Author: admin

భారత పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కెరీర్ ఆసాంతం గాయాలతో బాధపడిన 35 ఏళ్ల ఈ జార్ఖండ్ బౌలర్ విజయ్ హజారే ట్రోఫీతో వీడ్కోలు పలికాడు.వేగంగా బౌలింగ్ చేయాలనే లక్ష్యమే ఈ 20 ఏళ్లు నన్ను నడిపించింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నా. అందరికి కృతజ్ఞతలని ఆరోన్ పేర్కొన్నాడు. 2010-11 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారానే వెలుగులోకి వచ్చిన ఆరోన్ జార్ఖండ్ కు ఆడుతూ గుజరాత్ తో జరిగిన ఫైనల్లో గంటకు 153 కి.మీ వేగంతో బంతి వేసి అందరి దృష్టిలో పడ్డాడు. 2011లో ఇంగ్లాండ్ తో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వెస్టిండీస్ పై మొదటి టెస్టు కూడా ఆడాడు. చివరిగా 2015లో సౌతాఫ్రికా పై టెస్టు, శ్రీలంకపై 2014లో ఆఖరి వన్డే ఆడాడు. అతడు 9 టెస్టులు వన్డేల్లో భారత్ కు ప్రాతినిధ్యం…

Read More

తగ్గుతున్న జనాభా విషయంలో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తుంది.అమ్మాయిలూ.. పిల్లల్ని కనండి.. మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం’ అంటూ విద్యార్థినులను వేడుకుంటున్నది. జపాన్‌, చైనా తరహాలోనే రష్యాలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య బాగా తగ్గిపోతున్నది.ఈ అంతరాన్ని తగ్గించడానికి పిల్లలను కనమంటూ ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు రష్యా కూడా అదే ప్లాన్ పాటిస్తుంది. 25 ఏళ్ల లోపు యువ విద్యార్థినులు బిడ్డకు జన్మనిస్తే వారికి 1,00000 రూబెల్స్‌ (సుమారు రూ.84,000) ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించినట్టు మాస్కో టైమ్స్‌ వెల్లడించింది.వారు కరేలియా వాసులై ఉండి స్థానిక విశ్వవిద్యాలయం, లేదా కళాశాలలో చదివిన వారై ఉండాలని నిబంధన పెట్టింది.

Read More

మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో మలేషియాకు చెందిన యూ సిన్ ఆంగ్- యి తియో జోడీపై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో భారత జోడీ ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగింది.

Read More

భారత మహిళా క్రికెట్ జట్టు సొంతగడ్డపై అప్రతిహతంగా విజయాలతో దూసుకుపోతోంది‌. ఈ క్రమంలో తాజాగా ఐర్లాండ్ పై జరుగుతున్న వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ విజయంతో ఈ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ 92 (129; 15×4), లీ పాల్ 59 (73; 7×4) మంచి ప్రదర్శన కనబరిచారు. భారత బౌలర్లలో ప్రియ మిశ్రా (2/56) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. లక్ష్య ఛేదనలో ప్రతీక రావల్ 89( 96 బంతుల్లో 10×4, 1×6) రాణించడంతో భారత్ 4 వికెట్లు కోల్పోయి 34.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తేజల్ హసబ్నిస్ 53 నాటౌట్(46; 9×4), కెప్టెన్ స్మృతి మంధాన 41 (29; 6×4, 1×6)…

Read More

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా “డాకు మహారాజ్‌”.ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.ఈ చిత్రంలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ చిత్రాన్ని నాగ వంశీ దీనిని నిర్మిస్తున్నారు.తమన్ ఈ చిత్రానికి సంగీతం వహిస్తున్నాడు. https://youtu.be/V0ARlFc_ndE?si=naGYjuAGGPdyX_mn

Read More

మదురై సమీపం తిరుప్పోరూరు కందసామి ఆలయం హుండీలో ఐఫోన్ జారిపడగా…యజమాని దానిని వేలం పాడి సొంతం చేసుకున్నాడు.తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.చెన్నై అంబత్తూరు వినాయకపురానికి చెందిన దినేష్‌ రెండు నెలల క్రితం ఆ ఆలయానికి వెళ్ళాడు.హుండీలో కానుక వేస్తుండగా అతడి జేబులోని ఐఫోన్‌ జారిపడింది.ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు.కానీ ఫలితం లేకపోయింది.హుండీలో పడిన కానుకలన్నీ దేవుడికే సొంతమని చెప్పారు.ఈ విషయాన్ని ఆయన దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు దృష్టికి వెళ్ళాడు.చివరకు హుండీలో పడిన వస్తువులను వేలం వేయాలనే ఆలయ నిబంధన ప్రకారమే దినేష్ ఐఫోన్‌ ఆలయ నిర్వాహకులు వేలం పాడారు.దినేష్‌ ఆ వేలంపాటలో పాల్గొని రూ.10వేలకు తన ఐఫోన్‌ని తిరిగి దక్కించుకున్నాడు

Read More

నటి నిధి అగర్వాల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.తన కెరీర్‌ గురించి మాట్లాడారు.2022లో విడుదలైన ‘హీరో’ తర్వాత దాదాపు మూడేళ్లపాటు కెరీర్‌లో గ్యాప్‌ రావడంపై ఆమె మాట్లాడారు.ఈ ఏడాదిలో రానున్న రెండు సినిమాలపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంతకం చేశా.ఆ సమయంలో కెరీర్‌ పరంగా ఎలాంటి గ్యాప్‌ లేదు.చిత్రీకరణ సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరాలు గడిచి పోయింది. వేరే చిత్రాలకు సంతకం చేయొద్దని టీమ్‌ నాతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది.‘రాజాసాబ్‌’లో అవకాశం వచ్చినప్పుడు ‘హరి హర వీరమల్లు’ టీమ్‌ను సంప్రదించా.అందులో భాగం కావాలనుకుంటున్నానని చెప్పా.వాళ్లు దానికి అంగీకరించారు.ఈ రెండింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నా.కెరీర్ గురించి ఆలోచించి బాధ పడిన సందర్భాలు ఉన్నాయి.ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో యాడ్స్ చేస్తున్నా. ’’ అని నిధి అగర్వాల్‌ తెలిపారు.పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ‘హరిహర వీరమల్లు’ సిద్ధమవుతోంది.క్రిష్‌,జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది.రెండు భాగాల్లో ఈ సినిమా…

Read More

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంపై పలు వెబ్‌సైట్స్‌ రాసిన రివ్యూలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన ఆమె చరణ్‌కు కంగ్రాట్స్‌ చెప్పారు.‘‘కంగ్రాట్స్‌ డియర్‌ హస్బెండ్‌.ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఒక గేమ్‌ ఛేంజర్‌. లవ్‌ యూ’’ అని పేర్కొన్నారు. హార్ట్‌ సింబల్స్‌ను జత చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపుదిద్దుకుంది.దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు దీనిని నిర్మించారు.అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.ఇందులో ‘నానా హైరానా’ పాటను ప్రస్తుతానికి తొలగించినట్లు టీమ్‌ తెలిపింది.సాంకేతిక కారణాల…

Read More

హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2025 శక్తివంతమైన పాస్ పోర్ట్ లో జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. 2024 ప్రకటించిన జాబితాలో 80వ స్థానంలో నిలవగా ఈ ఏడాది ఐదు స్థానాల కిందకు దిగింది. వరుసగా రెండోసారి సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, సౌత్ కొరియా మూడో స్థానంలో, నాలుగో స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, అయిదో స్థానంలో బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ నిలిచాయి. ఇక మన పొరుగున ఉన్న పాకిస్థాన్103, బంగ్లాదేశ్ 101 స్థానాల్లో నిలిచాయి. దాదాపుగా 20 ఏళ్ల నుండి హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ లు జాబితాను విడుదల చేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఇస్తుంది.

Read More

నిర్మాణం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందితే రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం కూడా పుంజుకుంటుందన్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగానికి పునాది పడినప్పుడే ఈ సంస్థ కూడా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీకి ప్రోత్సాహం అందిస్తున్నాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయిన ప్రజా రాజధాని అమరావతిలో 50వేల కోట్లతో పనులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఐదేళ్ల విధ్వంసంతో, అమరావతితోపాటు నిర్మాణ రంగాన్ని జగన్ సంక్షోభంలోకి నెట్టాడని అన్నారు. ఇసుక మాఫియాతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టాడని విమర్శించారు. తమ…

Read More