ఎపి-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో దీనిని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపించనున్నారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి జి. గణేష్ కుమార్, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఇన్ఫోసిస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Author: admin
ఈనెల 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు జరుగనున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ సిద్దమవుతోంది. ప్రభుత్వం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 40 కోట్ల మందికి పైగా ఈ మహా కుంభమేళాకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భద్రత కోసం పారా మిలటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాదిలో ఇటీవల మంచు భారీగా కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు అక్కడ వాతావరణం పై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్ సైట్ లో ప్రత్యేక పేజీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి 15 నిమిషాలకు వచ్చే మార్పులు సందర్శకులు తెలుసుకోవచ్చని ఐఎండీ డైరెక్టర్ మనీష్ రణాల్కర్ తెలిపారు. రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలు అందులో జారీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం మహా కుంభమేళా జరిగే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించినట్లు…
పురాణ పాత్రలతో ఇటీవల సినిమాలు విరివిగా తెరకెక్కుతున్నాయి.పురాణాల్ని వర్తమాన కాలంతో ముడిపెడుతూ సినిమాల్ని తెరకెక్కించడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది.ఆ వరసలో రూపొందనున్న సరికొత్త చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’.ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందుతోంది.మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తు్న్నారు.సత్యరాజ్,వశిష్ఠ ఎన్.సింహ,సాంచి రాయ్,సత్యం రాజేశ్,క్రాంతి కిరణ్,ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.ఆన్‌లైన్ వేదికగా మారుతి టీజర్ షేర్ చేశారు.చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.టీమ్ వర్క్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరారు. https://youtu.be/LcDvfjEXrAY?si=1ZUXgjtgH53oPAVK
విశాఖపట్నంలో అనకాపల్లి-ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ 12.66 కి.మీ ల 6-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవే నిర్మాణం కోసం రూ.963.93 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు .ఈ కారిడార్ ట్రాఫిక్ అంతరాయాలను తగ్గిస్తుంది. మరియు షీలానగర్-ఆనందపురం ట్రాఫిక్‌ను సమర్థవంతంగా వేరు చేయడం ద్వారా కార్గో తరలింపు సులభతరం అవుతుంది. విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది మరియు లాజిస్టికల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఏపీ బీజేపీ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపింది.
బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది.రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం,హబీబుల్లా అన్సారీ అనే ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్‌పుర్ రైల్వే మార్గంలో పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి దూసుకువెళ్లింది.దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.యువకులు ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని ఉండడం వల్ల తమ వైపు వస్తున్న రైలును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించారు.ఇందులో రష్మిక కథానాయిక నటిస్తుంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో జాతర సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ యాక్టింగ్‌ను సినీ ప్రియులు విశేషంగా మెచ్చుకున్నారు.తాజాగా చిత్రబృందం ఆ సీన్ ఫుల్ వీడియో విడుదల చేసింది.ప్రస్తుతం ఇది యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. https://youtu.be/Qye2HPaiB98?si=xat8FiWk_m-zp5Kq
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటయింది. ఈ మ్యాచ్ లో కూడా టాప్ ఆర్డర్ విఫలమైంది. రిషబ్ పంత్ 40 (98; 3×4, 1×6) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా 26 (95; 3×4) ఫర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. జస్ప్రీత్ బుమ్రా 22 (17; 3×4, 1×6) చివర్లో ధాటిగా ఆడాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు. భారత్ బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 185-10 (72.2ఓవర్లలో). యశస్వీ జైశ్వాల్ 10 (26; 1×4) (సి) వెబ్ స్టర్ (బి) బోలాండ్ కే.ఎల్.రాహుల్ 4 (14) (సి) శామ్ కొన్స్టాస్…
సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలని కొనియాడారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమని పేర్కొన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిన విషయం ఈసందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఘననివాళి అంటూ చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన…
‘కన్నప్ప’ చిత్రంలో రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు.తాజా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ పరమ శివ భక్తుడిగా,ఒక సన్యాసి గెటప్ లో చేతిలో పొడవైన దండాన్ని పట్టుకొని కనిపించారు.పొడవాటి జుట్టు,నుదిటిన శివ నామాలు పెట్టుకొని,మెడలో పెద్ద రుద్రాక్ష మాల ధరించి డివైన్ లుక్ లో కనిపించాడు.అయితే చిత్ర నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ లో మహా శివుడి ప్రతిరూపాన్ని మనం చూడొచ్చు.’ప్రళయ కాల రుద్రుడు..త్రికాల మార్గదర్శకుడు..శివాజ్ఞ పరిపాలకుడు” అంటూ ప్రభాస్ పాత్ర స్వభావాన్ని ఈ పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రబృందం.ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.ఇప్పటివరకు ఎప్పుడు చూడని సరికొత్త లుక్ లో కనిపించి డార్లింగ్ అభిమానులను సర్ప్రైజ్ చేసాడని చెప్పాలి. ఈ చిత్రంలో కన్నప్పగా మంచి విష్ణు నటిస్తున్నాడు.మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది.శివ పార్వతులుగా అక్షయ్ కుమార్,…
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు అయిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.తనపై నమోదు అయిన ఛార్జ్‌షీట్‌ను సవాలు చేస్తూ కొంతకాలం క్రితం హేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.దీనిపై న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది.హేమ నిషేధిత పదార్థాలను తీసుకొన్నట్లు నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.వాదోపవాదాలు విన్న న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది.సుమారు నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.
