Author: admin

ఇంగ్లాండ్ తో ఈనెల 22 నుండి జరుగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ జుట్టును ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. జట్టు లోకి భారత స్టార్ పేసర్ మహామ్మద్ షమీ ఈ సిరీస్ తో పునరాగమనం చేయనున్నాడు. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.

Read More

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తెలంగాణా సహా పలు ఇతర ప్రాంతాల నుండి తమ తమ సొంత ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల బస్సులు తీసుకొని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుండి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిట్ నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి ప్రజలను వాటి ద్వారా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రద్దీ తీవ్రంగా ఉన్న దారులలో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంత వరకు ఇబ్బందుల్లేకుండా ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖ అధికారులతో సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు…

Read More

గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ విజయంతో మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడను దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ కీలక చర్యలు వ్యాఖ్యలు చేశారు.అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు.మీడియా సమావేశంలో ‘ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా..? మీ నిర్ణయం ట్రంప్‌ గెలుపుకు దోహదపడిందని మీరు అనుకుంటున్నారా..? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు బదులిస్తూ…తాను అలా ఏమీ అనుకోవడం లేదన్నారు.తాను మొన్నటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓండిచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు.డెమోక్రటిక్‌ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్‌ స్పష్టం చేశారు.ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలదని తాను భావించినట్లు చెప్పారు.అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చినట్లు బైడెన్‌ చెప్పుకొచ్చారు.అందుకు కమలా సైతం…

Read More

గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానున్నట్లు వివరించారు. ఈ హైడ్రోజన్ తో ఫెర్టిలైజర్స్, కెమికల్స్ తయారవుతాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా తయారయ్యే వీటికి విదేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తిలో హైడ్రోజన్ వినియోగిస్తే వేడి బాగా తగ్గుతుందని తెలిపారు. రానున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు వాటి వలన ఏపీకి కలిగే ప్రయోజనాలు సీఎం చంద్రబాబు వివరించారు.

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్‌ గురించి,కాంగ్రెస్ నాయకురాలు,ఎంపీ ప్రియాంకాగాంధీ గురించి బీజేపీ నేత రమేశ్‌ బిధూరీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అతడినే బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించనుందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తెలిపారు.రాబోయే ఒకటి రెండు రోజుల్లో బీజేపీ తన సీఎం అభ్యర్థిగా రమేశ్‌ బిధూరీ పేరు అధికారికంగా ప్రకటించనున్నట్టు తమకు సమాచారం అందిందని కేజ్రీవాల్‌ తాజాగా ప్రెస్ మీట్ లో చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగనున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు.అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి.ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్‌ ఏమిటో వెల్లడించాలి.ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్‌ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 న జరగనున్నాయి.8వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి.

Read More

ఫీల్డ్ వర్క్ లో పాల్గొన్న విలేకర్లను ఉద్దేశించి తగిన సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.ఈ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. కారు దిగి నేరుగా జర్నలిస్ట్‌ల వద్దకు వెళ్లారు.అక్కడ ఉన్న జర్నలిస్ట్‌లతో మాట్లాడారు.ముందుగా వారందరికీ నూతన సంవత్సరం,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఈ చలికాలంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ సలహా ఇచ్చారు.అనారోగ్యం బారిన పడకుండా తలను కప్పుకోండి అంటూ సూచించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

Read More

డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే మరోసారి గవర్నర్‌పై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.గవర్నర్‌ అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండానే మధ్యలో వెళ్లిపోయారు.ఆయన తీరు చిన్న పిల్లల చేష్టల మాదిరిగా ఉంది.రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు.తమిళనాడు అభివృద్ధి చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం వ్యాఖ్యలు చేశారు.

Read More

రేపు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ యువతతో గడపనున్నారు.కాగా ఆయన దేశ యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ…ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన Xలో పోస్ట్ చేశారు.యువతతో వివిధ అంశాలపై చర్చించడంతో పాటు వారితో కలిసే భోజనం చేయనున్నారు.అయితే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 12న నేషనల్ యూత్ డే నిర్వహిస్తారు.దేశవ్యాప్తంగా 3వేల మంది ప్రభావశీలురైన యువతీ యువకులు హాజరు కానున్న సదస్సులో ప్రధాని ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు.రేపు ఉదయం 10 గంటలకు కొత్తదిల్లీలోని భారత్ మండపంలో వికసిత్ భారత్ యువనేతల సదస్సులో పాల్గొంటారు. A tribute to India’s Yuva Shakti! Tomorrow, 12th January, is a very special day as it is the Jayanti of Swami Vivekananda. On this occasion, I will spend the entire day with my young friends at…

Read More

నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని గతంలో కోర్టు షరతు విధించింది.అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు.దీనికి నాంపల్లి కోర్టు అంగీకారం తెలిపింది.మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది.

Read More

తెలంగాణ ప్రజలకు దిల్‌ రాజు క్షమాపణలు చెప్పారు.‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు తాజాగా వీడియో విడుదల చేశారు.అందరికీ నమస్కారం మొన్న‌ ఈ మధ్య నిజామాబాదులో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒక‌టి పెట్టాం మ‌ళ్లీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చేశాం. అంటే నిజామాబాద్‌తో నాకున్న అనుబంధం అలాంటిది నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేశాను.అయితే ఆ ఈవెంట్‌లో నేను మన కల్చర్‌లో ఉండే మన దావత్ గురించి మ‌ట‌న్ అలాగే తెల్ల క‌ల్లు గురించి సంబోధించాను.అయితే ఈ వ్యాఖ్య‌లు వివాదాస్పదం అవుతాయి అని అనుకోలేదు.తెలంగాణ మన కల్చర్ మన దావత్‌ని నేను మిస్ అవుతున్నాను.అందుకే అలా…

Read More