Author: admin

రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే 200రూపాయల(200 rupees) నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చర్యలు తీసుకోబోతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బిఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది.పెద్ద నోట్ట వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బిఐ భావిస్తోంది.చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇదే నిజమే అనిపిస్తుంది.ఒక్కప్పుడు రూ. 10వేల నోటు కూడా ఉండేదట.కాలక్రమేణ అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసిందట. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే 2,000, 1,000, 500 నోట్ల రద్దు జరిగింది. 2016 నవంబర్ లో రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో 2000వేల నోటును తీసుకువచ్చింది. అయితే రూ. 2వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్బిఐ…

Read More

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుండి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె సాధించిన ఘనత పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అవడం డిస్టింక్షన్లో పాసై తమను గర్వపడేలా చేశావని ఆనందం వ్యక్తం చేశారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అని దీవిస్తూ భార్య భారతి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, జగన్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఈ నెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన సతీమణి భారతి రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

Read More

ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-15, 21-13 తేడాతో జపాన్ కు చెందిన మనామి సుయిజు పై గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం సింధు ఆధిపత్యం కనబరిచింది. వరుస గేమ్లల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించి కొత్త సంవత్సరం మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కిరణ్ జార్జ్ 22-20, 21-13తో ఫ్రాన్స్ కు చెందిన అలెక్స్ లేనియర్ పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ కూడా క్వార్టర్స్ చేరింది. 20-22, 21-14, 21-16తో జపాన్ కు చెందిన మిత్సుహాషి-ఒకమురాపై విజయం సాధించింది.

Read More

ఇటీవల వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు భారత జట్టుపై విమర్శలకు కారణమయ్యాయి. న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్టు సిరీస్, బోర్డర్- గావస్కర్ సిరీస్ ఓటముల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా సితాన్షు కోటక్ ను బీసీసీఐ తాజాగా నియమించింది. త్వరలో ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్, ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 52 ఏళ్ల ఈ సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సుదీర్ఘ కాలంగా నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లలో భారత సీనియర్, ‘ఎ’ జట్ల పర్యటనల్లో కోచ్ గానూ వ్యవహారించాడు. గతేడాది ఐర్లాండ్ పర్యటనలో టీన్ఇండియా ప్రధాన కోచ్ గా ఉన్నాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 8 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలున్నాయి.

Read More

ఇస్రో నిర్వహించిన పరీక్షలో ఆలిండియా 9 ర్యాంకు సాధించి సైంటిస్ట్‌గా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్ అనే యువకుడిని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. డ్రైవర్‌గా పని చేస్తూ తండ్రి శ్రీనివాసులు, టైలర్‌గా పనిచేస్తూ తల్లి రామలక్ష్మి తమ కుమారుడిని ఈ స్థాయికి తేవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ మిషన్ టీమ్‌లో ఒకరిగా పనిచేసిన రమేష్, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఈసందర్భంగా సీఎం ఆకాంక్షించారు.

Read More

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లి లోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నితీష్ ను మంత్రి లోకేష్ అభినందించారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు నితీష్ స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ చాలా బాగుందని తెలిపారు. అందులో క్రికెట్ ను కూడా చేర్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని లోకేష్ ను కోరారు. త్వరలోనే అందరితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు.నితీష్ తో పాటు ఆయన తండ్రి కూడా లోకేష్ ను కలిశారు.

Read More

తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడు తమిళ అగ్ర నటుడు అజిత్ హీరోగా దర్శకుడు మగిజ్ తిరుమేని తెరకెక్కించిన చిత్రం ‘విదాముయార్చి’. అర్జున్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు.చిత్ర బృందం ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది. అజిత్ నటన విజువల్స్, డైలాగ్స్ పోరాట సన్నివేశాలు చిత్రంపై ఆసక్తి పెంచేలా ఆకట్టుకునే విధంగా ట్రైలర్ రూపొందించారు.ఈ చిత్రానికి తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సంక్రాంతికే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న చిత్ర బృందం అనూహ్యంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. https://youtu.be/upA4QCsrAKE?si=vP7v0d1GQAbDcT1C

Read More

2002లో జ‌రిగిన గోద్రా రైలు ఘ‌ట‌న‌పై.. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు తెలిపింది.గుజ‌రాత్ ప్ర‌భుత్వంతో పాటు అనేక మంది దాఖ‌లు చేసిన పిటీష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది.ఈ కేసు విచార‌ణ‌కు మ‌రో తేదీని ఇవ్వ‌బోమ‌ని జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి,అర‌వింద్ కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తెలిపింది.2002, ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన స‌బ‌ర్మ‌తి రైలుకు చెందిన ఎస్-6 బోగీలో చెల‌రేగిన మంట‌ల్లో సుమారు 59 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు.ఆ కేసులో 2017లో గుజ‌రాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ అనేక మంది సుప్రీంలో అప్పీల్ చేసుకున్నారు.జీవిత ఖైదు శిక్ష ప‌డిన 11 మంది నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని కోరుతూ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గుజ‌రాత్ స‌ర్కారు సుప్రీంను ఆశ్ర‌యించింది. అయితే గురువారం విచార‌ణ స‌మ‌యంలో ఓ నిందితుడి త‌ర‌పున లాయ‌ర్ హాజ‌ర‌య్యారు.కానీ ఆధారాలు స‌మ‌ర్పించ‌లేక‌పోయారు. గ‌త ఏడాది నుంచి ఈ కేసును ఇప్ప‌టి అయిదు సార్లు వాయిదా వేశాన‌ని, ఇక మ‌ళ్లీ…

Read More

తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’. వీరిద్దరూ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకుడు. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తాత – మనవడు నేపథ్యంలో తెరకెక్కే ఈ కథ తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. https://youtu.be/MDWJMV7M5M4?si=uaZOY5_bkj1zC_oD

Read More

విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.ప్రస్తుతం విశ్వక్, రామ్ నారాయణ్ కాంబోలో ‘లైలా’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.అయితే ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఫిబ్రవరి వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ‘లైలా’ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు.తాజాగా సంక్రాంతి సందర్భంగా ‘లైలా’ నుంచి డబుల్ అప్డేట్‌ ఇచ్చారు. జనవరి 17న టీజర్ విడుదల కానుందని తెలిపారు.విశ్వక్ అమ్మాయి గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.ఇందులో ఆయన అచ్చం అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. https://youtu.be/6uxlc42N4S4?si=v3Jw1SxFiqKDtIIv

Read More