Author: admin

పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే వివిధ శాఖల్లో అద్బుత ఫలితాలు సాధించవచ్చని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో ఆయన నూతన సంవత్సరం సందర్భంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Read More

భారత్ కు చెస్ లో గతేడాది బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త ఏడాది కూడా చదరంగంలో శుభారంభం దక్కింది. బ్లిట్జ్ లో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి అత్యద్భుతమైన ప్రదర్శనతో మంచి ఆరంభం ఇచ్చింది. తాజాగా ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం సాధించింది. క్వార్టర్ ఫైనల్ లో 2.5-1.5 తో చైనాకు చెందిన జు జినర్ పై విజయం సాధించింది. సెమీస్ లో 0.5-2.5తో జూ వెన్ జున్ చేతిలో ఓడింది. దీంతో కాంస్యం దక్కింది. ఆమె విజయం సాధించడం పై భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసించారు.

Read More

రాజస్థాన్ బోర్ బావి ఘటన విషాదాంతమైంది.గతేడాది డిసెంబర్ 23న 150 అడుగుల లోతున్న బోరులో పడిపోయిన చేతనను దాదాపు 10 రోజుల రెస్క్యూ తర్వాత సజీవంగా బయటకు తీసుకువచ్చారు.వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.ఇన్ని రోజులు ఆమెకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఆక్సిజన్ పంపింగ్ చేసింది.10 రోజులపాటు లోపల నరకం అనుభవించి కొన ఊపిరితో ఉన్న చేతన (3)ను ఇవాళ బయటకు తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించింది.దీనితో చిన్నారి తల్లితండ్రులు,గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read More

రేషన్ బియ్యం వివాదం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ విచారణ నేడు జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ తమ సొంత గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో ఏ1గా ఉన్న జయసుధకు నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పేర్ని జయసుధ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మచిలీపట్నం పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆర్ పేట సీఐ ఏసుబాబు ఆమెను విచారించారు. దాదాపు 2 గంటల సేపు విచారణ కొనసాగింది.

Read More

కొత్త సంవత్సరం తొలి రోజు 1,600 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.24 కోట్లు విడుదల చేసే ఫైల్ పై ఏపీ సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అంటే డిసెంబర్ 31 వరకు 7, 523 మందికి రూ.100 కోట్ల మేరకు సాయం చేయగా… ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేటికి మొత్తం 9, 123 మంది పేదలకు రూ. 124.16 కోట్ల సాయం అందించినట్లు అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గవర్నర్ ను కలిసిన సీఎం చంద్రబాబు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Read More

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అభిమానుల కోసం ప్రత్యేక వీడియో విడుదల చేశారు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆయన సతీమణి గీత. శివన్న ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు.ఆయన క్యాన్సర్ నుండి కోలుకున్నానని తెలిపారు.అందరికీ నమస్కారం…మీ అంద‌రికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు…మీ ప్రార్థనలు నిజమయ్యాయి.శివరాజ్ కుమార్ క్యాన్స‌ర్ నుండి పూర్తిగా కోలుకున్నాడు.ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు…త్వరలోనే కర్ణాటకకు తిరిగొస్తామని శివ రాజ్ కుమార్ సతీమణి తెలిపారు.ఈ మేరకు శివ‌రాజ్ కుమార్ స్పందిస్తూ…నా క్యాన్స‌ర్ చికిత్స చివరి దశకు చేరుకుంది.త్వరలోనే మీ ముందుకు వస్తాను అన్నారు.క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని…అయితే ఆ భయం నుండి బయటపడేందుకు తన భార్య గీత,తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు.

Read More

రజనీకాంత్‌ కథాయకుడిగా నటించిన ఓ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నటి ఖుష్బూ. అందులో యాక్ట్‌ చేసినందుకు తాను ఎంతో బాధపడ్డానని అన్నారు.కథ చెప్పినప్పుడు తన పాత్రకు సినిమాలో వచ్చినదానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.‘మీనా నేను ఆ సినిమా యాక్ట్‌ చేశాం…రజనీకాంత్‌ పక్కన మా ఇద్దరివి కీలక పాత్రలని మొదట మాకు చెప్పారు.ఆయనతో డ్యూయెట్స్‌ కూడా ఉంటాయన్నారు.వేరే కథానాయికలు ఎవరూ ఇందులో ఉండరని భావించి వెంటనే ఓకే చెప్పా.తీరా చూస్తే ఇందులో వేరే కథానాయికగా భాగం చేశారు.డబ్బింగ్‌ సమయంలో సినిమా చూసి ఎంతో బాధపడ్డా.ఎందుకు నటించనా? అనిపించిందని ఖుష్బూ తెలిపారు.అయితే తాను ఏ సినిమా గురించి అనేది మాత్రం చెప్పలేదు.ప్రేక్షకులు మాత్రం ఆమె ‘అన్నాత్తే’ గురించే చెబుతున్నారని భావిస్తున్నారు.రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సినిమాలో మీనా,ఖుష్బూ నటించారు.నయనతార కథానాయికగా నటించారు.ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం 2021లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది.

Read More

పాకిస్థాన్‌ నేటి నుండి ఐక్యరాజ్యా సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరింది.దీనిపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్‌ అక్రమ్‌ మాట్లాడుతూ తమ దేశం చురుకైన నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు.ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం తమ బృందం యత్నిస్తుందన్నారు.2026డిసెంబరు వరకు ఐరాసలోని 10 తాత్కాలిక సభ్యదేశాల్లో ఒకటిగా ఉంటుంది పాకిస్థాన్‌. ఇప్పటి వరకు జపాన్‌ ఉన్న ఈ స్థానంలో ఇక నుంచి పాక్‌ వచ్చి చేరనుంది.దీంతో పాటు డెన్మార్క్, గ్రీస్‌, పనామా, సోమాలియా దేశాలు కూడా కొత్తగా భద్రతా మండలిలోకి వచ్చాయి.గతంలో పాకిస్థాన్‌ 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69, 1952-53లో భద్రతా మండలితో కలిసి పనిచేయడం గమనార్హం.

Read More

వాట్సప్‌ వేదికగా ఎక్కువగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారూ – హోంమంత్రిత్వ శాఖ ఈ ఇంటర్నెట్‌ యుగంలో సైబర్‌ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్‌ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు.ఈ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్‌ ప్లాట్‌ఫాట్‌ ‘వాట్సప్‌’నే వినియోగిస్తున్నారని తెలుస్తుందని ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. వాట్సప్‌ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఉన్నట్లు పేర్కొంది. 2023-24 సైబర్‌ మోసాల జాబితాను హోంశాఖ తాజాగా విడుదల చేసింది. 2024 తొలి మూడు నెలల్లో వాట్సప్‌ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇక, టెలిగ్రామ్‌లో మోసాలపై 22,680,ఇన్‌స్టా వేదికగా జరిగే నేరాలపై 19,800 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

Read More

హెచ్‌1బీ వీసా అంశం పై అమెరికాలో విస్తృత చర్చ జరుగుతోంది.అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.అమెరికాకు సమర్థవంతులైన వ్యక్తులు కావాలని ఎప్పుడూ భావిస్తుంటానని అన్నారు.మన దేశానికి సమర్థత కలిగిన ప్రజలు కావాలని నేను ఎల్లప్పుడూ భావిస్తాను.తెలివైనవారు మన దేశానికి రావాలి. మునుపెన్నడూ లేని స్థాయిలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి’’ అని కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటుచేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(DOGE)కి సంయుక్త సారథులుగా నియమితులైన మస్క్‌,వివేక్‌ రామస్వామి గతంలో ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. యూఎస్‌ తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్‌లను తయారుచేస్తున్నందున ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గలవారిని దేశంలోకి అనుమతించడానికి హెచ్‌1బీ వీసా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలన్నారు.ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటిస్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతివ్వాలని కోరారు.

Read More