Author: admin

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం ఇవ్వాలని మంత్రివర్గ నిర్ణయం ధాన్యం కొనుగోలు కోసం రూ.700 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై చర్చ గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చ ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదన కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు…

Read More

క్రీడలలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాల ప్రదానం నేడు జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ క్రీడాకారులకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో షూటింగ్ లో డబుల్ ఒలింపిక్ పతకాల విజేత షూటర్ మను బాకర్, చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు, హాకీ స్టార్ హార్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ ఈ పురస్కారాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పారా అథ్లెటిక్స్ లో దీప్తి జివాంజీ, అథ్లెటిక్స్ లో జ్యోతి యర్రాజీ పురస్కారాలు అందుకున్నారు. వీరితో పాటు 32 మంది అర్జున అవార్డులు, ఐదుగురు ద్రోణాచార్య అవార్డులు, ఇద్దరు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. అర్జున అవార్డులు: జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు (బాక్సింగ్), ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్),హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్), సిమ్రాన్…

Read More

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనను ముంబయి పోలీసులు తీవ్రంగా పరిగణిస్తోన్న విషయం తెలిసిందే.దాడికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తోన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాంద్రాలోని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అతడిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు.దాడి చేయడానికి గల కారణమేమిటన్న కోణంలో విచారిస్తున్నారు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి ఘటన చోటుచేసుకుంది.సైఫ్,అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా..ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు.సైఫీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి

Read More

వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు పలు రంగాల్లో నూతన సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2016న ప్రవేశ పెట్టిన స్టార్టప్ ఇండియా పథకానికి నిన్నటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జనవరి 16ను కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టార్టప్ డే గా ప్రకటించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ లో ప్రపంచంలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో యునైటెడ్ కింగ్ డమ్, 3 వ స్థానంలో భారత్ ఉండగా..ఆ తర్వాతి స్థానాల్లో కెనడా, జర్మనీలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డి.పి.ఐ.ఐ.టి) గణాంకాల ప్రకారం ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.59 లక్షల స్టార్టప్ లు గుర్తింపు పొందాయి. కేంద్రం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా మనదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా తీర్చిదిద్దింది. ప్రత్యక్షంగా ఈ స్టార్టప్లు దాదాపు…

Read More

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో వివిధ దేశాల దిగ్గజ ఆటగాళ్లను మరోసారి మైదానంలో చూసే అవకాశం క్రికెట్ ప్రేమికులకు రానుంది. పలువురు దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్ ఆడబోతున్నారు. ఈ ఏడాది జరిగే ఆరంభ సీజన్లో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు బరిలో దిగబోతున్నాయి. వచ్చే నెల 22 నుండి మార్చి 16 వరకు భారత్ లోనే మొదటి సీజన్ జరగనుంది. నవీ ముంబయి, రాజ్ కోట్, రాయ్ పూర్ మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. ఈ సీజన్ లో తలపడే భారత్ కు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ కు బ్రియాన్ లారా, శ్రీలంకకు సంగక్కర, సౌతాఫ్రికాకు జాక్వస్ కలిస్, ఇంగ్లాండ్ కు మోర్గాన్, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

Read More

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB29.మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి.వివాహం తర్వాత లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటోన్న ఆమె తాజాగా హైదరాబాద్‌ చేరుకున్నారు. మహేశ్‌- రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసమే హైదరాబాద్‌కు వచ్చారని పలువురు మాట్లాడుకుంటున్నారు.ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్‌ మీడయాలో షేర్‌ అవుతున్నాయి.

Read More

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్‌ నిర్వాహకులపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబోలో ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. దీని పైరసీ కాపీనీ ఏపీలో ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయడంతో కేసు నమోదైంది.ఈమేరకు గాజువాక పోలీసులు, సైబర్‌ క్లూస్‌ టీమ్‌ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.పలువురిని అరెస్టు చేశారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపుదిద్దుకుంది.కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మించారు.ఎన్నో అంచనాల మధ్య జనవరి 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే దీనిని పైరసీ చేసిన కొంతమంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో పెట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకుని సైబర్‌ క్రైమ్‌ టీమ్‌కు ఫిర్యాదు చేసింది.

Read More

భారత క్రికెట్ కు దాదాపు రెండు దశాబ్దాలకు చేరువగా సేవలందిస్తూ ప్రపంచ క్రికెట్ లోనే మేటి బ్యాటర్లుగా పేరున్న క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తిరిగి ఫామ్ అందుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో ఆడడం మంచిదని పలువురు భావిస్తున్నారు. మాజీ భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఇదే సలహా ఇచ్చాడు. ప్రతి ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. ఫామ్ లో లేకపోతే గాయపడకుండా ఉంటే కచ్చితంగా దేశవాళీలో ఆడాలి. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇదెంతో ముఖ్యమని యువరాజ్ అన్నాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన సిడ్నీటెస్టులో ఆడకూడదని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఈ యువీ సమర్థించాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీ లో భారత్ అందుకున్న ఘనతలను ప్రస్తావించాడు. రోహిత్ సారథ్యంలో టీ20ప్రపంచకప్ గెలిచింది. వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరింది. అలాంటి ఆటగాడు మరొక ఆటగాడికి…

Read More

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిష్‌, జ్యోతికృష్ణ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈసినిమా నుంచి తొలి పాట విడుదలైంది.‘మాట వినాలి గురుడా మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్‌ కల్యాణ్‌ ఆలపించారు.ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. https://youtu.be/y4Rp45vN2O0?si=KYO78CM-rFppaXB9

Read More

ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని చంద్రబాబు ప్రభుత్వం పై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆమె తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ?…

Read More