందుల సాయి తన వద్ద ఉన్న ఓ ట్రక్కుతో వైట్‌హౌజ్‌పై దసూకెళ్లిన విషయం తెలిసిందే.ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూల్చి…నియంతృత్వ నాజీ ఐడియాలజీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కందుల సాయి ఆ దాడి చేసినట్లు న్యాయశాఖ పేర్కొన్నది.
కర్ణాటకలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి.నిన్న బీదర్‌లో ఏటీఎం సెంటర్‌కు డబ్బులు తరలిస్తున్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే తాజాగా దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ పట్టణంలో పట్టపగలే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు.కో ఆపరేటివ్ బ్యాంకులో చొరబడ్డ ఐదుగురు వ్యక్తులు భారీగా బంగారం,నగదును ఎత్తుకెళ్లారు.తుపాకులతో బ్యాంకు లోకి వచ్చిన వ్యక్తులు సిబ్బందిని బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. రూ. 15 కోట్ల విలువైన బంగారం, రూ. 5 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.దోపిడీ అనంతరం వాళ్ళు మంగళూరు వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.అయితే వారి వద్ద ఉన్న తుపాకులు చూసి భయపడి దొంగలను వెంబడించ లేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిశాయి. వివిధ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీల జోరు తగ్గింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 423 పాయింట్లు నష్టపోయి 76,619 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 23,203 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61గా కొనసాగుతోంది. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జొమాటో, నెస్లే ఇండియా, రిలయన్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ కింద ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే విధంగా తమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈక్రమంలో ప్రధాని మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్ లేఖ రాశారు. దేశ రాజధాని పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కు 50 శాతం టికెట్ రాయితీని అమలుచేయాలని ప్రతిపాదించారు. రాయితీ కారణంగా పడే భారాన్ని రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం సగం సగం భరించాలన్నారు. ఢిల్లీ విద్యార్థులకు సంబంధించి ముఖ్యమైన విషయాన్ని దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలకు వెళ్లి వచ్చే క్రమంలో విద్యార్థులు మెట్రోపై ఆధారపడుతున్నారు. వారిపై ఆర్థిక భారం తగ్గించేందుకు 50 శాతం రాయితీ అందించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళా ప్రయాణికులు…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.ఈ మేరకు బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. సంకల్ప పాత్ర-1 పేరుతో బీజేపీ విడుదల చేసింది. మహిళా సమృద్ధి యోజన పేరుతో మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇవ్వనుంది.కాగా పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ.హోలీ,దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్,గర్భిణీలకు రూ. 21000 ఇవ్వన్నట్లు ఎన్నికల మేనిఫెస్టో పేర్కొంది.
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్-యూజీని ప్రస్తుతానికి ఆఫ్ లైన్లోనే నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర విద్య, వైద్యశాఖల మధ్య విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం ప్రకారం నీట్-యూజీని ఆఫ్ లైన్ విధానంలో ఓఎమ్మార్ షీట్లతో ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది. గత ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని సంస్కరించేందుకు ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన పలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
