దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు.ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ డబ్బు పంచుతుందని ఆరోపించారు.దీన్ని ఆరెస్సెస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు.అయితే ఆయన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు లేఖ రాశారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు.ఓట్ల కొనుగోలును ఆరెస్సెస్ సమర్థిస్తుందా?ప్రజాస్వామ్యానికి ఇది సరైనదని మీరు భావిస్తున్నారా?.ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని మీకు అనిపించడం లేదా?’ అని భాగవత్‌ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Author: admin
భారతదేశం సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ నిర్దేశించిన విధివిధానాల ప్రకారం చేసిన రీ-వెరిఫికేషన్‌లో ఈ పొడవు 11,098.81 కిలోమీటర్లుగా తేలింది. గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా.. రీవెరిఫికేషన్‌లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో ఈ మొత్తం ఉన్నట్లు తేలింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో కొత్త ఏడాది సంబరాలు వేళ చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారు.ఒక్క రాత్రిలోనే 17,800 వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు బుధవారం ఉదయం వరకూ స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన వారి పై మొత్తం రూ.89.19 లక్షలను జరిమానాల రూపంలో విధించినట్లు ప్రకటించారు.మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం,సిగ్నళ్లు జంప్ చేయడం, డ్రంకన్ డ్రైవ్ కేసులు వీటిల్లో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభ రోజైన నేడు కేంద్ర కేబినెట్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ రైతులకు అంకితం చేసినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైతుల సంక్షేమం గురించి ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచే దిశగా కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను రూ.69,515 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇక 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350 చొప్పున రైతులకు అందించేందుకు రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ గురించి కేంద్రమంత్రి వివరించారు. కేబినెట్ సమావేశం గురించి ప్రధాని మోడీ ట్వీట్: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మన దేశాన్ని పోషించడానికి కష్టపడి పనిచేసే మన రైతు సోదర, సోదరీమణులందరి పట్ల గర్విస్తున్నామని…
ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో 78,507 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించింది. 98 పాయింట్లు లాభపడి 23,742 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.79గా కొనసాగుతోంది. మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్.సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జొమాటో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టాలతో ముగించాయి.
ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం ఎమ్మెల్యేగా , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా నేతృత్వంలో గత ఆరున్నర నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారం సమగ్ర అభివృద్ధి నివేదిక – 2024 పేరిట విడుదల చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారం లోకి వచ్చిన ఈ ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే వివరాలను డిప్యూటీ సీఎం ‘ఎక్స్’ లో షేర్ చేశారు. ఇందులో భాగంగా రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో పేదల పెళ్లిళ్ల కోసం టీటీడీ కళ్యాణ మండపం, సీహెచ్ సీని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, రూ.72 లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి…
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం చంద్రబాబుకు పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు ఏపీ సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాన్ని ఈఓ శ్యామలరావు ఆయన కు అందజేశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత జట్టు ప్రదర్శనపై అభిమానుల నుండి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా నాలుగో టెస్టులో ఓటమితో కోచ్ గంభీర్ పైనా, సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరి ప్రదర్శన తీవ్రంగా నిరాశ కలిగించింది. విరాట్ ఈ సిరీస్ లో సెంచరీ చేశాడు. మిగిలిన సార్లు నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఆటగాళ్లు ఇద్దరూ వైదొలగాలని మరోవైపు గంభీర్ కూడా ప్రధాన కోచ్ పదవికి అనర్హుడంటూ సోషల్ మీడియా లో కామెంట్ లు చేస్తున్నారు. ఈక్రమంలో ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లీమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ వీరిద్దరూ రిటైర్ అయినా భారత క్రికెట్ కు ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడ్డాడు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్ పై…
దేశంలోనే అత్యంత చిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలో ఓ ఇంటివారు కానున్నారు.బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇటీవల రెండోసారి గెలిచిన ఆయన మార్చి నెలలో వైవాహిక బాంధంలోకి అడుగు పెట్టనున్నారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్ ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే స్వయంగా ప్రకటించారు. మార్చి 24న ముహూర్తం నిర్ణయించినట్లు వెల్లడించారు.
కుటుంబ కలహాలతో ఇటీవల నటుడు మోహన్ బాబు కుటుంబం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కుటుంబం మరోసారి వివాదంలో నిలిచింది. జల్ పల్లి అటవీప్రాంతం పక్కనే ఆయన ఇల్లు ఉంది. అక్కడ నెమళ్లు, జింకలు,ఇతర వన్యప్రాణులు ఉన్నాయి.మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్ మరో ఇద్దరితో కలిసి తాజాగా అడవిపందిని వేటాడి ఇంటికి తీసుకెళుతున్న వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. దీనిని చూసిన పలువురు నెటిజన్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు మంచు విష్ణు, అతని సిబ్బంది తనని ఇబ్బంది పెడుతున్నారని ఇటీవల మనోజ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు.
