Author: admin

తెలుగు న‌టుడు ఫిష్ వెంక‌ట్ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌గా నిలిచారు. ఈ విష‌యాన్ని ఆయ‌న తాజాగా ఓ వీడియో ద్వారా వెల్ల‌డించారు.అనారోగ్యం కార‌ణంగా సినిమాల‌కు దూరం కావ‌డంతో వెంక‌ట్‌ ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఈ క్ర‌మంలో చాలా మంది ప్ర‌ముఖ న‌టులు తెలుసు క‌నుక ఈ క‌ష్ట‌స‌మ‌యంలో ఎవ‌రినైనా సాయం కోరాల‌ని కుటుంబ స‌భ్యులు సూచించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.దాంతో సాయం విష‌య‌మై త‌న భార్య సువ‌ర్ణ ఒత్తిడి మేర‌కు ప‌వ‌న్‌ను క‌లిసిన‌ట్లు వెంక‌ట్ చెప్పారు. ప‌వ‌న్‌ను క‌లిసి,త‌న అనారోగ్య స‌మ‌స్య‌ను వివ‌రించ‌డంతో వెంట‌నే అన్ని విధాలా స‌హాయం చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు.అలాగే త‌న ఆర్థిక ఇబ్బందులను గ‌మ‌నించి త‌న బ్యాంకు ఖాతాలో వెంట‌నే రూ. 2 ల‌క్ష‌లు జ‌మ చేయించార‌ని వెంక‌ట్ పేర్కొన్నారు.ఈ క‌ష్ట‌కాలంలో ఆదుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు, ఆయ‌న…

Read More

రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి RGSA ద్వారా రికార్డ్ స్థాయిలో శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో మొత్తం 2,56,138 శిక్షణా సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానాన్ని సాధించింది. మొదటి స్థానంలో బిహార్ 2,63,623 శిక్షణలతో నిలిచింది. ఇక శిక్షణా లక్ష్యాన్ని పూర్తి చేసిన విభాగంలో 85.35% తో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్ మరియు కేరళ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. గత వైసీపీ ప్రభుత్వ హయంలో అంధ్రప్రదేశ్ 24వ స్థానంలో నిలవగా ప్రస్తుత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో 2వ స్థానానికి చేరింది. డిప్యూటీ సిఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తొలి ఆరు నెలల్లో సాధించిన పురోగతి ఇదని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read More

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.ఇక నుండి దేశీయ,అంతర్జాతీయ విమానాల్లో వైఫై సేవలు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.కాగా విమానాల్లో ఈ సేవలు అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా సంస్థ రికార్డుకు ఎక్కనుంది.అయితే వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఇక సమయం తెలియకుండానే ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం దక్కుతుందని ప్రయాణికులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.ఈ సర్వీసులు శాటిలైట్ కనెక్టివిటీ,బ్యాండ్‌విడ్త్,విమానం ప్రయాణించే మార్గం,ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా ఉంటాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ వైఫై సేవలతో ల్యాప్‌టాప్స్,ట్యాబ్‌లెట్స్, స్మార్ట్‌ఫోన్స్‌ను విమానంలో ఉపయోగించుకోవచ్చు.10 వేల అడుగుల ఎత్తున కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఎయిర్‌బస్ ఏ-350,ఎయిర్‌బస్ ఏ-321 నియో, బోయింగ్ 787-9 వంటి న్యూయార్క్,లండన్,పారిస్,సింగపూర్ వెళ్లే విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తారు.అనంతరం దశలవారీగా దేశీయ విమానాల్లో వైఫై సేవలు ప్రారంభిస్తారని తెలుస్తుంది.

Read More

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిత్యం కార్యకర్తలకు అండగా నిలిచేలా ఎన్నో ప్రయోజక కార్యక్రమాలు చేపడుతున్నారు నారా లోకేష్. ఇక ఈక్రమంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుండి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభించనుంది. కార్యకర్తల సంక్షేమ నిధి లీడర్ గా లోకేష్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్స్ ,…

Read More

ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సినిమా తీయడంలో హిందీ చిత్ర పరిశ్రమ విఫలమైంది అని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.ఆ కారణం వల్లే సౌత్ సినిమాలు,అక్కడి ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ మార్కెట్ లో రాణిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.మేము హిందీ సినిమాలు తీస్తాం.కానీ హిందీ ఆడియెన్స్ ను పట్టించుకోం…దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి సౌత్ సినిమాలను తక్కువ ధరకు కొని…వాటిని డబ్ చేసి హిందీ ఆడియెన్స్ కు అందిస్తున్నారు.ఆ విధంగా సౌత్ సినిమాలకు ఇక్కడ ఆడియెన్స్ పెరిగారు.అందువల్లే పుష్ప సినిమా ఈవెంట్ ను పాట్నాలో నిర్వహించారని అనురాగ్ అన్నారు

Read More

తాజా చెస్ ర్యాంకింగ్స్ లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి 2801 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత గ్రాండ్ మాస్టర్ ప్రపంచ ఛాంపియన్ గుకేష్ 2783 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ 2831 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన కరువానా 2803 పాయింట్లతో, 2802 పాయింట్లతో నకముర తర్వాతి స్థానాల్లో ఉన్నారు.2750 పాయింట్లతో భారత గ్రాండ్ మాస్టర్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పదో స్థానంలో నిలిచాడు. ప్రజ్ఞానంద (13వ), 23వ స్థానంలో అరవింద్, 24వస్థానంలో విదిత్, 36 వ స్థానంలో హరికృష్ణ , 41వ స్థానంలో నిహాల్, 48వ స్థానంలో రౌనక్ టాప్-50లో ఉన్నారు. మహిళల విభాగంలో 2561 పాయింట్లతో చైనాకు చెందిన వెన్జున్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ కోనేరు హంపి 2523 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 2490 పాయింట్లతో దివ్య దేశముఖ్…

Read More

మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న దర్శకుల్లో సాజిద్ ఖాన్ ఒకరు.తాజాగా ఆయన ఒక వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.గడిచిన ఆరేళ్ళు తనకు ఎంతో కష్టంగా అనిపించిందని ఆయన అన్నారు.2018 లో హౌస్ ఫుల్ 4 సినిమా షూట్ చేస్తున్న సమయంలో నాపై ఆరోపణలు వచ్చాయి.ఆ సినిమా నుండి నన్ను తొలగించేశారు.నా కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను.నాన్న మరణం తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయా…ఇల్లు అమ్మేసి..అద్దె ఇంట్లోకి వచ్చా…గడిచిన ఆరేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు.ఎన్నోసార్లు చనిపోవాలనిపించిందని,ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ యూనియన్ నాకు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా..ఇండస్ట్రీ తిరిగి అడుగు పెట్టడం చాలా కష్టంగా మారిందని సాజిద్ తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. సీఆర్డీఏ ఈ పనులు వేగవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగా అమరావతి లో పలు నిర్మాణ పనులకు ఏపీ సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. రూ.2,300 కోట్లకు టెండర్లను ఆహ్వానించింది. సీఆర్డీఏ ద్వారా రూ.1470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ.852 కోట్లతో వివిధ పనులు చేవట్టేందుకు టెండర్లు పిలిచాయి. టెండర్లు ఫైనలైజ్ అయ్యాక పలు జోన్లలో రహదారులు, తాగునీటి సరఫరా, పవర్ తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని జోన్లలో నీరుకొండ రిజర్వాయర్ కు సంబంధించి బ్యాలెన్స్ ఫ్లడ్ మిటిగేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను పిలిచాయి. అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి 22గా ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

గత నెలలో వివాహ బంధం లోకి అడుగు పెట్టారు నటి కీర్తి సురేష్.తన ప్రియుడు ఆంటోనీ తో ఆమె పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడారు.దాదాపు 15 ఏళ్ల క్రితమే తమ రిలేషన్ మొదలైందని అన్నారు.2010లో ఆంటోనీ మొదటిసారి తనకి సరదాగా ప్రపోజ్ చేశాడని ఆమె తెలిపారు.ఆయన తన కంటే 7 ఏళ్లు పెద్ద అని చెప్పారు.2016 లో ప్రేమ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు.ఆ సమయంలో ఆయన తనకి ఒక ప్రామిస్ రింగ్ ఇచ్చారని…పెళ్లి అయ్యేవరకు దానిని చేతి నుండి తియ్యలేదని ఆమె తెలిపారు. కరోనా నాటి నుండి తాము లివింగ్ టుగెదర్ లో ఉన్నామని చెప్పారు.తమ ప్రేమ విషయం ఇండస్ట్రీ లో ఉన్న పలువురు సెలబ్రిటీస్ కు తెలుసు అన్నారు.

Read More

2024 డిసెంబర్ 31న ఉదయం సీఎం పల్నాడు జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలుకు ఇంటి వద్దే పింఛను అందజేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీసారు. గాలి మిషన్ ద్వారా వాహన టైర్లకు గాలి నింపి జీవనం సాగిస్తున్నానని, ప్రస్తుతం గాలి మిషన్ పాడై ఆదాయం ఇబ్బందిగా మారిందని ఏడుకొండలు సీయం దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏడుకొండలుకు వెంటనే నూతన గాలి మిషన్ అందజేయాలని కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు, 24 గంటల్లోనే ఏడుకొండలుకు కొత్త గాలి మిషన్ను కలెక్టర్ అందజేశారు.

Read More