Author: admin

తండ్రి నుంచే తాను లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని నటి ఖుష్బూ మరోసారి తెలిపారు. ఆయన వల్ల చిన్నతనంలోనే తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని అన్నారు.మా నాన్న వల్ల మా కుటుంబం మొత్తం వేధింపులు చూశాం. అమ్మను బాగా కొట్టేవాడు.నా సోదరులను కూడా ఆయన చితకబాదే వాడు.నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.నా పై జరుగుతున్న దాడి గురించి అమ్మకి ఎలా చెప్పాలో తెలియలేదు.రాను రాను నేను ధైర్యంగా నో చెప్పడం నేర్చుకున్నా.అది నచ్చక కొన్నిసార్లు ఆయన షూట్ కు వచ్చి కొట్టేవాడు.14 ఏళ్ల వయసులో నాపై జరుగుతున్న దాడి గురించి బయటకు చెప్పగలిగా.కొంతకాలానికి ఆయన అందరినీ వదిలి వెళ్ళిపోయారు.అప్పటి నుంచి ఆయన్ని మళ్ళీ కలవలేదు.గతేడాది చనిపోయారు అనుకుంటా అని ఖుష్బు చెప్పారు.

Read More

దేశంలో ఉద్యోగాలు ఈ పదేళ్ల ఎన్డీయే హాయాంలో 36% పెరిగినట్లు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ఎన్డీయే మొదటిసారి అధికారం చేపట్టినపుడు 2014-15లో దేశంలో 47.15 కోట్ల ఉద్యోగాలు ఉండేవని, 2023-24 నాటికి అవి 64.33 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. యూపీఏ హయాంలోని 2004-2014 మధ్య పెరిగిన ఉద్యోగాలు 7 శాతమేనని యూపీఏ పాలనలో 2.9 కోట్ల అదనపు ఉద్యోగాలు వస్తే ఎన్డీయే హయాంలో 17.19 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. 2023-24 ఒక సంవత్సరంలోనే 4.6 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని తెలిపారు. 2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2023-24లో 3.2 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. ఇక యూపీఏ హయాంలో పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల పెరుగుదల కేవలం 6 శాతంగా ఉండగా… ప్రస్తుత ప్రభుత్వ పాలపలో 15 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఏ పాలనలో సర్వీస్ సెక్టార్ ఉద్యోగాలు 25 శాతం…

Read More

వందే భారత్ స్లీపర్ ట్రైన్ లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోలో ట్రైన్ అంత గరిష్ట వేగం లోనూ గ్లాసు లో నీరు ఒలకకుండా ఉంది. ముందుగా జనవరి 1న రైలును కి.మీ వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్ లోని కోటా నుండి లబాన్ స్టేషన్ల మధ్య 180 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. సాధారణ ప్రయాణికులకు సమమైన బరువును ఆసమయంలో రైల్లో ఉంచారు. పలు విధాలైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలోనూ ఈ…

Read More

కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది.హ్యూమన్ మెటానిమోవైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా,నిమోనియా,కొవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు.దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ..దీనిపై ఇంకా స్పష్టత లేదు.ఈ వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాప్తిని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read More

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలని అన్నారు. తాను కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానని ఇంటర్ తో చదువు ఆపేసాను కానీ చదవడం ఆపలేదని పేర్కొన్నారు. చదవడం వల్ల మానసిక శక్తి ఏర్పడుతుందని చెప్పారు. మనం తెలుగు వారీగా పుట్టడం మన అదృష్టం. తెలుగు ఎంత గొప్ప భాష అంటే ఎవరికైనా తేలిగ్గా జ్ఞానోదయం చేసే గొప్ప సాహిత్యం ఉందని పేర్కొన్నారు. పాపులారిటీ ఉన్న ప్రతి వారు గొప్ప వారు కాదని జ్ఞానం ఉన్నవారు, రచయితలు గొప్ప వారని అన్నారు. పుస్తకం నచ్చిందా లేదా అని కాదు. అసలు ఒక పుస్తకంలో ఒక పేజీ రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటే రచయితలపై గౌరవం కలుగుతుందని పేర్కొన్నారు.

Read More

కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను ఈరోజు సాయంత్రం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ. 2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుంది. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు వీలుగా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనంలో ఏడు రకాల పరికరాలు అమర్చారు. వారంలో మూడు రోజులపాటు ఒక మండల పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ అల్ట్రా సౌండ్, మొమోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్ రే, కెమికల్ అనాలసిస్, కొలస్కోపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్యాన్సర్ ను ముందుగానే…

Read More

విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ లు ఆమోదించారు. డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు పి.నారాయణ, బిసి జనార్థన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పీవీపై పుస్తకం… అందుకున్న సీఎం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు, ఆయన రాజకీయ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ అప్పరుసు కృష్ణారావు రచించిన పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు నేడు అందచేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు: అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులు , సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదం. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్సు కు కేబినెట్ అంగీకారం. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు ఆమోదం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం. ఎస్ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. కడప, నంద్యాల, కర్నూల్ జిల్లాల్లో సోలార్, విండ్ ప్లాంట్లు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్ర వ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు రిలయన్స్…

Read More

దేశ ప్రతిష్టను పెంచిన నలుగురు క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ప్రతిష్టాత్మక ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జునా, ద్రోణాచార్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎయిర్ గన్ షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్, భారతీయ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, హాకీలో ఒలింపిక్ పతక విజేత టీమ్ సభ్యుడు హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ లో ఒలింపిక్ పతక విజేత ప్రవీణ్ కుమార్ లను ఈ సందర్భంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. చదరంగంలో బాల్యం నుంచే ప్రతిభ కనబరుస్తూ, చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ 2024 చెస్ టోర్నమెంట్‌ లో విశ్వ విజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ప్రతిష్టాత్మక…

Read More

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్‌.ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు.బాబీ డియోల్ చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా కొత్త పాటను విడుదల చేసింది.‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ పాటను తమన్‌,వాగ్దేవి పాడారు.ఈ పాటలో బాలకృష్ణతో నటి ఊర్వశీ రౌతేలా డ్యాన్స్‌ చేశారు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. https://youtu.be/ARGbxFY9McA?si=Uu7FU2_3OUumHtZ6

Read More