Author: admin

తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బ్రిటిష్ వారిపై రాజీలేని పోరాటం చేసిన వడ్డే ఓబన్న లాంటి పోరాట యోధుల చరిత్ర నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారు. కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా వడ్డే ఓబన్న పోరాడారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో  ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందామని పేర్కొన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశం లోనే తొలిసారిగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాలపై స్కిల్ డెవలప్ మెంట్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన నైపుణ్య గణన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని మరింత అర్థవంతంగా, సులభతరంగా రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా మన యువత అందిపుచ్చుకునే విధంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయా దేశాల భాషలు అభ్యసించేలా కోచింగ్ ఇవ్వాలని సూచించారు. స్కిల్ సెన్సెస్ పూర్తయ్యాక యువతను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఈరోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా, పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్‌ ప్రాజెక్టు పవర్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ చేశారు.ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్‌ పవర్‌, సౌర విద్యుత్‌, హైడల్‌ పవర్‌ యూనిట్స్ ఉన్నాయి. ఈమేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడ బుక్ ఫెయిర్ లో డిప్యూటీ సీఎం విజయవాడ బుక్ ఫెయిర్ ను డిప్యూటీ సీఎం పవన్ ఉదయం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు బుక్ స్టాల్ కి వెళ్ళి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ లో పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించి కొనుగోలు చేశారు.

Read More

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని, సమన్వయ లోపం లేకుండా లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అధికారులకు ఈసందర్భంగా దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలను రద్దు చేశారు. పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. 1995-2004తో పోల్చుకుంటే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిందని ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని సూచించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుదామని కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read More

దేశంలో కోట్లాది మంది హిందువుల స్వప్నం సాకారమైన రోజు నేడు. అయోధ్యలో రామమందిరం నిర్మితమై బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అయోధ్యలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల త్యాగం, తపస్సు మరియు పోరాటాల తర్వాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం. ఈ దివ్యమైన మరియు గొప్ప రామాలయం అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సంకల్పాన్ని సాధించడంలో గొప్ప ప్రేరణగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇక గత ఏడాది 22 జనవరి 2024 రోజు కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్య మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూర్మద్వాదశి…

Read More

హైదరాబాద్ నుండి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారి ప్రయాణం సమయం కొంతమేరకు తగ్గనుంది. హైదరాబాద్ నుండి వస్తున్న వాహనాలను నిన్నటి నుండి విజయవాడ సమీపంలో నిర్మించిన వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటి వరకు వెహికల్స్ విజయవాడ లోపల నుండి వెళ్తున్నందున, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కోసారి 2-3 గంటల సమయం పడుతుంది. ఇకపై ఈ కష్టాలు తీరి కొద్దిగా ఉపశమనం లభించనుంది. విజయవాడ శివారులోని గొల్లపూడి నుండి చిన్నఅవుటపల్లి వరకు 30 కి.మీ. మేర కొత్తగా ఆరు వరుసల బైపాస్ నిర్మాణానికి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. తాజాగా అధికారులు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో నిన్నటి నుండే రెండు వైపులా రాకపోకలకు అనుమతిస్తున్నారు. గొల్లపూడి- చిన్నఅవుటపల్లి మధ్య ప్రయాణం కేవలం గంటలోనే పడుతుంది. త్వరలోనే ఈ మార్గంలో పూర్తిస్థాయిలో వెహికల్స్…

Read More

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రెండు పాత్రల్లో నటించారు. ఆయన పోషించిన అప్పన్న పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కియారా అడ్వాణీ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.186 కోట్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇక ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో ‘గేమ్‌ ఛేంజర్‌’కు తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది.

Read More

నటి సమంత చికెన్‌ గున్యా బారినపడ్డారు.ప్రస్తుతం ఆమె దాని నుంచి కోలుకుంటున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సోషల్‌మీడియాలో సరదా పోస్ట్‌ పెట్టారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్‌ చేసిన ఆమె ‘చికెన్‌ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్‌ ఉంది’ అంటూ బాధతో కూడిన ఎమోజీలను పోస్ట్‌ పెట్టారు. ఇటీవల ‘సిటాడెల్‌ హనీ బన్నీ’తో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు.

Read More

ప్రభాస్‌ పెళ్లి గురించి సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పెళ్లి గురించి ప్రభాస్‌ స్నేహితుడు, నటుడు రామ్‌చరణ్‌ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. గేమ్‌ ఛేంజర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభాస్‌ పెళ్లి గురించి మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరం ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రభాస్‌ పెళ్లాడనున్నారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ జనవరి 14న ప్రసారం కానుంది. మరోవైపు ప్రభాస్‌ పెళ్లి గురించి టాపిక్‌ రావడంతో ప్రస్తుతం ఆయన పేరు ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

Read More

ఏపీ ప్రజలను ప్రధాని మోడీ దారుణంగా వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. హోదా ఇస్తామని మోసం చేశారు. మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు గురించి మాట్లాడలేదు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అలాంటి పార్టీతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను దారణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే జగన్‌ది అక్రమ సంబంధమని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల ఓట్లుతో గెలిచిన జగన్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీని నిరంతరం వ్యతిరేకించారని ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు…

Read More